అంతర్జాతీయం

నీటికోసం 20కోట్ల గంటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 30: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు ఎక్కువ సమయం దేనికోసం ఖర్చు చేస్తున్నారో ఊహించగలరా? షాపింగ్ చేయడం కోసమో లేదా ఇరుగుపొరుగు వాళ్లతో కబుర్లు చెప్పడానికని చాలామంది అనుకోవచ్చు. అవేవీ కాదు, ఇంటికి అవసరమైన నీటిని సేకరించడం కోసమట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు. ఐక్య రాజ్య సమితి బాలల నిధి యునిసెఫ్ జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడయిన అంశం. ఇంటికి అవసరమైన నీటిని సేకరించడం కోసం ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు రోజుకు 20కోట్ల గంటలు వెచ్చిస్తున్నారని, ఈ పనికోసం వారు తమ జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారని యునిసెఫ్ పేర్కొంది. ముఖ్యంగా భారత దేశంలో అయితే లక్షలాది మంది మహిళలకు ఇది రొటీన్ వ్యవహారమయిపోయిందని కూడా ఆ సంస్థ అభిప్రాయ పడింది. నీరు తగినంతగా లేకపోవడం అనేది మహిళలు, బాలికల జీవితాలపై ఎంతగా ప్రభావం చూపిస్తోందో హైలైట్ చేసిన యునిసెఫ్ ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గంటలు అంటే మరో విధంగా చెప్పాలంటే 22,800 సంవత్సరాలు ఖర్చు చేస్తున్నారని పేర్కొంది.
నీటి సేకరణలో మహిళలు, పిల్లలు ముఖ్యంగా అమ్మాయిల పాత్ర, కోల్పోతున్న విలువైన సమయం, అవకాశాలు లాంటి పలు అంశాలపై ఐరాస పలు విభ్రాంతి కలిగించే అంశాలను వెల్లడించింది. 200 మిలియన్ల (20 కోట్ల) గంటలు అంటే 83 లక్షల రోజులు.. ఇంకో విధంగా చెప్పాలంటే 22,800 సంవత్సరాలకు పైగా అన్నమాట. అంటే ఒక మహిళ ఖాళీ బకెట్‌తో రాతియుగంలో బయలుదేరితే ఇప్పటికి (2016 సంవత్సరానికి) కూడా నీళ్లబకెట్‌తో ఇంటికి చేరుకోకపోవడంతో సమానం అని నీరు, శానిటేషన్, పరిశుభ్రత అంశాలపై ఐక్యరాజ్య సమితి గ్లోబల్ హెడ్ విజేశేకర అన్నారు. ఈ మధ్య కాలంలో ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందిందో, మన మహిళలు, అమ్మాయిలు ఎన్ని అవకాశాలు కోల్పోయారో ఊహించండని ఆయన అన్నారు.
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సమానమైన, సురక్షితమైన నీటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లక్ష్యం. దీనిలో మొదటి చర్యగా అరగంటలోపల ప్రతి ఒక్కరికీ నీటి సదుపాయం కల్పించడం కాగా, దీర్ఘకాలిక లక్ష్యం ఇంటివద్దకే ప్రతి ఒక్కరికీ నీటి సదుపాయం కల్పించడం. సోమవారం ప్రపంచ నీటి వారోత్సవం ప్రారంభమైన సందర్భంగా ఐరాస ఈ అధ్యయనం వివరాలను వెల్లడించింది. నీళ్లు గనుక పైపులద్వారా ఇంటివద్దకు సరఫరా చేయకపోయినట్లయితే మహిళలు, అమ్మాయిలపై ఆ భారం మరింతగా పడుతుందని యునిసెఫ్ పేర్కొంది. 21 సబ్ సహారా దేశాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఉదాహరణకు మలావిలో నీటి సేకరణకోసం మగవాడు సగటున రోజుకు కేవలం ఆరు నిమిషాలు ఖర్చుచేస్తే ఆడవాళ్లు 54 నిమిషాలు ఖర్చు చేస్తారని కూడా ఆ నివేదిక తెలిపింది. ఆసియా దేశాల్లో సీటి సేకరణకు గ్రామీణ ప్రాంతాల్లో సగటున 21 నిమిషాలు, పట్టణ ప్రాంతల్లో 19 నిమిషాలు పడుతోందని యునిసెఫ్ తెలిపింది.