మంచి మాట

మానవజన్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజువారి పనుల్లో నేను, నాది అనడం పరిపాటి. కాని ఆ పదాల అర్థాల గురించి అంతగా పట్టించుకున్నట్టుగా అందరూ కనిపించరు. సాధారణంగా మనం అంటే శరీరమనే అనుకొంటాం. శరీర సంబంధం కలవాటిని నాది, నావి అనడం కూడా సహజం.
ఈ పదాల గురించి ఆలోచించినపుడు నేను , నాది అనే పదాలు, శరీరము ఒకటి కాదనేది స్ఫురిస్తుంది. నా ఇల్లు, నా పుస్తకము అని ఎలా అంటున్నామో నా చెయ్యి, నా కాలు, నా శరీరము, నా బుద్ధి, నా మనసు అంటున్నాము. అంటే ఇల్లు , పుస్తకం, కాలు , శరీరం అనేవి వేరు నేను వేరు అని మనమే అంటున్నాం. శరీరంలో భగవంతుని అంశ లేక చైతన్యమనే ఓ పదార్థం ఉంది. దానే్న జీవుడు అనుకొంటే జీవి ఉన్నంత వరకు పుట్టుట, పెరుగుట, తిరుగుట, అనేవి జరుగుతూనే ఉన్నాయ. ఎపుడైతే శరీరం నుంచి జీవి విడవడి వెళ్తుందో అపుడు ఆ శరీరం నిర్జీవం అయపోతుంది. కాని ఆత్మ లేక జీవి మరొక శరీరాన్ని తీసుకొని మరొక ప్రాణిగా మారిపోతాడు. అయతే ఈ విషయం అందరికీ సులభంగా అర్థం కాదు కాని ఈ యథార్ధమును ఆలోచించి, ఏకాగ్రచిత్తంతో అనుభవపూర్వకముగా తెలుసుకొన్నవారిని మహానుభావులు అని అంటారు.
సుఖ దుఃఖములు, రాగద్వేషాలు ఇలాంటి ద్వంద్వములు శరీరమునకు సంబంధించినవే కాని-ఆత్మకు సంబంధించినవి కావు. అందుకే చనిపోతే ఇక అంతటితో ఆ ద్వంద్వాలు సమసిపోతాయ అంటారు. నీటి బుడగ లాంటి జీవితంలో అతికొద్దిసేపు మాత్రమే ఉండే సుఖ దుఃఖాలను పట్టించుకోరు కనుకనే మహాత్ములు వేటికి చలింపక సమబుద్ధితో ఉంటారు.
ప్రపంచంలో జీవించి ఉన్నాకూడా ఇవి అన్నీ అశాశ్వితమైన బంధాలే అని శాశ్వతమైనది పరమాత్మ సన్నిథి మాత్రమే నని తెలుసుకొన్నవారు దేనియందు ఆసక్తి-అనుబంధము లేక-తాను అరిటాకు మీది నీటి బిందువు వలె అంటీ అంటకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయాన్ని తెలుసుకొన్నవారు ప్రతివారినీ పరమాత్ముని అంశలుగాను. లోకంలో జరిగేవన్నీ పరమాత్ముని లీలలుగా అభివర్ణిస్తుంటారు. ఇట్లాంటి విషయాలను అన్ని ప్రాణులు తెలుసుకొనజాలవు. కేవలం మనుష్యు ల్లోనే ఏ కొందరో జ్ఞానులు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందుతారు. అట్లాంటపుడు ఈ జ్ఞానమున్న విజ్ఞాన వేత్తలు, మహర్షులు, ఋషులు, తాపసులు, ధార్మికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలనే ఇటువంటివారు పజలకు హితోపదేశాల పేరిట అనేక పురాణ విషయాలు చెబుతుంటారు. వీటిని విని విషయాన్ని ఆకళింపు చేసుకొని జ్ఞానాన్ని పెంచుకుని మానవుడు తాను ఎవరో ఎందు నిమిత్తం ఈ మనుష్యజన్మ ఫొందాడో అన్న విషయా లోచన చేసి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి.
కాని ఇక్కడ కూడా జాగ్రత్త పాటించాలి. అందరూ తామే జ్ఞానులమనుకొని ఏవేవో చెబుతుంటారు. అట్లాంటి వారి ఉపదేశాలు హానికారకాలుగా అవుతాయ. అందుకనే మనం ఏ వ్యక్తి హితోక్తులు వినాలనుకొన్నా మొట్టమొదట తరిచి చూసుకోవాలి. అందుకే గురువు గారిని అనే్వషించచమని, లేక సద్గురువు ఆశ్రయాన్ని మాత్రమే పొందుమని చెప్పడంలోని ఔచిత్యం. అయతే ఎలా ఈ గురువును అందరూ తెలుసుకొనడం అంటే సాధారణంగా మనం - ఒక వ్యక్తి ఏ కులస్థుడైనా, మతస్థుడైనా ఉన్నతసంజాతి వాడైనా లేక నీచ జాతివాడైనా అతనివద్దకు మనం వెళితే మనకు తెలియకుండానే మనం అతని వద్ద ఉన్నంతసేపు ఒత్తిడులనుండి విముక్తులమై శాంతంగా ఉండగలిగితే, అతను నిస్వార్థ జీవన విధానావలంబుడై ఉంటే అతడే మహర్షి. మహాత్ముడు, సాధువు, భగవంతుడు. అతడు చెప్పే నీతులన్నీ లోకకల్యాణకారకాలై ఉంటాయ. నలుగురికీ మంచి చేసే వీలున్న సులభోపాయాలు అయ ఉంటాయ. కనుక వాటిని మీరు మరవవద్దు.
‘నిన్ను నీవే ఉద్ధరిచుకొనవలెను.’అనే గీతావాక్యం లోని అంతరార్థం ఏమంటే ప్రాపంచిక వ్యామోహమును పెంచుకుని మంచి చెడ్డలను విస్మరించి ఇంద్రియ లోలుడవైన నీకు నీవే శత్రువు. పరమార్ధ దృష్టి అలవరుచుకుని భగవద్భక్తిని పెంపొందించుకుని సన్మార్గము నుండిన నీకునీవే మిత్రుడవు కనుక నిన్ను నీవు తెలుసుకొని మంచిచెడులను నిర్ణయంచుకుని మంచి కార్యాలనే మాత్రమే జేయ గలిగితే మానవజన్మ సార్థకత పొందుతుంది.

- జానకి