మంచి మాట

చైతన్యస్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ వసంతానికి ఆహ్వానం పలకడానికి వచ్చేది ఫల్గుణం అంటారు. ఈ మాసాన్ని ‘నవపల్లవ’ మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఫల్గుణంలోని రెండవ భాగంలో నే చెట్లు అన్నీ చిగిరించడం మొదలుపెట్తాయ. వసంతుని ఆగమానికి మేము ఎదురుచూస్తున్నామని చెప్పడానికా అన్నట్టు అపుడప్పుడే పూతకు వస్తున్న మామిడి కొమ్మలపైన కోకిలలు, సాధారణంగా మామిడికి దగ్గర దగ్గరే ఉంటూ చిరుచేదును పంచే వేపపూత మెత్తని గుబాళింపు ముక్కు పుటాలకు సోకుతూ ఉండగా గొంతు సవరించుకుంటూ ఉంటాయ. అట్లాంటి ఈ మాసానికి అధిపతి గోవిందుడు.
ఫల్గునీ నక్షత్రంలో కలిసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయంచే మాసం ఫాల్గునం. ఫల్గునీ నక్షత్రం ‘పూర్వఫల్గుని’ - ‘పుబ్బ’; ‘ఉత్తరఫల్గుని’- ఉత్తర అని రెండు నక్షత్రాలు ఈ రెండింటిలో దేనితో కలిసి చంద్రుడు ఉదయించినా అది ఫాల్గుణ మాసమే అని పిలుస్తుంటారు.
చాంద్రమాన కాలగణన ప్రకారం చివరిది సంవత్సరంగాను. ఋతువుల్లో కడపటి శిశిరంలో చివరిదేఈ ఫాల్గుణం. ‘హోలాక పౌర్ణమి’ లేదా ‘హోళీ పండుగ’ అన్న పండుగే ఈ ఫాల్గుణమాసానికి ప్రత్యేకత. ‘హోళీ పండుగ’ను భారతదేశమంతటా జరుపుకుంటారు. ఫాల్గుణంలో మొదటి 12 రోజులు ‘‘పయోప్రతం’’ పేరులో శ్రీకృష్ణుని ఆరాధించి, క్షీరాన్నాన్ని నివేదించి భాగవత పురాణం పఠిస్తారు. ఈ పయోవ్రతాన్ని నిర్వహించిన కశ్యపుని పత్ని అదితీదేవి శ్రీ మహావిష్ణువును తన పుత్రుడుగా - వామనునిగా జన్మనిచ్చిందని పురాణాలు చెప్తున్నాయ. అందుకనే ఈ మాసంలో కొత్తగా పెళ్లయన జంటలు ఈ పయోవ్రతాన్ని చేయాలని అట్లా చేసినవారికి బహుముఖ ప్రజ్ఞకల పుత్రులను పొందుతారని పెద్దలు అంటారు.
హైందవ జాతిని సాంస్కృతిక చైతన్య కిరణాలతో మేల్కొల్పిన బ్రహ్మర్షి అయన శ్రీరామకృష్ణ పరమహంస జన్మదినాన్ని ఈ మాసంలోనే జరుపుకుంటారు. ఫాల్గున బహుళ విదియనాడు శ్రీలక్ష్మీ జయంతి. క్షీరసాగర మధన సమయంలో పాలకడలి నుండి ఉద్భవించినట్లు చెప్పే ఈ లక్ష్మీదేవిని ఫాల్గుణంలోని ఏ శుక్రవారంనాడు ‘కనకధారాస్తవము’ తోను, మహాలక్ష్మి అష్టకంతో పూజించినవారికి సకల సంపదలు కలుగుతాయని శాస్తవ్రచనం. ఇదే రోజున హరిహరసుతుడు అయ్యప్పస్వామి జయంతి కూడా. శబరిమలైలో విశేష పూజలు నిర్వహిస్తారు. అడుగడుగునా తెలుగువారికే కాక మొత్తం ప్రపంచంలోని ప్రతిమానవునికి ఆదర్శ పురుషోత్తముడైన రామాయణంలోని రాముడు రావణునితో పోరు సల్పి విజయాన్ని పొందిన ఆ మహాసంగ్రామం ప్రారంభమైనదీ ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే. అధర్మంపై విజయం పొంది ధర్మసంస్థాపనం చేసిన రాముడు సకలలోకారాధ్యుడు. అహంకారం, అసూయల్లాంటి వాటికి దూరం కాకపోతే జీవిత నరకప్రాయం అవుతుందని తెలుసుకోవాలి ఈ రామాయణ కథద్వారా.
ధర్మసంస్థాపన చేయడానికి, అన్నదమ్ములందరినీ ఒకే తాటిపై నడిపించడానికి కలసి ఉంటే కలదు సుఖం అన్న భారతీయ జీవనాడిని అన్ని లోకాలకు తెలియజేయడానికి ధర్మమే స్వరూపంగా ధరించిన ధర్మరాజు దుర్వాస మహామునివల్ల కుంతీదేవికి వర ప్రసాదంగా యమధర్మరాజు అంశతో జన్మించినది వికృతి నామసంవత్సరం ఫాల్గున బహుళ అష్టమి తిథి. ఇలా ఎన్నింటికో ఈ ఫాల్గుణం ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఏమాసంలో నైనా భగవంతునికి అర్చనాదులు జరుపుతూ దైవప్రీతికరమైన పనులు సాగిస్తూ జీవించడం మానవుని కర్తవ్యం. కామక్రోధలోభాదులను దూరం చేసుకొని ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తూ ఉన్నంతలో పొరగువారికి కాస్తంత చేతనైన సాయం చేస్తూ జీవించడమే మానవునిగా జన్మ లభించినందుకు సార్థకత అంటారు పెద్దలు. ఆధ్యాత్మిక జిజ్ఞాసువై నేను, నాదనే స్వార్థాన్ని త్యజించి పారమార్థిక చింతనాపరుడై జీవితాన్ని గడిపేవారే జ్ఞానులని పెద్దలు అంటారు. పెద్దలు చెప్పిన బాటలో నడస్తూ జీవితాన్ని గడపమని చెప్పేఈ ఫాల్గుణం రాబోయే చైత్రంలో జీవితానికి చైతన్యం కలిగించాలని కోరుకుందాం ఆ దిశగా అడుగులు వేద్దాం.
- సాయకృష్ణఅడుగడుగునా తెలుగువారికే కాక మొత్తం ప్రపంచంలోని ప్రతిమానవునికి ఆదర్శ పురుషోత్తముడైన రామాయణంలోని రాముడు రావణునితో పోరు సల్పి విజయాన్ని పొందిన ఆ మహాసంగ్రామం ప్రారంభమైనదీ ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే. అధర్మంపై విజయం పొంది ధర్మసంస్థాపనం చేసిన రాముడు సకలలోకారాధ్యుడు. అహంకారం, అసూయల్లాంటి వాటికి దూరం కాకపోతే జీవిత నరకప్రాయం అవుతుందని తెలుసుకోవాలి ఈ రామాయణ కథద్వారా.

- సాయికృష్ణ