అంతర్జాతీయం

రేప్ కేసులో అసాంజేకి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్, మే 19: అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి న్యాయపోరాటంలో పెద్ద విజయం లభించింది. 2012 నుంచి అతను లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న విషయం విదితమే. ఈ కేసులో అతనిపై ఏడేళ్ల నుంచి జరుపుతున్న దర్యాప్తును స్వీడిష్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం విరమించుకున్నారు. అయితే 2012లో జారీ అయిన అరెస్టు వారెంట్‌ను పట్టించుకోకుండా అసాంజే లొంగిపోయేందుకు నిరాకరిస్తూ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, కనుక ఈక్వెడార్ రాయబార కార్యాలయాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయను అరెస్టుచేసి తీరుతామని బ్రిటిష్ పోలీసులు తేల్చిచెప్పారు. అసాంజేకి వ్యతిరేకంగా జారీ చేసిన పాన్ యూరోపియన్ అరెస్టు వారెంట్‌ను రద్దు చేసేందుకు లేదా దానిని పొడిగించేందుకు శుక్రవారమే తుది గడువు. అయితే ఆయనపై ఏడేళ్ల నుంచి జరుపుతున్న దర్యాప్తును విరమించుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ మరియానే శుక్రవారం నిర్ణయించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అసాంజే నవ్వుతూ ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయ ప్రకటనపై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయ ప్రకటనతో అసాంజేకి న్యాయపోరాటంలో సంపూర్ణ విజ యం లభించిందని ఆయన తరఫు న్యాయవాది ఒకరు స్వీడిష్ రేడియోతో అన్నారు.

శుక్రవారం లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీ బాల్కనీనుండి మాట్లాడుతున్న అసాంజే

వదంతులతో ఆరుగురి హత్య
జార్ఖండ్‌లో దారుణం పోలీసులకూ గాయాలు
జంషెడ్‌పూర్, మే 19: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే వదంతులతో ఆరుగురు వ్యక్తులను గ్రామస్తులు కొట్టి చంపేశారు. సెరాయికేల జిల్లా రాజ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోట్ల ఈ దారుణం చోటుచేసుకుంది. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాగా అనుమానించిన జనం వాహనాలను ధ్వంసం చేశారు. జనాన్ని అదుపుచేయడానికి వచ్చిన పోలీసులకు గాయాలు అయ్యాయి. బగ్బెరా పోలీసు స్టేషన్ పరిధిలోని నగధి ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులను గురువారం రాత్రి కొట్టి చంపేశారని ఎస్‌పి (సిటీ) ప్రశాంత్ ఆనంద్ చెప్పారు. ఆందోళనకారుల దాడిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఇంటిలో ఉన్నవారిని బయటకు లాక్కొచ్చి మరీ దారుణానికి పాల్పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరిని గుర్తించినట్టు ఎస్‌పి తెలిపారు. ఉత్తమ్‌కుమార్ వర్మ(జగుసలాయి), గణేశ్‌కుమార్ గుప్తా (బగ్బెరా) లుగా గుర్తించామని, మరోక మృతుడిని గుర్తించాల్సి ఉందని అన్నారు. విష యం తెలిసి ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులపై జనం రాళ్లతో దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులూ గాయపడ్డారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు పికెట్ ఉందని ఎస్‌పి ఆనంద్ వెల్లడించారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేవారు వచ్చారన్న వార్త చుట్టుపక్కల ప్రాంతానికి దావానంలా వ్యాపించింది. దీంతో సొసొమొలీ గ్రామంలో ఇద్దరిని జనం తీవ్రంగా కొట్టారు. దీంతో వారిద్దరూ చనిపోయారు. శోభాపూర్ గ్రామంలోనూ స్థానికులు ఓ వ్యక్తిని కొట్టి చంపేశారని ఎస్‌పి తెలిపారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని డిఐజి ప్రభాత్ కుమార్ చెప్పారు.