అంతర్జాతీయం

జెయుడి కొత్త అవతారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 4: పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగడంతో జమాత్ ఉద్ దవా (జెయుడి) ఉగ్రవాద సంస్థ కొత్త అవతారం ఎత్తింది. జెయుడి చీఫ్ హఫీజ్ సరుూద్‌ను ప్రభుత్వం గృహనిర్బంధం చేయడంతోపాటు ఆ సంస్థ కార్యకలాపాలను అణచివేయడంతో అది ‘తెహ్రీక్ ఆజాదీ జమ్మూ అండ్ కాశ్మీర్’ (టిఎజెకె)గా తెరపైకి వచ్చింది. ముంబయిపై దాడికి కుట్రదారు అయిన సరుూద్ తాను అరెస్టు కావడానికి వారం రోజుల ముందుగానే ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. ‘కాశ్మీర్ స్వేచ్ఛను వేగిరం’ చేయడానికి తాను టిఎజెకెను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అతను చెప్పాడు. అంటే ప్రభుత్వం తన సంస్థను అణచివేయడానికి రూపొందించిన ప్రణాళిక సరుూద్‌కు అధికార వర్గాలద్వారా ముందే అందినట్లు కనపడుతోంది. అందుకే తన నేతృత్వంలోని జెయుడి, ఫలాహ్ ఎ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్)లను అణచివేస్తే ఆ సంస్థల నెట్‌వర్క్‌ను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై సరుూద్ ముందే ప్రణాళిక రూపొందించుకున్నట్టు కనపడుతోంది. ఈ రెండు సంస్థలు టిఎజెకె అనే కొత్త పేరుతో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. పాకిస్తాన్‌లో ‘కాశ్మీర్ డే’గా పాటిస్తున్న ఫిబ్రవరి 5న కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. లాహోర్, ఇతర నగరాలు, పట్టణాలలో టిఎజెకె బ్యానర్లు వెలిశాయి. లాహోర్‌లో ఫిబ్రవరి 5న సాయంత్రం ప్రార్థనలు ముగిసిన తరువాత ఒక పెద్ద ‘కాశ్మీర్ కాన్ఫరెన్స్’ను నిర్వహించడానికి టిఎజెకె కసరత్తు చేస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. లాహోర్‌సహా పంజాబ్‌లోని వివిధ జిల్లాల్లో టిజెఎకె తన విరాళాల కేంద్రాలను, అంబులెన్స్ సర్వీసులను తిరిగి క్రియాశీలం చేసింది. పంజాబ్‌లోని నన్‌కన సాహిబ్ పట్టణ సమీపంలో రవి నదిలో వంద మందితో వెళ్తున్న పడవ శుక్రవారం మునిగిపోయిన సందర్భంగా సరుూద్ నెట్‌వర్క్‌కు చెందిన వలంటీర్లు సహాయక చర్యల్లో క్రియాశీలంగా పాల్గొన్నారని స్థానిక మీడియా తెలిపింది.