అంతర్జాతీయం

ఉత్సాహంగా... ఉల్లాసంగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 1: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సహాల మధ్య జరపుపుకున్నారు. ఉగ్రవాద దాడుల భయం ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదుల ముప్పు ఉన్న దేశాల్లో కనీవినీ భద్రత ఏర్పాట్లు చేశారు. జర్మనీలో జిహాదీల దాడుల సమాచారం, దుబాయిలోని అడ్రస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం తప్ప ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. 2015కి ప్రజలంతా ఘనంగా వీడ్కోలు పలికారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఇక్కడ ఆరువేల మంది పోలీసులలో భద్రత కల్పించారు. న్యూయార్క్ మేయర్ బిల్ వేడుకలను ప్రారంభించారు. ప్రజలు పెద్ద ఎత్తున స్క్వేర్‌కు తరలివచ్చి కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. జనం చలికి కూడా అర్థరాత్రి వేళ వీధుల్లోకి వచ్చారు. 2015 సంవత్సరంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో నూతన దినోత్సవ వేడుకల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారిస్ నుంచి కాలిఫోర్నియా వరకూ కనీవినీ ఎరుగని భద్రత కల్పించారు. న్యూయార్క్ నగర చరిత్రలో ఎప్పుడూ లేనంత భద్రతను గురువారం రాత్రి ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. నవంబర్‌లో పారిస్‌లో ఐఎస్ ఉగ్రవాద దాడి, తరువాత పరిణామాల వల్ల యూరప్ అంతటా అప్రమత్తత పాటించారు.
అయితే జర్మనీలో వేడుకలు మరి కొద్ది సేపట్లో ప్రారంభమవుతాయనగా ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మ్యూనిచ్ నగరంలోని రెండు స్టేషన్ల నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతాసిబ్బంది అప్పటికప్పుడు రంగంలోకి దిగి ఏడుగురు అనుమానితులను అదపులోకి తీసుకుని ప్రశ్నించారు.
ఫ్రాన్స్‌లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఏకంగా లక్ష మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఛంపాస్ ఇలైసీస్‌లో గుమికూడిన పౌరులు 2015కు వీడ్కోలు చెప్పి, 2016కు స్వాగతం పలికారు. బ్రస్సెల్స్‌లో న్యూఇయర్ వేడుకలను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఐదుగురిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. దుబాయిలో 62 అంతస్తుల అడ్రస్ డౌన్‌టౌన్ లగ్జరీ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదం వార్తతో ప్రపంచ ఉలిక్కిపడింది. ప్రపంచంలోనే ఎత్తయి బుర్జ్ ఖలీఫా భవనానికి ఆనుకునే ఈ ప్రమాదం సంభవించింది. అక్కడ 16 మంది గాయపడ్డారు. నూతన సంవత్సర వేడుకలంటే గుర్తుకొచ్చేది సిడ్నీ. కళ్లుచెదిరిపోయే ఏర్పాట్లు, కాంతులీనే బాణాసంచా వెలుగుల్లో జనం అత్యంత ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.

చిత్రం... ఇండోనేషియా రాజధాని జకార్తాలో బాణసంచా వెలుగు జిలుగుల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న దృశ్యం... రియో డి జనీరోలో కోపాకబానా బీచ్‌లో జలకాలాడుతూ బాణసంచా వెలుగుల విన్యాసాలను తిలకిస్తున్న ఓ జంట