అంతర్జాతీయం

భారత వృద్ధిరేటును తగ్గించిన ఐఎమ్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 18: భారత వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) తగ్గించింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.2 శాతంగానే నమోదు కావచ్చని మంగళవారం పేర్కొంది. నగదు కొరత కారణంగా తాత్కాలికంగా వినియోగ సామర్థ్యం దెబ్బతిన్నదని, చెల్లింపుల వ్యవస్థకూ అసౌకర్యం కలిగిందని తమ తాజా వార్షిక ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌లో ఐఎమ్‌ఎఫ్ అభిప్రాయపడింది. అమెరికాలో ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాలకు ముందు ఇది విడుదలవగా, ఇందులో భారత్ పాల్గొననున్న క్రమంలో ప్రాధాన్యతను సంతరించుకుంది.