మంచి మాట

భగవంతుని తత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కీశు కీశున్రు ఎంగుం అనై చ్చాతన్ కలన్డు’’ - ‘‘కేశవా కేశవా అని భరద్వాజపక్షులు కేశవనామాలను గానం చేసేస్తున్నాయి. అందరూ రండి మనమందరం కలసి భగవంతుని నామాలను జపిద్దాం అని మార్గశిరమాసంలో వచ్చే ధనుర్మాసంలో తిరుప్పావై చదివేవారంతా పిలుస్తుంటారు. భగవంతుడు సర్వాంతర్యామి. అందరి హృదయనివాసుడు. భగవంతుడు లేని చోట లేదు. కాని మానవమాత్రులు భగవంతుణ్ణి కొలవడానికి ఆలయాలను నిర్మించుకున్నారు. అక్కడ భగవంతునికి మారుగా విగ్రహ ప్రతిష్ఠలు చేసుకొన్నారు. ఆ విగ్రహానే్న భగవంతునిగా కొలుస్తారు. అనంత నామధారి యైన భగవంతుణ్ణి ఎవరికి ఇష్టమొచ్చిన పేరు వారు పెట్టుకుని పిలుస్తుంటారు.
ఆ భగవంతుణ్ణే పూతాత్మ అంటారు. పవిత్రమైన ఆత్మ గలవాడు. భగవంతుడే అందరినీ సృష్టించే వాడు. అందరినీ పాలించేవాడు. అందరినీ సంహరించేవాడు కూడా ఆయనే. కాని ఆయనకు ఎటువంటి మలినము అంటదు. అందుకే ఆ పరమాత్మను పూతాత్మ అని సంబోధిస్తారు.
భగవంతుని చేత సృష్టించబడిన మానవులు బంధాలలో బందీలౌతారు. రాగాలలో కూరుకుపోతారు. వారంటే అభిమానం వీరంటేఇష్టం అంటూ వారిపై మమకారాన్ని పెంచుకుని అందునుండి విడవడానికి నిస్సహాయులౌతారు. అందుకే మానవులకు సుఖదుఃఖాలు కలుగుతుంటాయ. కాసేపైనా బంధం లేకుండా మనిషి జీవించలేడు. నాకు ఎవరూ లేరనే చింతలో కొట్టుకుని పోయ పిచ్చివానిగా మారు తుంటాడు. జిజ్ఞాసువు, జ్ఞానులు మాత్రం అందరినీ సమానంగా చూస్తారు. అందరితోను మిత్రత్వానే్న కలిగిఉంటారు. అందరియెడ సమభావాన్ని చూపిస్తారు. అందరినీ చిరునవ్వుతోనే పలుకరిస్తారు. కాని వారిపై ఎటువంటి మమకారాలను పెంచుకోరు. కనుక వారుబంధితులుకారు. అట్టివారు భగవంతునికి దగ్గరవారవుతారు.
ఇలా బంధితులు కాకుండా ఉండాలంటే ముక్కుమూసుకొని అడవులకువెళ్లి తపస్సు చేయనక్కర్లేదు. జనకమహారాజు భగవంతుని తత్వాన్ని ఎరిగిన జ్ఞాని కాని మిథిలానగరానికి రాజుగా ఉంటూనే సీతమ్మకు తండ్రిగా ఉంటూనే అటు రాజ్య భారాన్ని మోస్తూనే ఇటు బంధుత్వాలను మెరుగుపరుచుకుంటూనే భగవంతుడికి దగ్గరగా ఉన్నాడు. కనుకనే ఆయన్ను శుకమహర్షి వచ్చి భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చమని అడిగాడు.
ఇలా ఉండాలంటే కేవలం ఒకటేమార్గం. అదే భగవంతుని తత్వాన్ని ఎరుకప ర్చుకొనడం. భగవద్గీతలో స్వయంగా భగవానుడే సర్వానికి కారణాకారణుడను నేను అనిచెప్పినదాన్ని అనుక్షణం గుర్తుంచుకుని స్వామి అన్నింటికి కారణుడవు నీవు. నాది అనేది ఏదీ లేదు. సుఖమొచ్చినా కారణం నీవే దుఃఖమొచ్చినా కారణుడవునీవే అని నమ్మితే ఆ నమ్మకమే భగవంతుని సాయుజ్యానికి దారి చూపుతుంది.
ఈ జనన మరణ చక్రం నుంచి విడవడి భగవంతునికి మారురూపుగా మారుతాం. భగవంతునికి భక్తుని అభేదం అంటే ఆ భక్తుడే భగవంతుడైనట్టు. కనుక భక్తులల్లాగా సామాన్యులు భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకొంటూ సర్వమూ భగవంతుడని నమ్మితే ఆ పూతాత్మలకు దగ్గర ఉండే జీవాత్మ పరమాత్మగా మారుతుంది. అందరి హృదయాల్లో భగవంతుడునాడన్న నమ్మకంతో పరులలో పరమాత్ముని అంశాన్ని చూడడం సులభతరవౌతుంది. నరుల సేవ నారాయణుని సేవ అని నమ్మి దీనులను ఆర్తులను ఆదుకోవాలి. నా హృదయంలో ఉండే పరమాత్మనే నన్నీ పనులకు నియోగించాడన్న నమ్మకాన్ని పెంచుకుంటే ఎవరిలోనూ అహంకారం ఉదయంచదు. అహంకారమే లేకపోతే వారే పరమాత్మస్వరూపులు. పూతాత్మలు అవుతారు. కనుక అందరూ ఆ భగవంతుని నామాన్ని విడవక నిరంతరం జపిస్తే ఆ పరమాత్మ తత్వం తేటతెల్లవౌతుంది. మనమూ భగవంతుని మారుగా మారుతాము.

- హనుమాయమ్మ