మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాలముద్రిప్పు నేలబడి వక్త్రము గుక్షియు జూపు గ్రిందటం
గాలిడు ద్రవ్వు బిండదుని కట్టెదుటన్ శునకంబు భద్ర శుం
డాలము శాలితండుల గుడంబుల చాటువచశ్శతంబుచే
నోలి భుజించు ధైర్య గుణ యుక్తిగ జూచు మహోన్నత స్థితిన్

భావము:నీచుని నడవడికీ, ఉత్తముని నడవడికీ భేదం వుంటుంది. ఈ విషయాన్ని కవి దృష్టాంతాల ద్వారా నిరూపించాడు. కుక్క తనకు ఒక ముద్ద వేసే యజమాని ఎదుట తోకనాడించడం, నోరు, కడుపు చూపడం వంటి చేష్టలను చేస్తుంది. ఏనుగు అయితే తనకు అనేక ప్రియ వాక్యాలతో లాలిస్తూ ఆహారం ఇస్తుంటే ఎంతో ఠీవిగా తీసుకుంటుంది. ఈ విధంగా కుక్క చేష్టలనూ, ఏనుగు చేష్టలకు భేదం చెప్పబడింది.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ