మిర్చిమసాలా

రివర్స్ తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును పోటీకి నిలపాలని ఖమ్మం టిడిపి నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మంలో నామానాగేశ్వరరావు హవా సాగుతున్నప్పుడు జిల్లా టిడిపి నాయకులంతా ఆయనపై అసమ్మతి జెండా ఎగుర వేశారు. పార్టీని నాశనం చేస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని దూరం పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో టిడిపి పని ఐపోయింది అనుకుంటున్నప్పుడు అదే జిల్లాలో పార్టీలో మిగిలింది కొద్ది మంది నాయకులే. వాళ్లంతా కలిసి నామాపై ప్రేమ చూపిస్తున్నారు. ఇది నామా మీద ప్రేమనా? లేక ఎన్నికల్లో ఖర్చు చేయగల ఆయన స్థోమత మీద ప్రేమనా? అని కొందరి అనుమానం.
- మురళి

ఇవో రకం చిక్కులు..!
గతంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి ఏదోపనిపై ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో పివి నరసింహారావు హైదరాబాద్‌కు వచ్చిన విమానంలో గాక ఆ తర్వాత మరో విమానంలో ఆయన చేరుకోవటం చూసిన ఓ విలేఖరి ‘ తెలుగువారైనా.. మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలున్నాయా? కలిసి రాకపోవటంతో అనుమానం కలుగుతోంది!’ అంటూ తన మనసులోని మాట బైట పెట్టాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా మీడియా అంతా వ్యాపించింది. దీంతో ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పుకోలేకపోయిన విజయభాస్కరరెడ్డి మరో మీడియా ప్రతినిధి ఇచ్చిన సలహా మేరకు పనేమీ లేకపోయినా ఢిల్లీ వెళ్లి ప్రధాని పివితో కలిసి ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత గానీ ఆ ప్రచారానికి తెరపడలేదు. ప్రస్తుతం వైకాపాలో ఇదే తంతు సాగుతోంది. ఇటీవల వైకాపా కృష్ణా జిల్లా కార్యాలయం ప్రారంభించారు. అగ్రనాయకులంతా హాజరయ్యారు. అయితే జిల్లాలో కీలక నేత, మాజీ శాసనసభ్యుడు జోగి రమేష్ గైర్హాజరు కావటంతో మీడియా ప్రతినిధులు పలువురు అడగనే అడిగారు. ఇంకేముంది! రమేష్ పార్టీ మారుతున్నారనే ప్రచారం ఒక్కసారిగా గుప్పుమంది. దీనికి సమాధానం చెప్పుకోలేకపోయిన రమేష్ వెనువెంటనే పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలపై ధ్వజమెత్తాల్సి వచ్చింది.
- నిమ్మరాజు చలపతిరావు

ర్యాంకుల గోల
ప్రవేశపరీక్షల్లోనో, ఎంపిక పరీక్షల్లోనో ర్యాంకులు వస్తే ఎగిరి గంతేస్తారు. ఆ మాట కొస్తే ఏ రంగంలోనైనా ఎవరికైనా ర్యాంకు వస్తే చాలా సంతోషిస్తారు. కాని ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు ర్యాంకులు ఇవ్వగానే వారంతా ఉలిక్కిపడటమే కాదు, డీలా పడ్డారు. దానికి సవాలక్ష కారణాలు, మంచి ర్యాంకులు వచ్చిన వారు భవిష్యత్‌లో తమ పరిస్థితి ఏమిటని బాధపడగా, చిన్న ర్యాంకులు వచ్చిన వారు తమను భవిష్యత్‌లో మంత్రివర్గంలో కొనసాగిస్తారా లేదా అనే ఆందోళనలో పడ్డారు. ఈ ఒత్తిడిలో తమకు వచ్చిన ర్యాంకులపై కొంత మంది అసంతృప్తి తెలపగా, మరికొంత మంది అసమ్మతిని వ్యక్తం చేశారు. ఇంకొంత మంది తమకు వచ్చిన ర్యాంకు అది కాదని, ఇంకా మంచి ర్యాంకు వచ్చిందని క్లైమ్ చేసుకున్నారు. భవిష్యత్‌లో మంచి ర్యాంకులు సాధించి తీరుతామని కొంత మంది శాంతపడ్డారు, అంత వరకూ ఓకే, మంత్రుల ప్రాణాల మీదకు ర్యాంకులు వచ్చిపడ్డాయని కార్యకర్తలు చెప్పడమే చర్చనీయాంశం అయింది...ఏం జరగబోతోందన్నది కాలమే చెప్పాలి.
- బి.వి. ప్రసాద్

ఓటేసిన పాపానికి తలాఖ్..!
ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారో మీరు ఎప్పటికీ చెప్పకండి. అదేమిటీ, భార్య-్భర్తలు కూడా చర్చించుకోకూడదా? సొంత ఇంట్లో వారు కూడా చర్చించుకోవద్దా! అనే సందేహం మీకు కలగకుండా ఉండదు. ఇటీవల అస్సాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు నచ్చని పార్టీకి భార్య ఓటు వేసిందని విడాకులిచ్చేశాడు ఓ భర్త మహశయుడు. సోనిట్‌పూర్ జిల్లాలోని డోనమ్ అడ్డహతి గ్రామవాసులంతా కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని ఆ గ్రామ పెద్దలు నిర్ణయించారు. కాగా అయినిద్దీన్ భార్య దిల్వారా బేగం బిజెపికి ఓటు వేసిందట. భార్య- భర్తలు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు దిల్వారా బేగం ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన అయినిద్దీన్ 10 సంవత్సరాల వివాహ బంధాన్ని వదులుకోవడానికి సిద్ధపడి భార్యకు పది మంది ముందు ‘తలాఖ్’ అని మూడు సార్లు చెప్పేశాడు. అదండీ అందుకే ఓటు విషయం రహస్యంగా ఉంచండి.
- వి. ఈశ్వర్ రెడ్డి

నారాయణకు ర్యాంకు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారికంగా మంత్రులకు గ్రేడింగ్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి నారాయణకు చివరి ర్యాంకు 18 వచ్చినట్టు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అదే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థకు టాప్ ట్యాం కులు వచ్చినట్టు టీవీ చానల్స్‌లో ప్రముఖంగా ఆ సంస్థ ప్రకటనలు జారీ చేసింది. ఒకవైపు నారాయణకు చివరి ర్యాంకు వచ్చినట్టు చానల్స్‌లో వార్తలు ప్రసారం కాగా, అదే సమయంలో నారాయణ విద్యాసంస్థలకు టాప్ ర్యాంకులు వచ్చినట్టు ఏకకాలంలో ప్రకటనలు ప్రసారం అయ్యాయి. ఇంటర్ ఫలితాల్లో తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులు తమ అధిపతికి వచ్చినట్టుగానే తమకు కూడా తక్కువ ర్యాంకు వచ్చిందంటూ చలోక్తి విసిరారు!
- వెల్జాల