విజయవాడ

అక్షర పునాది (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేఘాలను ముద్దాడే ఆకాశహర్మ్యానికైనా
మట్టిలో కట్టిన పునాదిపైనే మనుగడ
వేనవేల శాఖలుగా
విస్తరించిన వృక్షరాజానికైనా
నేలపొరల్లో పరుచుకున్న తల్లివేరే జీవనాడి
అమ్మ స్తన్యామృతం గ్రోలకుండా
ఆబగా తిన్న పిజ్జా.. బొజ్జకు చేటుచేస్తుంది
ఓనమాలు దిద్దాల్సిన చేతులు
ఆంగ్లంలో ఎంగిలి పడితే
ఆనవాలు లేకుండాపోతాయి సంస్కృతులు

అమ్మ పాదాలకి మొక్కాం
ఆమె పెట్టిన అమృతం మెక్కాం
ఆదర్శాలు చెపుతూ అందలమెక్కాం
అన్నీ తెలిసీ తెలుగును తుంగలో తొక్కాం

పిల్లలు ఏం పాపం చేశారని
తల్లి నుంచి వేరుచేస్తున్నాం?
సవతి తల్లికి అప్పగించినట్లు
పరభాషను వారిపై రుద్దుతున్నాం
పరాయి పంచల పాల్జేస్తున్నాం
రేపటి పౌరులు
శిఖరమై ఎదగాలంటే
కూకటి వేళ్లు పటిష్టంగా ఉండాలి
ముర్రుపాలలో రంగరించిన అక్షరాలు
ముందుతరాలకు ముత్యాలదారులు
మాతృభాషలో వౌలిక విద్యాబోధన
మనిషి ఉన్నత వ్యక్తిత్వానికి
బలమైన పునాది
- బలభద్రపాత్రుని ఉదయశంకర్,
నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి : 9494536524
**
మిర్చిరైతు మృత్యుఘోష
*
వ్యవసాయం
మన జీవనాడి
రైతే రాజన్నారు
అప్పుల బాధ
మార్కెట్ మాయాజాలం
రోజురోజుకూ పడిపోతున్న ధరలు
పెరిగిపోతున్న అప్పులు
రోడ్డున పడుతున్న కుటుంబాలు
ఆరుగాలం శ్రమించి
చెమట చిందించి
కోతకూలీ కూడా దక్కక
అన్నం పెట్టే రైతు కూలిపోవటం
ఈ వ్యవస్థ విషాదం
గిట్టుబాటు ధర అందలేదనే
ఆవేదనతో ఆవేశానికి లోనైతే
మిర్చి రైతులపై కేసులు
సంకెళ్లు.. చెరశాలలు
రాబందుల రెక్కల చప్పుళ్లు
కల్లాల్లో మిర్చి
కల్లోలంలో రైతు
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
ధరాఘాతాలు.. మరణ మృదంగాలు
మిర్చిరైతు .. మృత్యుఘోషలు

- షేక్ కరిముల్లా,
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9705450705
**
ఆచార్య సినారెకు
కల్హారాంజలి మాల!
*
కురిసే వెనె్నలలందున మెరిసే గోదావరిలా
పురివిప్పిన ఎదను తెలుపు చిరునగవొలికించువాడు
అచ్చతెలుగు నుడికారంలా అందము చిందువాడు
మచ్చలేని మమకారం ఆకారమ్మైనవాడు
‘ఆధునికాంధ్ర కవిత్వాం’్భనిధి మథియించి పంచి
పెట్టిన సత్సంప్రదాయ సుధాగీతికా విపంచి
గళనిగళమ్ములను పటాపంచలుగా చీల్చుకొంచు
‘జలపాతమ్మ’య్యెను తొలి కవిత జవము-జీవమెంచి
‘లకుమాదేవీ’విలాస లాస్యలాలసాత్మచ
‘కర్పూరవసంత’ పరిమళాలను మలికవిత దోచె
‘పద్మదేవ’‘శాంతిశ్రీ’రాగ కాంతిలో కవితా
‘నాగార్జునసాగరమై’ నవనవలాడెను ప్రౌఢత
‘సమదర్శనము’లుగ కొనలుసాగిన గేయములన్నీ
‘దివ్వెలుమువ్వలు’గ నిలిచి సవ్వడి రవ్వలను రాల్చె
‘విశ్వంభర’-‘్భమిక’గా ఎవరు వెలయ చే‘సినారె?’
మానవుడిని ఆది అక్షర మహిమగ చూపిన ఎక్స్‌రె
‘మాకందంబు’ల అందంబందిన భావ ‘సరోజం’
బందున ‘ముత్యాలకోకిల’లను కులికి పలికె నిజం
‘మనిషి’లోని ‘చిలుక’పలుకు మలచెను ‘హరివిల్లు’ తళుకు
‘ఇంటిపేరు చైతన్యం’; ఆయన కవితయె ధన్యం
‘మార్పే ఆ ఎడద తీర్పు’; తూర్పే ఆ కవిత కూర్పు
పాటే ఆయన మాటకు పల్లవి - సతతమ్ము అను
ప్రాససుమాలను విదల్చు తలపుల సిరిసిరివల్లరి
సినీ‘కంచుకోట’లోన ‘సిపాయి’గా వరలినాడు
రాజకీయ రంగాలకు ఎప్పుడు ‘చిక్కడు-దొరకడు’
‘గుండెలోన రసవదర్థ భాండమ్ములు గలవాడు
గొంతులోన పుంస్కోకిల కూజితములు నిలిపినాడు
ప్రాణమున్న భావాలకు ఆయన నుడి వాణికి గుడి
ఆకుపచ్చ ఊహలకే ఆయన కృతి ఆరని మడి’
పలుకుపలుకులో పలుకుల కలికి కులుకు చిలుకరించు
ఆశూపన్యాసముతో హాయిని సమకూర్చువాడు
‘పద్మశ్రీ’ ‘కళాపూర్ణుడ’్ధ్యపక కులదక్షుడు
తెలుగు వెలుగులను చిలికెడి భాషాసంఘాధ్యక్షుడు
భారతీయ ‘జ్ఞానపీఠ’ భవ్యపురస్కారార్హుడు
‘నారాయణరెడ్డి’ బుధుడు - ‘సింగిరెడ్డి’ వంశవిధుడు
సమర్పింతునిదె ఉదాత్త హృద్య భక్త్భివహేల
శోకవ్యాకులమతితో కల్హారాంజలి మాల!

- ‘విశాఖ’ గుంటూరు.
చరవాణి: 9866944287