అంతర్జాతీయం

భగత్‌సింగ్‌ను ఉరి తీసినందుకు బ్రిటిష్ రాణి క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, మార్చి 24: స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్‌ను 1931లో ఉరి తీసినందుకు బ్రిటీష్ రాణి ఎలిజబెత్ క్షమాపణ చెప్పాలని, అందుకుగాను ఆయన వారసులకు పరిహారం చెల్లించాలని భగత్ సింగ్ 85వ వర్ధంతిని జరుపుకొన్న సందర్భంగా పాకిస్తాన్‌లోని మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తలు గురువారం చెప్పారు. బుధవారం పాకిస్తాన్‌లో రెండు చోట్ల భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వాటిలో మొదటి కార్యక్రమం భగత్ సింగ్ జన్మస్థలమైన ఫైసలాబాద్ జిల్లా జరన్‌వాలా ప్రాంతంలోని బంగచాక్‌లో జరిగింది. అన్ని రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయి స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ జరిపిన పోరాటాన్ని ప్రశంసించారు. రెండో కార్యక్రమం బ్రిటీష్ ప్రభుత్వంపై కుట్ర పన్నారన్న ఆరోపణలపై 1931 మార్చి 23న భగత్ సింగ్‌తో పాటుగా ఆయన సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీసిన లాహోర్‌లోని షాద్‌మన్ చౌక్ వద్ద జరిగింది. స్వాతంత్య్ర పోరాట యోధుడైన భగత్ సింగ్‌ను ఉరి తీసినందుకు బ్రిటీష్ రాణి ఎలిజబెత్ క్షమాపణ చెప్పాలని, ఆయన వారసులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు కూడా. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలే పంపిన లిఖితపూర్వక సందేశాన్ని కూడా సమావేశంలో చదివి వినిపించారు. భగత్ సింగ్ జ్ఞాపకాలను జీవంతంగా ఉంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫౌండేషన్ కృషిని ఆయన ప్రశంసించారు. బ్రిటీష్ రాణికి పంపించడం కోసం తాము ఈ తీర్మానాన్ని ఇస్లామాబాద్‌లోని బ్రిటీష్ హైకమిషన్‌కు అందజేస్తామని హక్కుల ఉద్యమ కార్యకర్త అబ్దుల్లా మాలిక్ పిటిఐకి చెప్పారు. ఉగ్రవాదుల బెదిరింపుల కారణంగా షాద్‌మన్ కార్యక్రమాన్ని గట్టి బందోబస్తు మధ్య నిర్వహించారు. షాద్‌మన్ చౌక్ పేరును భగత్ సింగ్ చౌక్‌గా మార్చాలని భగత్ సింగ్ ఫౌండేషన్ డిమాండ్ చేస్డుగా, జమాత్ -ఉద్- దవా అనుబంధ సంస్థ అయిన హుర్మత్- ఎ-రసూల్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది.