అంతర్జాతీయం

ట్రంప్‌తో అమెరికాకు ప్రమాదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 17: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ అభ్యర్థిగా దాదాపు ఖరారైన డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో గెలిస్తే అమెరికాకు ప్రమాదమని ఆయన ప్రత్యర్థి డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ విదేశీ వ్యవహారాల సలహాదారు జేక్ సల్లివాన్ అన్నారు. ట్రంప్‌కు ఉన్న తొందరపాటుతనం.. దూకుడుతనం అమెరికా కమాండర్ ఇన్ చీఫ్‌గా ఎన్నికైతే ప్రపంచాన్ని అణ్వాయుధాల పోటీలోకి నెడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్‌తో విదేశీ విధానంపై జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడుతూ ట్రంప్ విధానాలపై విరుచుకుపడ్డారు. ట్రంప్ ప్రసంగాలు, వ్యాఖ్యలు.. రష్యా, చైనా వంటి శక్తిమంతమైన దేశాలతో సహా ఇతర దేశాలతో ఆయన వ్యవహరించబోయే తీరును స్పష్టం చేస్తున్నాయన్నారు. ‘ఒకసారి రష్యన్‌లతో కలిసి కూచుంటామంటారు.. మరోసారి అవసరమైతే రష్యన్ యుద్ధ విమానాలను కూల్చేస్తామంటారు. ఒకసారి చైనా మన భోజనాన్ని తినేస్తుందంటారు. మరోసారి చైనీయులు మనం కోరుకున్నది చేసే విధంగా సహకరించుకుంటామంటారు. ఒక సారేమే అమెరికా తాను ఏది అనుకుంటే అది.. ఎక్కడ అనుకుంటే అది.. ఏం సాధించాలనుకుంటే అది చేస్తుందంటారు. మరోసారి మనం చాలా ఎక్కువగా చేస్తున్నాం.. ఇవన్నీ ఆపేయాలంటారు..’అని జేక్ ఆరోపించారు. అమెరికా చరిత్రలో ఇలాంటి అభ్యర్థిని మునుపెన్నడూ చూడలేదని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఉగ్రవాదుల కుటుంబాలను చట్టాలకు వ్యతిరేకంగానైనా సరే హతమార్చాలని ఆదేశిస్తానంటూ ట్రంప్ మాట్లాడారన్నారు. ఈ రకమైన స్థిరత్వం లేని అభిప్రాయాలున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడైతే దాని పరిణామాలు అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు.