అంతర్జాతీయం

ఖలీదా జియాపై దేశద్రోహం కేసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, డిసెంబర్ 27: పాకిస్తాన్‌నుంచి విడిపోవడానికి 1971లో జరిగిన యుద్ధంలో మృతిచెందిన బంగ్లాదేశ్ అమరవీరుల గురించి నిందాపూర్వక వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియాపై దేశద్రోహం నేరం మోపవచ్చా లేదా? అనే అంశంపై దర్యాప్తు జరపాలని బంగ్లాదేశ్‌లోని ఒక కోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తరువాత శిక్షాస్మృతిలోని 123(ఎ) సెక్షన్ కింద అభియోగాలపై దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించినట్లు కోర్టుకు చెందిన అధికారి పిటిఐకి చెప్పారు. సెక్షన్ 123(ఎ) కింద మోపిన అభియోగాలు నిరూపితమయితే గరిష్ఠంగా పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.