అంతర్జాతీయం

తైవాన్‌లో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తైనాన్: దక్షిణ తైవాన్‌లో సంభవించిన తీవ్ర భూకంపకానికి 14మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. బహుళ అంతస్తు భవనం కూలిపోయి 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. శిథిలాల కింద నుంచి 247 మందిని రక్షించారు. 1200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.
భూకంప తీవ్రతకు 17 అంతస్తుల భవనం కుప్పకూలిపోయిందని స్థానిక మీడియా వెల్లడించింది. భవనంలోని ఓ కేర్ సెంటర్ నడుస్తోంది. ఈ దుర్ఘటనలో ఓ పసికందు మృతి చెందింది. ప్రకంపనలు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వచ్చాయి. యుజింగ్‌కు ఆగ్నేయంగా 22 మైళ్లలో కేంద్రీకృతమైందని యుఎస్ భూగర్భపరిశోధక కేంద్రం తెలిపింది. ‘ముందు ఓ సమాంతరంగా భూమి ఊగుతున్నట్టు అనిపించింది. తరువాత ఉన్నట్టుండి కిందకు.. ఆ తరువాత ఎడమ నుంచి కుడికి పెద్దగా కదిలింది’ అని తైనాన్ నివాసి లిన్ బోగుయి చెప్పాడు. బహుళ అంతస్తు భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో భయంతో వీధుల్లోకి పరుగులెత్తామని అతడు తెలిపాడు. ఈ దుర్ఘటనలో పది రోజుల చిన్నారితోపాటు 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వంద మందిని ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలందిస్తున్నారు. బహుళ అంతస్తు భవనంలో 256 మంది నివసిస్తున్నారు. సహాయక బృందాలు 247 మందిని రక్షించగా 26 మంది ఆచూకీ తెలియడం లేదు.

పాక్‌లో తాలిబన్ల పంజా

ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది మృతి

కరాచీ, ఫిబ్రవరి 6: పాకిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో శనివారం సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎనిమిదేళ్ల బాలిక, నలుగురు సైనిక సిబ్బందిసహా తొమ్మిది మంది మృతి చెందగా, దాదాపు మరో 40 మంది గాయపడ్డారు. క్వెట్టా నగరంలోని జిల్లా కోర్టుకు సమీపాన ఇరుకుగా ఉండే కచారీ ఏరియాలో ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సి) సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతమంతా భీకర శబ్ధంతో దద్దరిల్లిందని, ఈ దాడిలో 9 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరుడు ఎఫ్‌సి సైనిక వాహనానికి సమీపాన తనను తాను పేల్చేసుకున్నాడని, కనుక ఇది ఆత్మాహుతి దాడేనని డిఐజి ఇంతియాజ్ షా పేర్కొన్నట్లు ‘డాన్ న్యూస్’ వెల్లడించింది. ఈ ఉగ్రదాడిలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని బలూచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి అన్వర్ ఉల్‌హక్ తెలిపారు. జిల్లా, సెషన్స్ కోర్టులు, మార్కెట్, ఆసుపత్రులు, ఇతర కార్యాలయాలతో ఎంతో ఇరుకుగా ఉండే కచారీ ఏరియాలో ఎప్పటిమాదిరిగానే జనం కిటకిటలాడుతున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ఆయన చెప్పారు.