వరంగల్

ప్రజలను మభ్యపెడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లికుదురు, మే 9: రాష్ట్రం తీవ్రమైన కరువు కోరల్లో అల్లాడుతుంటే ప్రజల దృష్టిని మరల్చడానికే, రాష్ట్రంలో కొత్తజిల్లాలను ఏర్పాటుచేస్తానని, కెజి టు పిజి విద్యను అందిస్తానని లేనిపోని హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్ అన్నారు. సోమవారం స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ...దళితులకు భూపంపిణి ఇంతవరకు నెరవేర్చలేదని, తండాలను పంచాయతీలుగా ఏర్పాటుచేస్తామన్న హామీని, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంతో ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తూ ఇప్పటికి ఎక్కడ ఇండ్లను మంజూరు చేయలేదని, అంతకుమునుపు తమ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఇండ్లను ఇందిరమ్మ పథకంలో మంజూరిచేసామని గుర్తు చేసారు. మానుకోటలో కేంద్రీయ విద్యాలయంతో పాటు, కోట్లాదిరూపాయలతో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టామని, పిజి కళాశాల ఏర్పాటుకు కృషిచేసామన్నారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన మానుకోటను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేస్తూనే ములుగు, భద్రాచలంలను జిల్లాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే పై మూడు ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటింపచేస్తామన్నారు. స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలు మానుకోటను జిల్లాగా ఏర్పాటుచేయడానికి కృషిచేయాలన్నారు.

వడదెబ్బతో ఇద్దరి మృతి
కురవి/పరకాల, మే 9: కురవి, పరకాల మండలాల్లో వడదెబ్బకు అస్వస్థతకు గురై ఇద్దరు మరణించారు. వివరాలిలా ఉన్నాయ..రెండు రోజులపాటు శాంతించిన వాతావరణం... తిరిగి భానుడి భగభగతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడదెబ్బకు తోడు, ఈదురు గాలులకు ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. వడదెబ్బ తగిలి మందుల ఉప్పలయ్య (58) మృతి చెందిన సంఘటన కురవి మండలంలోని గుండ్రాతిమడుగు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉప్పలయ్య ఆదివారం గ్రామంలోని ఓ వేడుక కార్యక్రమంలో పాల్గొని, ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. తెల్లవారుఝామున మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ప్రమీల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలాగే, పరకాల మండలం రాజిపేట గ్రామానికి చెందిన మహ్మద్ హుస్సేన్(58) ఈనెల 7న వరంగల్‌లోని తన కుమార్తె దగ్గరికి వెళ్లి వచ్చారు. ఎండ దెబ్బకు ఆయన తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం మృతి చెందినట్లు తెలిపారు.