మిర్చిమసాలా

కానరాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి స్పందించి, ఉప ముఖ్యమంత్రిని ఆదేశించారు, వారు కాస్తా కలెక్టర్‌ను ఆదేశించారు, కలెక్టర్ కాస్తా ఎస్పీని ఆదేశించారు, ఆయన డిఎస్పీని ఆదేశిస్తే ఆయన కాస్తా సంబంధిత సిఐ ద్వారా ఎస్‌ఐని ఆదేశించారు. ఆదేశాలు అయితే వరుసక్రమంలో ఎక్కడా మిస్ కాకుండా వెళ్లినా వ్యవహారం మాత్రం పరిష్కారం కాలేదు. ఇదంతా ఒక సంఘటనకు సంబంధించిదే కావచ్చు, కాని ప్రతి విషయంలో జరిగేది ఇదే, రేషన్ కార్డు అందలేదనో, పెన్షన్ రాలేదనో, భూమి పత్రాలు ఇవ్వలేదనో సమస్య ఏదైనా ఫిర్యాదు చేస్తే క్రమం తప్పకుండా మన ఫిర్యాదు మాత్రం దిగువ వరకూ వెళ్తుంది, పరిష్కారం ఆ దేవుడికే వదిలేయాలి, తూర్పుగోదావరి జిల్లా గొల్లపేటకు చెందిన తొమ్మిది మంది భక్తులు కాశీలో అదృశ్యం అయ్యారని తెలిసిన సిఎం వెంటనే డిప్యూటీ సిఎంను ఆదేశించారు. ఆ తర్వాత అంతా తెలిసిందే...్భక్తులు మాత్రం కానరాలేదు
- బివి ప్రసాద్

మరి వారు.. ఎటువైపు?!
ఆర్టీసీ సిటీ, సాధారణ బస్సుల్లో మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లలో పురుషులను కూర్చోనివ్వకుండా చేయడమేగాక, ఆ సీట్ల వైపు మగపురుగు కూడా వెళ్లటానికి వీల్లేకుండా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు తొలిసారిగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఒక్కో బస్సుకు రూ.20వేల విలువైన స్టెయిన్‌లెస్ స్టీల్ డోర్‌తో కూడిన మెష్ ఏర్పాటు చేయిస్తున్నారు. తొలిదశగా రాష్టవ్య్రాప్తంగా 700 బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పించగా రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు విజయవాడ బస్‌స్టేషన్‌లో వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఓ కొంటె విలేఖరికి పెద్ద అనుమానం కలిగింది. పురుషులు, మహిళలు వేర్వేరుగా కూర్చుంటారు సరే.. మరి వారు ఎటువైపు కూర్చోవాలి సా ర్? అనడిగితే మంత్రిగారికే కాదు, అక్కడున్న ఎవరికీ అర్థంకాలేదు. దీంతో విలేఖరి అదే.. హిజ్రాలు ఎటువైపు కూర్చోవాలి సార్? అంటూ చిన్నగా నసిగాడు. పక్కనే వున్న ఓ అధికారి విషయం అర్థం చేసుకుని చీర కట్టుకుంటే మహిళల సీట్లోకి అనుమతిస్తామనటంతో నవ్వులు వెల్లివిరిశాయి. అధికారిక సమాచారం ప్రకారం ఒక్క విజయవాడ నగర పరిసరాల్లోనే 5వేల మందికి పైగా హిజ్రాలున్నారు. పైగా ప్రభుత్వం ఇటీవల జనాభా లెక్కల్లోని 3వ కాలమ్‌లో వారి సంఖ్యను కూడా ప్రత్యేకించి చూపింది. ఇక ఈ జల్లెడను డీలక్స్ బస్సుల్లో కూడా ఏర్పాటుచేస్తే భార్య భర్తలు వేర్వేరుగా కూర్చొని ప్రయాణించాల్సి వస్తుందేమోననే అనుమానాలు కూడా వ్యక్తవౌతున్నాయి.
- నిమ్మరాజు చలపతిరావు

సినిమా పెళ్లి
ఇలాంటి దృశ్యాలు సినిమాలో చూశాం కానీ నిజ జీవితంలో చూస్తామనుకోలేదు అంటున్నారు. ఆ పెళ్లి గోల చూసి. భార్యా భర్త, మధ్యలో ఆవిడ. ఆయన నా వాడు అంటే నా వాడు అంటున్నారు. మీకు ఆమెతో ముందే పెళ్లయిందా? అంటే పెళ్లి కాలేదు సహజీవనం చేశానంటున్నాడు అయన .. ఇదో ఉన్నతాధికారి పెళ్లి కథ. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నతాధికారి రేఖారాణి తన భర్త విజయ్‌గోపాల్‌ను పెళ్లి చేసుకుందని సినీ నటి పూజిత నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పెళ్లికి ఐపిఎస్ అధికారి అంజనా సిన్హా మొదటి సాక్షిగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే పూజితను పెళ్లి చేసుకోలేదని, సహజీవనం చేశానని విజయ్‌గోపాల్ చెబుతున్నారు. తనకు న్యాయం చేయాలని సినీ నటి పూజిత కోరుతోంది. సినిమా అయితే శుభం కార్డుతో ముగుస్తుంది. ఈ సినిమా పెళ్లి ముగింపు ఎలా ఉంటుందో చూడాలి.
- సయ్యద్ గౌస్‌పాషా

నేరం నాది కాదు ఆకలిది
ఎన్టీఆర్ నటించిన ‘నేరం నాది కాదు ఆకలిది’ అనే సినిమాలో అప్పట్లో బాగా హిట్టయ్యింది. ఇటీవల ఇటలీలో రోమన్ ఓస్టికోన్ అనే వ్యక్తి సూపర్ మార్కెట్లో తినుబండారాలు (చీజ్, స్నాక్స్) దొంగలించి పట్టుబడ్డారు. దీంతో ఆ సూపర్ మార్కెట్ యజమాని సదరు దొంగను కోర్టు బోనులో నిలబెట్టారు. ‘నేరం నాది కాదు ఆకలిది’ అని ఆ దొంగ విలపించాడు. ఇరువైపుల వాదనలు విన్న ఆ న్యాయమూర్తి హృదయం ద్రవించింది. ఆకలితో అలమటించిన వ్యక్తి చిన్న మొత్తంలో ఆహారాన్ని తీసుకుని తిన్నాడని, ఇది ఎంత మాత్రం దొంగతనం కాదని క్షమాబిక్ష పెట్టేశాడట. ఇది చారిత్రాత్మకమైన తీర్పు అని సాటి దొంగలంతా ఆ న్యాయమూర్తిని వేయి నోళ్ళ పొగిడేశారట. అదీ ఇటలీలోని సంగతి. ఇండియాలో మాత్రం అటువంటి పప్పులేమీ ఉడకవ్ సుమా!
- వి. ఈశ్వర్ రెడ్డి

పులిభయం
టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి తెలంగాణలో కన్నా ఆంధ్రలో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల ఫోటోలను మాత్రమే పెట్టుకునే టిడిపి అభిమానులు సైతం ఆ రెండు ఫోటోల తరువాత రేవంత్‌రెడ్డి ఫోటలు పెట్టుకుంటారు. తెలంగాణ టైగర్ అంటూ రేవంత్‌రెడ్డిని ఆంధ్ర అభిమానులు ఆకాశానికెత్తారు. అంతా బాగానే ఉంది కానీ తెలంగాణ టైగర్‌గా పిలుచుకునే రేవంత్‌రెడ్డి నాకు ప్రాణభయం ఉంది కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరడం విడ్డూరంగా ఉందని తెలంగాణ నాయకులు విస్తుపోతున్నారు. టైగర్ కూడా భయపడితే ఇక పార్టీకి దిక్కెవరంటున్నారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
- మురళి