బాలీవుడ్‌పై గురి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో గ్లామర్ హీరోయిన్‌గా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రెజీనా ప్రస్తుతం తన ఫోకస్ బాలీవుడ్ వైపు మార్చినట్టుంది. తాజాగా ఆమె నటిస్తున్న ఆంఖే-2 చిత్రంలో అమితాబ్‌తో కలిసి నటిస్తోంది. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు గట్టిగానే కసరత్తు చేస్తోందట. గ్లామర్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపుతోందని, ఈ సినిమాతో బాలీవుడ్‌లో వరుస అవకాశాలు పట్టేయాలనే ఆలోచనలో వుందట. అమితాబ్‌తో నటించడానికి ఎలాంటి భయమూ వేయలేదని, ఆయన చాలా గొప్ప వ్యక్తని, అలాంటి సీనియర్ల నుండి చాలా నేర్చుకోవాలని, నాకీ సినిమా రీలాంఛ్ కాదు కానీ, హిందీ సినిమా చేయడం కొత్త స్టెప్ అని అంటోంది. ప్రస్తుతం తెలుగులో నక్షత్రంలో నటిస్తున్న ఈమె తమిళంలో రెండు చిత్రాలు చేస్తోంది. మరి బాలీవుడ్‌లో చేస్తోన్న ఆంఖే-2లో రెజీనా కొత్తగా ట్రై చేస్తున్నానని చెబుతోంది.