మంచి మాట

కర్మబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పుట్టుకనుండి మరణం వరకు జరిగేది జీవన ప్రయాణం. జీవికి జన్మ పరంపరలు తప్పనిసరియైనవి. జీవికి జన్మ లేకుండా మోక్షము అనేది కడు దుర్లభం. జన్మ పరంపరల్లో మానవ జన్మ దొరకడం గొప్ప అదృష్టం. జన్మరాహిత్య సాధనకై దొరికిన సువర్ణ అవకాశం. మనిషి పుట్టుక - మరణం మధ్య ప్రయాణం అన్నీ భగవంతుని నిర్దేశంగా జరిగేవి తన ప్రమేయంతో జరుగుతున్నాయని జరుపుతున్నానని అనుకోవడం జరుగుతుంది.
మానవులు త్రిగుణాల మాయా బంధితులు. రాజ, తమోగుణాలతో అహంకార, మమకారాలచే జనించిన రాగ ద్వేషాలతో ప్రవర్తిస్తూ వుంటారు.
జగత్తునకు ఆధారం భగవంతుడనే సత్యాన్ని విస్మరిస్తూ కామప్రేరితులై స్ర్తి, పురుష సంయోగ కారణముగా జీవులు సహజముగా పుట్టుచున్నారని, సృష్టికి కామం తప్ప వేరొక కారణము లేదని యుధావించడం పూర్తిగా అసుర లక్షణము. గీతాచార్యులు చెప్పినది అక్షర సత్యం.
‘పెట్టి పుట్టారు’ అని లోకంలో జీవనం బాగా జరుగుతున్న వారిని చూసి లోకులు అనే మాట నిజమే! గత జన్మలో మంచి కర్మలచే దాచుకున్నదే ఈ జన్మలో లభించగా అనుభవించడం జరుగుతుంది. అలాగే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ కూడా భగవంతుడే చేసాడనో, ఇతరులు తమ పట్ల కల్పిస్తున్నవనో అనుకోవడం అజ్ఞానం.
సిరిసంపదలు పెట్టి పుట్టినట్లే కష్టాలకి కూడా దుష్కర్మలు చేసి ఫలంగా ఇప్పుడు అనుభవంలోకి వచ్చేవి అవే! ఇది సత్యం. ఋణానుబంధం రూపేణ పశుపత్ని సుత లయని అంటారు కదా! సిరిసంపద అంటే మానవులు తాము సంపాదించుకున్నవనో తమ వారు సంపాదించి ఇచ్చినవనో అహంకరిస్తూ ఉంటారు.
కష్టాలొస్తే మాత్రం భగవంతుడు కల్పించాడని, తమకే ఎందుకు వస్తున్నాయనో వాపోడం జరుగుతుందే తప్ప తమ ప్రారబ్ద కర్మానుసారం జరుగుతున్నవనే అనుకోవడం జరగదు. లోకములో ఘనాఘనాలు పుట్టుకలోను జీవితంలో వున్నట్లే, మరణంలో కూడా అతి సహజంగా ఉంటాయి. ఒక్కో ప్రాణి అనాయాసంగా, సునాయాసంగా మరణం సంభవిస్తూ వుంటుంది. మరికొంతమంది పట్ల ఎంత ఆ వ్యక్తి కోరుకున్నా కూడా మరణం కరుణించడం జరగదు. ఇది కూడా వ్యక్తి తెచ్చుకున్న కర్మఫలమే!
మనుష్యులు (జీవులు) కర్మలు (పనులు) చేయనిదే ఒక్క క్షణం కూడా వీలవుదు. తప్పనిసరిగా పనిచేయవలసినదే. తన పని తినకున్నా తప్పదని అంటూంటారు. ఎవరు చేయవలసిన పని వారు తప్పనిసరిగా చేయాలి. అది కూడా త్రికరణశుద్ధిగా, ఏది ఆశించకుండా కష్టపడటం, సంపాదించు అనుభవించు. ఏదైనా ధర్మయుక్తంగా ఒక్క విషయంగా చెప్పుకోవచ్చును. ఒక తల్లి తన బిడ్డను మమకారంకంటే బాధ్యతతో పెంచుతుంది. ఒక ఉద్యోగి వేతనం కోసమే అయినా ఉద్యోగ ధర్మంగా పనిచేయాలి. వీటిలో అంతర్లీనంగా ఒక సత్యం వుంది. తల్లి ఏ పని చేస్తున్నా, నిద్రిస్తూన్నా పిల్లవానిపై దృష్టి తప్పక ఉంటుంది.
ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా సామర్థ్యంతో పనిమీద దృష్టి, పని భగవంతునికోసం, రణమైనా, రుణమైనా, ద్వంద్వాలైనా భగవంతుడిచ్చిన ప్రసాదాలుగా స్వీకరించగల భావన పెంపొందించుకుంటే జీవన యాత్రలో కర్మలు, ఫలాలుకై పరుగులుండవు.
మనుష్యులకు తమ పుట్టుక తెలియదు. మరణం ఎప్పుడనేది తెలియదు. మధ్య జీవితం తమదనుకోవటం జరుగుతుంది. తమది ఎంతవరకు అంటే మంచి చేయడం ధర్మంగా ప్రవర్తించడం తమ కర్తవ్యముగా చేస్తూ పోవాలే తప్ప కర్తృత్వం కర్మలు చేయడంవరకే, ఫలితాలకు కర్తలుగా భావించకుండా ఫలాలన్నీ పరమాత్మకే అనే భావనలో కర్మలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రవర్తించడం చాలా కష్టమనే చెప్పాలి.

- గంటి కృష్ణకుమారి