అంతర్జాతీయం

ఉగ్రవాదంపై సమష్టి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, ఫిబ్రవరి 4: రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాద జాడ్యాన్ని ఎదుర్కోవడానికి భావ సారూప్యత గల దేశాల మధ్య పటిష్ఠమైన సహకారం అవసరమని భారత ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పిలుపునిచ్చారు. భారత్-్థయిలాండ్ మధ్య రక్షణ సంబంధాల పెరుగుదలకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. థాయిలాండ్‌లోని ప్రతిష్టాత్మకమైన చులలోంగ్‌కోర్న్ విశ్వవిద్యాలయంలో గురువారం ఆయన భారత్, థాయిలాండ్, ఆసియాన్‌లు తమ సంబంధాలను మరింతగా విస్తరించుకునే అంశంపై విద్యావేత్తలు, వాణిజ్యవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విస్తరిస్తున్న తీవ్రవాదం, ఉగ్రవాదం ముప్పును మన రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఇలాంటి ముప్పును విజయవంతంగా తిప్పికొట్టాలంటే భావసారూప్యత గల భాగస్వామ్య దేశాల మధ్య పటిష్ఠమైన సహకారం అవసరమని అన్నారు. భారత్, థాయిలాండ్ మధ్య ఈ రంగంలో బలోపేతమైన సహకారం ఉందని పేర్కొంటూ ఇలాంటి సహకారాన్ని ప్రాంతీయ స్థాయిలో వ్యవస్థాగతం చేయడానికి ఇరు దేశాలు చర్యలు తీసుకోవడం పట్ల తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. గత అయిదు దశాబ్దాలలో ఆగ్నేయాసియా దేశమైన థాయిలాండ్‌ను సందర్శించిన తొలి భారత ఉప రాష్టప్రతి అన్సారీయే. థాయిలాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయుత్ చాన్ ఒ చాతో బుధవారం అన్సారీ చర్చలు జరిపారు. ఆగ్నేయాసియా ప్రాంతంతో సంబంధాలను పెంపొందించుకోవడంలో భాగంగా భారత్‌కు థాయిలాండ్‌తో ఉన్న బంధం ప్రాముఖ్యతను తన పర్యటన వెల్లడిస్తోందని అన్సారీ అన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల పెరుగుదలకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ‘్భరత నౌకాదళానికి చెందిన నౌకలకు, భారత తీర రక్షక దళానికి ఇటీవలి సంవత్సరాలలో అనేక సందర్భాలలో థాయిలాండ్ ఆతిథ్యమిచ్చింది. సాంకేతికంగా, మానవ వనరుల అభివృద్ధి పరంగా, సామర్థ్య నిర్మాణ పరంగా ఇరు దేశాల మధ్య ఈ సహకారం కొనసాగుతుందన్న విశ్వాసం మాకు ఉంది’ అని ఆయన అన్నారు. అయితే భారత్, థాయిలాండ్ రెండూ వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలు అయినప్పటికీ రెండింటి మధ్య ఆర్థిక సహకారం మాత్రం ఓ మాదిరిగానే ఉందని అన్సారీ అన్నారు.

థాయిలాండ్‌లోని చులలోంగ్‌కోర్న్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సదస్సులో అన్సారీ. చిత్రంలో ఆ దేశ ఐటి శాఖ మంత్రి ఉత్తమ సవయాన, యూనివర్సిటీ చైర్‌పర్సన్ కలయ తింగ్సబంధ్