విజయవాడ

గుప్పెడు గుండెచప్పుడు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటికి రేపటికి మధ్య ఇరుక్కుపోయిన
వర్తమానం యదార్థ ఉనికి కోసం
ఆరాటపడుతోంది!
పదార్థ ధర్మాన్ని నిరూపించటానికి
విజ్ఞానశాస్త్రం తపనతో తలకిందులౌతోంది
ఆధునిక పరిశోధనా ఆవిష్కరణలకు
శస్తచ్రికిత్స అవసరమని వైద్యశాస్త్రం
గ్రంథాలను తిరగరాయటానికి పూనుకుంది
గతమెంతో ఘనకీర్తి అంటూ కేసెట్ల
ఆవిష్కరణ ముమ్మరం అయింది
ఎక్కడ చూసినా ఉత్సవ ఏర్పాట్లే
ఆధునిక యువత అరచేతుల్లో
యూట్యూబు పట్టుకు తిరుగుతోంది
వార్థక్యాన్ని జయించే మందు ఎప్పుడు
అమ్మకానికి వస్తుందో అని
ముసలితనం వాజీకరణతో రాజీపడుతోంది
మోకరించటానికి సహకరించని మోకాళ్లతో
నవతరం గానాబజానా క్యాసినోల్లో
కాలక్షేపం చేస్తోంది
రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే
వసంతం వాకిట్లో నుంచే
వెళ్లిపోతుందేమోననే భయం వ్యాధిగా మారింది
కాల ప్రవాహాలకు ఎదురొడ్డవలసిన యవ్వనం
క్లబ్బుల్లో, పబ్బుల్లో కాళ్లు జాపుకుంది
నిషాలో దేశ ప్రేమను చప్పరించుకుంటూ
పెదవులు ఆర్థిక వ్యవస్థకు తామే
మూలస్తంభాలంటూ మురిసిపోతున్నాయి
కార్పొరేట్ కార్పెట్లను పరచటానికే
ప్రజాధనం ఖర్చయి సంక్షేమం
సగంలోనే ఆగిపోయింది.
పిజ్జాల పిచ్చిప్రేమ బొజ్జగామారి
ఉజ్వల భవిష్యత్తుకు అడ్డుపడుతోంది
కాలం గుణింతాలు, హెచ్చవేతలు, తీసివేతలు
చుట్టుకున్న నెట్‌జన్ తెల్లమొగం వేసింది
సాలీడు వ్యూహానికి చిక్కుకున్నానని
తెలియని ఈగ
తానెందుకు ఎగరలేకపోతున్నానోనని
కళ్లుమూసుకు ఆలోచిస్తోంది
బడాబడా కుబేరుల కోశాగారం నిండా
కొత్త రెండు వేల రూపాయల కట్టలు
రెక్కలు ముక్కలైనా డొక్కనిండని బక్కజీవి
బ్యాంకు వరసల్లో బిక్కచచ్చి పడిపోతున్నాడు
జీతభత్యాల రెట్టింపుతో అంకెల జాతర్లు
కార్యాలయాలను కబుర్లతో నింపుతున్నాయి
గతుకుల బాటపక్క బడుగు గూళ్ల బతుకుపాట
నాలుక చప్పరించుకుంటోంది!
*
- బిఎస్ నారాయణ దుర్గ్భాట్టు,
బాపట్ల, గుంటూరు జిల్లా.
చరవాణి :

దీపశిఖ
*
చావుకీ బతుక్కీ మధ్య
ఓ సరిహద్దు రేఖ ఎప్పుడూ వుంటూనే వుంటుంది
ఆ రేఖల ఆనవాళ్లను నిత్యం గుర్తిస్తూ వుండాలి
బతకటం కోసం నిత్యం యుద్ధం చేస్తుండాలి
భవితను అందుకు సన్నద్ధం చేస్తుండాలి
ఇప్పుడు జీవించడమంటే బతికుండటం కాదు
బతుకు బతుకులో మొలకెత్తడం
మెతుకు మెతుకులో ఆకలెత్తుకోవడం
అతుకు అతుకులో అనే్వషణనవ్వడం
నేతన్న చావునెందుకు అల్లుకుంటున్నడో
రైతన్న మృత్యుగీతానె్నందుకు ముద్దాడుతున్నాడో
పచ్చనోట్ల ఇక్కట్లు ప్రాణాలెందుకు తీస్తున్నాయో
కాలం కోడై కూయాలి..!
ఓ చైతన్యవీచికై అల్లుకోవాలి పెనవేసుకోవాలి
ఇక్కడ అల్లుకోవడమంటే..
ఏకులోంచి దారాన్ని తీసి పోగులు పోగులుగా
దేహం ఆచ్ఛాదనల్ని పేనుకోవటం!
ఇక్కడ పెనవేసుకోవడమంటే..
అంతరంగ మథనాలను అర్థం చేసుకుంటూ
అంతిమశ్వాసల్ని హత్తుకొని సంజీవనిలా
బతుకు వెలుగుకు భరోసానివ్వడం!
మతవ్ఢ్యౌ కరాళనృత్యాలపై
అక్షరమై యుద్ధం ప్రకటించాలని వుంది
స్వేచ్ఛను హరించే ధోరణిని
కూకటివేళ్లతో పెకిలించాలని వుంది
నిత్యం ఆశ చావని పోరాటమే
నిట్టూర్పులూ నిరాశలూ వదిలి
పిడికిళ్లు బిగించి నాతో కదలండి
ఎక్కడో దూరంగా దీపశిఖ
మిణుకుమిణుకు మంటోంది!
*
- కటుకోఝ్వల రమేష్,
ఖమ్మం.
చరవాణి : 9949083327

మనస్సంటే
*
మనసులోని మర్మం
మాటలలో తెలుస్తుంది
మమత లేని మనస్సు
వట్టి మట్టిముద్దేకదా!
మనిషిలోని స్పందనలకు
దర్పణమే మనస్సు
మంచిచెడుల విచక్షణకు
న్యాయమూర్తి మనస్సు
మాటరాని మరబొమ్మలా చేసి
మనస్సును అణగదొక్కి
కాలానుగుణంగా నడుస్తున్నాడు
నేటి యాంత్రిక మానవుడు!
ఎదిరించే తత్వాన్ని
నీలోని మనస్సుకు నేర్పు
అన్యాయాన్ని రూపుమాపి
మానవత్వపు విలువలను పెంచుకొని
నవ సమాజ నిర్మాణానికి
అందమైన బాటలు వెయ్యి
మనసున్న మనిషివని
నిరూపించు!
*
- డా. మైలవరపు
లలితకుమారి,
గుంటూరు.
చరవాణి : 9959510422

శ్రీశ్రీ
*
ఎంత అయస్కాంతమైన అక్షరాలవి
నిజంగా ఆధునిక కవిత్వానే్న
నడిపించాయి ఆ అక్షరాలు!
యుగకర్తలయ్యాయి శిలాక్షరాల్లా
ఆ అక్షరాల్లో ఇజాలు చూశారు కొందరు
నిజాలు చూశారు మరికొందరు
నెత్తిన పెట్టుకుని ఊరేగారు ఇంకొందరు
అసలు అందరి కీర్తిప్రతిష్ఠలూ పెంపొందడానికి
ఆ అక్షరాలు ఉపకరణాలైనట్లుగా
మరేవీ కాలేదేమో!?
ఆ అక్షరాలు పేల్చిన హక్కుల తుపాకులు
బూర్జువాల గుండెల్ని బద్దలు చేశాయి
స్థిరంగా నిలిచాయి
శతాబ్దాలుగా కాంతుల్ని ప్రసరించే
ఖరకరులే - మిత్రులే ఆ అక్షరాలు
ఆ అక్షరాలు రెండూ
ఒక ఉల్లేఖాలంకారం.. ఒక పుష్పక విమానం
ఆ అక్షరాలు మారేవో కాదు
శ్రీ.శ్రీ!
(నేడు జయంతి సందర్భంగా..)
*
డా. రామడుగు వెంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287