అంతర్జాతీయం

కొలంబియా అధ్యక్షుడికి నోబెల్ శాంతి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓస్లో, డిసెంబర్ 10: కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ శనివారం ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు. నార్వే రాజధాని ఓస్లోలో నార్వే నోబెల్ కమిటీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శాంటోస్‌కి శాంతి పురస్కారాన్ని అందజేశారు. కొలంబియాలో అయిదు దశాబ్దాలుగా సాగుతున్న విప్లవ సాయుధ దళాలతో చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని కుదర్చటంలో కీలక పాత్ర పోషించినందుకు శాంటోస్‌కి ఈ బహుమతిని నోబెల్ కమిటీ అక్టోబర్ 7న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకు నాలుగు రోజుల ముందే కొలంబియాలో నిర్వహించిన రెఫరండంలో శాంటోస్ తిరుగుబాటుదారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ శాంటోస్‌కి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. శాంతి బహుమతి అందుకున్న సందర్భంగా శాంటోస్ మాట్లాడుతూ తనకు నిజమైన బహుమతి కొలంబియాలో శాంతి నెలకొనటమేనని ఆయన అన్నారు. దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధం వల్ల దాదాపు 2.20లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, 60లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆయన అన్నారు. యుద్ధ నివారణకు తాను చేసుకున్న ఒప్పందం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అసహనం, సంక్షోభాలకు పరిష్కారం చూపగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.