వరంగల్

భర్తను చంపిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్మెట, డిసెంబర్ 22: మద్యానికి బానిసై కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడనే అక్కసుతో భార్య భర్తను కర్రతో కొట్టి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన నర్మెట మండలం సోలిపురం గ్రామంలో జరిగింది. డిఎస్పీ తుమ్మల పద్మనాభరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... సోలిపురం గ్రామానికి చెందిన పరమేశ్వరి తన భర్త సత్తయ్య (45)ను కర్రతో తలపై కొట్టి హత్య చేసింది. మంగళవారం తెల్లవారుఝామున భర్తను హత్య చేసి మృతదేహాన్ని గ్రామ సమీపంలోని కనిలకుంట సమీపంలో పడవేసి తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే తన భర్త కనిలకుంట వద్ద చనిపోయాడని గ్రామస్థులకు తెలిపి వారి సహాయంతో మృతదేహం వద్దకు వెళ్లి రోదించింది. మృతదేహం అనుమానాస్పదంగా ఉండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేసిన క్రమంలో భార్యను విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. తానే ఇంట్లో కర్రతో కొట్టి చంపి మృతదేహాన్ని ఇక్కడ పడవేశానని చెప్పింది. తను గత కొన్ని రోజులుగా మద్యం విచ్చలవిడిగా సేవిస్తూ కుటుంబ సభ్యులతో అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని, మాటిమాటికి తనను కొడుతున్నాడని, అందుకే ఈ సంఘటనకు పాల్పడాల్సి వచ్చిందని వివరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వాసాల సతీష్ తెలిపారు. సంఘటన స్థలం పరిశీలించిన అనంతరం గ్రామస్థుల నుండి మరిన్ని వివరాలు సేకరించినట్లు ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు.