మంచి మాట

సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో చాలా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశంగా ఏర్పడింది. ఒక దేశంలో పుట్టి పెరిగినవారంతా ఒక జాతివారు. అయినా ఎన్నో మతాలకు, సంప్రదాయాలకు చెందినవారు జాతీయ భావనచే ప్రభావితులై ఒక దేశ వాసులుగా మెలుగుతున్నారు. జాతీయ సంస్కృతికి మారుపేరయినది.
మానవ సంస్కృతి మనిషి భూమిపై జన్మించినప్పటినుంచీ అనేక మార్పులకు లోనై నేటి దశకు చేరుకొంది. మనిషి భావ సంపద పెరిగే కొలదీ నాగరికత సంస్కృతులు ఫెరుగుతూనే ఉంటాయి. కాలానుగుణంగా అవి ప్రభావితమవుతూనే ఉంటాయి. అయితే సంస్కృతికి నాగరికతకు స్పష్టమైన భేదం ఉంది.
నాగరికత అంటే నగర ప్రజల జీవన విధానం అని అర్థం. నాగరికత కలవారందరూ సంస్కృతీ పరులు కాకపోవచ్చు. నాగరికత వేషభాషలకు, ఆచార వ్యవహారాలకు చెందినది. సంస్కృతి మనోవికాసానికి, హృదయ సౌందర్యానికి, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినది. నాగరికత బాహ్య జీవితం అయితే సంస్కృతి అంతర జీవితం.
నాగరికత దేహధర్మమైతే, సంస్కృతి ఆత్మధర్మం. విభిన్న జాతులకు నాగరికతలోను, సంస్కృతిలోను భేదాలు ఉంటాయి. తొలి మానవుడు వేంటనే వృత్తిగా స్వీకరించి సంచార జీవితం గడిపాడు. తరువాత స్థిరనివాసం ఏర్పరచుకుని వ్యవసాయం ప్రారంభించాడు. తాను వాడుతున్న వస్తువులను అందంగా తీర్చిదిద్దుకున్నాడు.
క్రమంగా రాజ్యాలు, ప్రభుత్వాలు అవతరించాయి. భాష, లలితకళలూ అభివృద్ధి చెందాయి. ఈ విధంగా మనిషి ఎప్పటికప్పుడు తన భావాలను సంస్కరించుకుంటూ, భావ సంపదను పెంపొందించుకుంటూ పురోగమిస్తున్నాడు. అయితే సంస్కృతి సంఘంలోని అధిక సంఖ్యాకుల జీవన విధానమే తప్ప వ్యక్తిగతమైన వారసత్వం కాదు.
అది భూతకాలపు ప్రతిబింబం. ఆచార వ్యవహారాల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది. సమాజ సాంఘిక, నైతిక అవసరాలను తీర్చుతూ ఒక క్రమపద్ధతికి లోబడి ఉంటుంది. మన భారతీయ సంస్కృతి ప్రధానంగా ఆధ్యాత్మిక సంస్కృతి. అమెరికా వారిది లౌకిక సంస్కృతి. సంస్కృతుల మధ్య ఈ విధమైన వైవిధ్యం ఉంటుంది.
ఏదో ఒక ప్రత్యేకత లేనిదే ఏదీ సంస్కృతి కాజాలదు. మానవుని కనీస అవసరాలు తీర్చుకునే పద్ధతుల్లో అన్ని సంస్కృతులకు పరస్పర పోలికలు ఉంటాయి. ప్రతి సంస్కృతిలోనూ దేశ రక్షణ, కుటుంబ వ్యవస్థ, శాస్త్ర విజ్ఞానం తప్పనిసరి అవుతాయి.
అయితే కులం పేరిటా మతం పేరిటా పోట్లాటలూ, ఘర్షణలూ జరుగుతున్నాయి. దీనివలన ప్రజలు ఆస్తిపాస్తులకు తీరని నష్టం వాటిల్లుతోంది. హింసాకాండ చెలరేగుతుంది. పొరుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు, నదీ జలాల వివాదాల్లాంటివి జాతీయతా భావాన్ని మట్టుపెడుతున్నాయి. అంతేగాక ఉద్యోగాలలో, విద్యావకాశాలలో వివాదాలు తలెత్తి భారతీయుల మధ్య ఐక్యతను బలహీన పరుస్తున్నాయి. భాషా దురభిమానం, ప్రాంతీయతత్వం దేశ సమైక్యతను, సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నాయి.
నిజానికి వ్యక్తిగతంగా కూడా సంస్కృతి అమూల్యమైనది. సాంఘిక జీవితంలో అది ప్రధాన పాత్ర వహిస్తుంది. సామాజిక సంబంధాలను పదిలంగా ఉంచుతుంది. వ్యక్తిగతమైన కోర్కెలను అదుపులో ఉంచి, వ్యక్తిని సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దుతుంది. సంఘజీవితానికి సిద్ధం చేస్తుంది. వ్యక్తుల మధ్య పరస్పర సహకారం పెంపొందే సామాజిక దృక్పథం పెంచుతుంది.
కుటుంబం, దేశం, జాతి మొదలైన వానిలో సభ్యునిగా మనిషి తన ధర్మం నెరవేర్చడానికీ, అతడి యధార్థ జీవన వికాసానికీ సంస్కృతి తోడ్పడుతుంది. విభిన్న సంస్కృతుల మధ్య సహనాన్ని పెంపొందిస్తుంది. మానవ జాతి అభ్యుదయానికీ, ఆధ్యాత్మిక పురోగమనానికీ దోహదం చేస్తుంది. కనుకనే మన పూర్వులు సహనం సంస్కృతి యొక్క ప్రథమ లక్షణమనీ, సంస్కృతి సమాజంలోని సర్వాంశాల సముదాయమనీ చెప్పారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు