మిర్చిమసాలా

అదీ సంగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందనే భావన అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. అయితే దానికి ఒక్కో పార్టీ వారు ఒక్కో కారణం చెబుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడంలో బిజీగా ఉన్న చంద్రబాబు ఢిల్లీలో లాబీయింగ్ జరపలేకపోయారని, దాంతో ఆంధ్రకు అన్యాయం జరిగిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కేంద్రం ఏ రాష్ట్రానికి పెద్దగా అదనపు కేటాయింపులు చేయలేదు. ఆంధ్ర, తెలంగాణకు సమానంగానే చిన్నచూపు చూసిం ది. అయితే గతంలో ఢిల్లీలో చక్రం తిప్పడంలో బాబుకు మంచి పేరుంది. ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్నా ఢిల్లీలో బాబు చక్రం అస్సలు పని చేయడం లేదు. పనిలో పనిగా విపక్షాలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో చూపుతు న్న ఆసక్తి రాష్ట్ర ప్రయోజనాలపై చూపడం లేదని విమర్శిస్తున్నారు.
- మురళి

నోరు జారితే...!
సావిత్రి సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ నొప్పించడం కోసం కాదని, తన మాటలకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నించాలంటూనే సినిమాకు సంబంధించి కథాపరంగా సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలని సమర్థించుకున్నారు. సినిమా వేడుకలో సరదాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని మహిళలను తమ ఇంటి ఆడపడుచుగా చూడ డం తన తండ్రి నుంచి వారసత్వం సంక్రమించిన గుణమని పేర్కొన్నారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవమని వివరణ ఇస్తూనే ఈ వివాదాన్ని ఇంతటితోనే ముగించాలని బాలయ్య కోరారు.
- సయ్యద్ గౌస్‌పాషా

కాఫీ తెచ్చిన తంటా!
ఒక పోలీసు వాహనం వేగంగా దూసుకెళుతున్నది, దానిని ‘్ఛజ్’ చేసి ‘సీజ్’ చేసేందుకు మరో పోలీసు వాహనం వెంబడించడం చూసే వారికి వింతగా అనిపించింది. ఇది సినిమా కాదండోయి. నిజ జీవితం. మొత్తానికి మొదట వెళ్లిన పోలీసు వాహనాన్ని పోలీసులు పట్టుకోగలిగారు. అనంతపురం జిల్లా, హిందూపురంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డు పక్కన పోలీసు జీపును నిలిపి ఎంచక్కా ‘కాఫీ’ తాగేందుకు వెళ్లాడు. ఇంకేముంది ఒక దొంగ జీపును స్టార్ట్ చేసి ‘రయ్’మంటూ వెళ్ళిపోయాడు. ఆందోళనకు గురైన కానిస్టేబుల్ ‘కాఫీ’ కప్పును పక్కన పడేసి ‘సెట్’లో అధికారులకు విషయం చెప్పాడు. క్షణాల్లో పోలీసు వాహనం ‘సైరన్’ వేసుకుని వెంటాడి ఆ జీపును పట్టుకున్నారు. సదరు దొంగకు మతిస్థిమితం లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
- వి. ఈశ్వర్ రెడ్డి

ఆ ఒక్కటీ అడగొద్దు!
‘శాసనమండలి, శాసనసభ భవనాలు సహా తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తికానున్నందున వచ్చే జూన్ మాసాంతానికల్లా అమరావతి నుంచి రాష్ట్ర పరిపాలన ఆరంభం కాబోతోంది. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా ఈలోగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి తరలి రావాల్సిందే. అద్దె ఇళ్లు వెదుక్కోండి’.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, శాసనసభ్యులు పదేపదే నొక్కివక్కాణిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఇంతకాలం ఉచితంగా విలాసవంతమైన భవంతుల్లోని క్వార్టర్స్‌ని అనుభవిస్తూ వస్తున్న సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని వదలి వచ్చేస్తారా? అని ప్రెస్‌మీట్‌లో ఎవరైనా గడుగ్గాయి రిపోర్టర్ అడిగితే చాలు.. కొందరు విరుచుకుపడుతున్నారు. మరికొందరైతే సున్నితంగా ‘సార్.. సార్ ప్లీజ్.. ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కం డి’ అంటూ సమాధానం దాటేస్తున్నారు. తీరా విచారిస్తే వీరిలో అత్యధికులు నేటివరకు కుటుంబ సమేతంగా పాలుపొంగించుకుని ఒక్క రాత్రి కూడా అక్కడ గడిపిన దాఖలాలు లేవని ఎల్లప్పుడూ వారి వెన్నంటి ఉండే పిఎ, పిఎస్, గాన్‌మెన్‌లు చెబుతున్నారు. ఇంతకీ ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్టన్నీ ఖాళీగా ఉన్నాయా? అంటే అదేమీలేదంటున్నారు. అత్యధికులు తమకు కేటాయించిన మరుక్షణమే భారీ అడ్వాన్స్‌లతో అద్దెలకు ఇచ్చుకున్నారట! అదీ అసలు సంగతి!! ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ఖాళీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పనంగా అప్పగించి రావటానికి వీరేమైనా అమాయకులా?.. అనేది అసలు ప్రశ్న!
- నిమ్మరాజు చలపతిరావు

సమన్యాయం!
విభజన చట్టంలో ఇరు రాష్ట్రాలకు గత కాంగ్రెస్, ప్రస్తుత బిజెపి ప్రభుత్వాలు సమాన న్యాయం చేశాయో లేదో కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు మాత్రం చెరో గవర్నర్‌ను ఇచ్చి న్యాయం చేసిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాధిలో ఒక గవర్నర్‌ను ఇస్తే, తెలంగాణకు ఉత్తరాదిలో ఒక గవర్నర్‌ను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు తమిళనాడుకు ఎవరెళ్లినా చెన్నై రాజ్‌భవన్‌లో వారికి గవర్నర్ రోశయ్య ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. అదే మాదిరిగా తెలంగాణ నుంచి ముంబాయికి ఏ నాయకుడు వెళ్లినా అక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఇంత కంటే ఏమి కావాలి? ఇరు రాష్ట్రాలకు కేంద్రం న్యాయం చేసిందనడానికి?
- వెల్జాల చంద్రశేఖర్