మిర్చిమసాలా

మీడియాకు భలే ఫుడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో తాజా పరిణామాలు మీడియా కు పది రోజుల పా టు మంచి ఫుడ్‌గా మారుతోంది. గత కొద్దిరోజులుగా మీడియా నుంచి విరామం లేకుండా ప గలు, రాత్రి ఆ ఘటనలపై ఆసక్తికరమైన కథనాలు వస్తున్నాయి. ఎ మ్సెట్ పేపర్ లీకేజి, ఆలేరు వద్ద నలుగురు ఉగ్రవాద విచారణ ఖైదీలు, నల్లగొండ జి ల్లాలో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్, గ్యాంగ్‌స్టర్ నరుూమ్ ఎన్‌కౌంటర్- రాజకీయ నేతల సంబంధాలు, మియాపూర్ భూస్కాం, శిరీష ఆత్మహత్య ఘటన.. ఇప్పుడు డ్రగ్స్ మాఫియాలో సినీనటులపై ‘సిట్’ విచారణ. న్యాయపరంగా ఈ ఘటనల ముగింపు ఎలా ఉన్నా, మీడియా మాత్రం ఆసక్తికరమైన, ఉత్కంఠ కలిగించే కథనాలను ప్రసారం చేస్తోంది.
- శైలేంద్ర

ఔనా.. ఐతే ఒకే!
అవునా.. ఐతే ఓకే అనే సినిమా డైలాగ్ చాన్నాళ్లు అందరి నోళ్లలో నానిందే. అదే డైలాగ్ ఇపుడు వెంకయ్యనాయుడు మీద వేస్తున్నారు అంతా. ఉప రాష్టప్రతి పదవి తనకు దక్కడం వెనుక జరిగిన తతంగం అంతా ఆయన చెప్పాక అంతా ‘ఔనా.. ఐతే ఓకే’ అంటున్నారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి పదవుల వేటలో తాను లేనని చాలా మార్లు స్పష్టం చేసిన వెంకయ్య తాజాగా అదే నోటితో అయిష్టంగా పదవిని స్వీకరించడం లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. దీనిని సమర్ధించుకుంటూ ఇంత వరకూ తాను చేపట్టిన పదవుల గురించి వివరించారు. కేంద్రమంత్రి పదవిని వీడటం తనకు ఇష్టం లేదన్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ , కేంద్ర మంత్రి పదవి విలువ ఏమిటో , ఉప రాష్టప్రతి పదవి ఏమితో తనకు తెలుసునన్నారు.
- బివి ప్రసాద్

ఇక చెప్పేవారు ఎవరు?
పార్టీ మీటింగైనా, ప్రారంభోత్సవమైనా, ఎలాంటి సమావేశమైనా అక్కడ మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉం టే చాలు.. ఆ సభా ప్రాంగణంలో చీమ కూడా చిటిక్కుమనటానికి వీలులేదు. ఏపి సిఎం చంద్రబాబు పక్కనే ఉన్నప్పటికీ ముందు వేదికపై గన్‌మెన్‌లు సహా ఏ ఒక్కరూ అటుఇటూ తిరగటానికి వీల్లేదు. వేదికపై ఎవరూ కూడా నిలబడకూడదు. పక్కన కూర్చున్న వారితో పిచ్చాపాటీకి వీల్లేదు. సెల్‌ఫోన్లన్నింటినీ సైలంట్‌లో పెట్టుకోవాలని, చేతకాకపోతే పక్కనున్న వారి సహకారం తీసుకోవాలని, కూర్చోవటం ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోవచ్చని వెంకయ్య నిష్కర్షగా చెబుతారు. సభ ముగిసేదాకా మంచినీరు, కాఫీ, టీ, శీతల పానీయాల సరఫరా బంద్. అలాంటి వెంకయ్య క్రియాశీల రాజకీయాలకు దూరమవుతుంటే తమ పార్టీలో ఇలాంటి క్రమశిక్షణ మున్ముందు కన్పిస్తుందా? అని ‘కమలనాథులు’ కలవరపడుతున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

జానా.. ఎందుకిలా?
తమ పార్టీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడును బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అభినందన సభకు పెద్ద మనసుతో కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ అసెంబ్లీలో విపక్షనేత జా నారెడ్డి పెద్దమనసుతో హా జరై అందర్నీ విస్మయపరిచారు. అందుకే సిఎం కెసిఆర్ కూడా ఆయన్ను ‘పెద్దలు జానారెడ్డి’ అని సంభోదిస్తారు. ఉప రాష్టప్రతి ఎన్నికల్లో వెంకయ్యపై కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత సన్మానసభకు జానా ఎలా వెళతారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడడమే కాదు, అధిష్ఠానానికి ఫిర్యాదులు పంపుతున్నారట! వెంకయ్యకు జానా ‘్ఫదా’ అయ్యారేమోనని సొంత పార్టీ నాయకులే చమక్కులు వేస్తున్నారు.
- వి. ఈశ్వర్ రెడ్డి