అంతర్జాతీయం

భారత్-చైనా బంధానికి వ్యూహాత్మక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 26: భారత్-చైనా సంబంధాలు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని, ఈ రెండు దేశాలు గనుక కలిసి పని చేసినట్లయితే అవి ప్రపంచ శాంతి, సౌభాగ్యాలకు గొప్ప ఊపును కల్పించగలవని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు చెప్పారు. మన రెండు దేశాలు గనుక ఒక్కటయినట్లయితే ప్రపంచ శాంతి సౌభాగ్యాలకు మనం ఎంతో గొప్ప ఊపును తీసుకు రాగలమని, అది మన రెండు దేశాల ప్రజలకే కాక మొత్తం మానవాళికి మేలు చేస్తాయని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో జీ జిన్‌పింగ్‌తో చర్చల ప్రారంభంలో ప్రణబ్ వ్యాఖ్యానించారు. రాష్టప్రతికి 21 తుపాకులతో సైనిక మర్యాదలతో స్వాగతం పలికిన తర్వాత ఇరువురి మధ్య చర్చలు ప్రారంభమైనాయి. కాగా, మీరు ఎంతో అనుభవం కలిగిన రాజకీయవేత్త అని, భారత్, చైనాల మధ్య మైత్రిని పెంపొందించడానికి చిరకాలంగా కంకణబద్ధులైన చైనా ప్రజలకు చిరకాల మిత్రులని ప్రణబ్‌కు స్వాగతం పలుకుతూ జీ అన్నారు. 2014లో తాను భారత్ సందర్శించినప్పుడు మీరు, మీ ప్రభుత్వం తనను సాదరంగా ఆస్వానించారని జీ అంటూ, ఆ పర్యటనలో భారత్-చైనా సంబంధాలపైన, ఇరుదేశాలకు ప్రయోజనం ఉన్న అంశాలపైన చిత్తశుద్ధితో కూడిన చర్చలు జరిపామని, బోలెడన్ని విషయాలలో ఉమ్మడి అవగాహనలకు వచ్చామని కూడా జీ అన్నారు. మీ ప్రస్తుత పర్యటన భారత్, చైనాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మీ ప్రస్తుత పర్యటన మన మొత్తం సంబంధాలను, వివిధ రంగాల్లో మన స్నేహపూర్వక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తుందని తాను ఆశిస్తున్నట్లు చైనా ప్రధాని అన్నారు. భారత్, చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలని, అంతర్జాతీయ వేదికపై ముఖ్యమైన శక్తులని, ప్రాంతీయ, వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని తన నాలుగు రోజుల అధికారిక పర్యటన మూడో రోజు చైనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రణబ్ అన్నారు.
అష్టసూత్ర ప్రణాళిక
భారత్-చైనా సంబంధాల భవిష్యత్తు ఎనిమిది మూల స్తంభాలను రాష్టప్రతి ఉదహరిస్తూ సరిహద్దు సమస్యతోసహా ఎదురయ్యే సవాళ్లను రాజకీయ పరిపక్వత, నాగరికతల దూరదృష్టితో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. చైనాలోని ప్రముఖ పెకింగ్ యూనివర్శిటీలో రాష్టప్రతి గురువారం భారత్-చైనా సంబంధాలపై ప్రసంగించారు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న కృతనిశ్చయం భారత్‌లో అన్ని వర్గాల్లోను ఉందని, ప్రజలే లక్ష్యంగా నిర్మించుకునే వ్యూహానికి ఈ ఎనిమిది సూత్రాలను మూలస్తంభాలుగా చేసుకున్నట్లయితే మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలమన్న గట్టి నమ్మకం తనకు ఉందని అన్నారు. ఉమ్మడి అవగాహనను మనం ఎంతో విస్తృతం చేసుకున్నామని, అభిప్రాయ భేదాలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా నేర్చుకున్నామని, అయితే సరిహద్దు సమస్యతో సహా సమగ్రంగా పరిష్కరించుకోవలసిన సవాళ్లు ఎన్నో ఇప్పటికీ ఉన్నాయని ప్రణబ్ అన్నారు.

chitram బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు లీ యాన్‌చువాతో కరచాలనం చేస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ