అంతర్జాతీయం

మళ్లీ దాడి జరిగితే యుద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: పాకిస్తాన్ ప్రోత్సాహంతో ముంబయిలో జరిగిన 26/11 ఉగ్రదాడి తరహాలో మరోసారి కనుక భారత్‌పై పాకిస్తాన్ కనుక జరిపితే ఈసారి ఆ దేశంతో భారత్ కచ్చితంగా యుద్ధానికి దారితీస్తుందని పలువురు మాజీ దౌత్యవేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముంబయిపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి జరిపి సోమవారంతో పదో సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ దారుణ సంఘటనలో అమెరికన్లు, పదిదేశాల పౌరులు సహా 166 మంది అసువులు బాసారు. లష్కర్ - ఇ తొయిబా నేతృత్వంలో పదిమంది జరిపిన దాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు పోలీస్ కాల్పుల్లో మృతి చెందగా, పేరుమోసిన ఉగ్రవాది ఆజ్మల్ కసబ్ ముంబయి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. తర్వాత అతడిపై ఆరోపణలు రుజువు కావడంతో భారత్‌లో అతడిని 2012లో ఉరితీసారు. ఈ దాడి వ్యూహానికి ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న నిషేధిత జామత్-ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్ మాత్రం పాకిస్తాన్‌కి పారిపోయి స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. దీనిని బట్టి చూస్తే ఈ ఉగ్రదాడిని పాకిస్తాన్ అంత తీవ్రంగా భావించడం లేదని అర్థమవుతోంది. అతని తలపై అమెరికా సైతం 10 మిలియన్ డాలర్ల వెలకట్టింది. ఉగ్రదాడి జరిగి సోమవారానికి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. కాని ఈ దాడికి బాధ్యులైన మరో ఏడుగురు అనుమానితులకు ఎలాంటి శిక్ష పడలేదు. ఈ దాడికి ప్రధాన కారకులైన ఐఎస్‌ఐ, లష్కర్ ఉగ్రవాదులపై చర్యలు ఉండకపోతాయా అని బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూసినా, వారి ఆశ నిరాశ కాక తప్పదనిపిస్తోంది. పాక్‌లో వారికి శిక్ష పడటం ఇంచుమించు అసాధ్యంగా కనిపిస్తోంది.