అంతర్జాతీయం

న్యూయార్క్‌ను వణికిస్తున్న మంచు తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 15: ‘స్టెల్లా’ మంచుతుపాను తాకిడికి అమెరికా ఈశాన్య ప్రాంతం అతలాకుతలమయింది. మంచు తుపాను ధాటికి వేలాది విమాన సర్వీసులు రద్దు కాగా, స్కూళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. అయితే ముందు భయపడినట్లుగా న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలపై ఈ తుపాను తీవ్రత పెద్దగా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కనెక్టికట్, మసాచుసెట్స్ రాష్ట్రాల్లో మాత్రం ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్ నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం రాత్రినుంచి బుధవారం ఉదయం వరకు దాదాపు 76 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. అయితే 84 లక్షల జనాభా కలిగిన న్యూయార్క్ నగరంలో హిమపాతం తక్కువగా ఉండడంతో ప్రమాద హెచ్చరికలను రద్దు చేశారు. వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో వాతావరణం ప్రమాదస్థాయిలో ఉంటుందన్న హెచ్చరికల కారణంగా వాషింగ్టన్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగాల్సిన సమావేశం శుక్రవారం దాకా వాయిదా పడిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఉష్ణోగ్రతలు నీళ్లు గడ్డే కట్టే స్థాయికన్నా దిగువకు పడిపోవడంతో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. దీంతో బుధవారం తెల్లవారుజాము దాకా నగరవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్ సబ్‌వే, బస్ సర్వీసులు నడుస్తున్నప్పటికీ పాఠశాలలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డంతోపాటుగా జనం ఇళ్లలోంచి బైటికి రాకపోవడంతో నగరమంతా బోసిపోయి కనిపిస్తోంది. జాన్ ఎఫ్.కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా ఇతర విమానాశ్రయాలు సైతం మూతపడ్డాయి. రన్‌వేలపైన పేరుకుపోయిన మంచును తొలగించడంలో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. బోస్టన్ వైపు వెళ్లే రైళ్లన్నిటినీ రద్దు చేశారు. రైళ్లు కూడా రద్దు కావడంతో చాలామంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో చిక్కుపడిపోయారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంతో పాటుగా మ్యూజియం తదితర సందర్శనీయ ప్రాంతాలు కూడా మూతపడ్డాయి.