Others

అధ్యయనంతో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చదువుకునే రోజుల్లో కొంతమంది ఉపాధ్యాయులు కలసి ఒకసారి టీచింగ్ నోట్స్ తయారు చేసుకుంటే చాలు అది అధ్యాపక వృత్తిలో ఉన్నన్నాళ్లూ ఎంతగానో ఉపయోగపడేది. కానీ, ఇప్పటి కాలంలో తయారు చేసుకున్న టీచింగ్ నోట్స్ రెండో ఘడియ వరకు కూడా ఉపయోగపడటం లేదు. జ్ఞానం అంత తొందరగా మారుతూ ఉన్నది. అదే మాదిరిగా విద్యార్థుల ఆలోచనా ధోరణి కూడా చాలా వేగంగా మారుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు టీచింగ్ నోట్స్‌ను మార్చకుంటున్నా అది పాచిపోయిన అన్నం తీరుగా తయారవుతున్నది. దీన్ని ఏ ఫ్రిజ్‌లో పెట్టినా ఉపయోగపడటం లేదు. అందుకే ఏ రోజుకారోజు టీచర్ తరగతి గదికి నోట్స్ తయారుచేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. కొంతమంది ‘పాఠ్యపుస్తకం మారలేదు కదా?’ అని అనవచ్చును. పాఠ్యపుస్తకంలో టాపిక్ మాత్రం అదే ఉండవచ్చు. కానీ, విశే్లషణ మాత్రం తరచూ మారుతూ ఉంటుంది. దానికోసం పత్రికల్లో వచ్చే కొత్త కొత్త ఆర్టికల్స్ చదువుతుండాలి. ప్రతి దినపత్రిక ఇపుడు ‘ఎడ్యుకేషన్ సప్లిమెంట్ల’ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ఆ పత్రిక చదివి విద్యార్థి తరగతి గదికి వస్తున్నాడు.
మనం పాత యాసలో పోసి చెబితే కొంతమంది పిల్లలు ప్రశ్నించవచ్చు. ఏ రోజుకారోజు మనం నోట్స్‌ను సవరించుకుంటుండాలి. ఆ నోట్స్ మన బోధనా కార్యక్రమానికి మార్గదర్శి అవుతుంది. ఇలా ఉపాధ్యాయుడు క్లాస్‌కు పోయిన తర్వాత తన ఆలోచనతో తయారుచేసుకున్న నోట్స్‌లో కొత్త ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నల రూపకల్పనతో ఉపాధ్యాయుడి ఆలోచన మారుతుంది. క్లాస్ రూమ్‌లో ఉపాధ్యాయుడి బోధనలో ఏం మాట్లడాలో అది ప్రధానం. నోట్స్ ప్రధానం కాదు. తరగతి గదిలో 40 మంది పిల్లలు ఉంటారు కాబట్టి వారి నుంచి 40 రకాల ప్రశ్నలు వస్తాయి. ప్రతి విద్యార్థి నేపథ్యం వేరే ఉంటుంది. చెప్పబోయే పాఠాన్ని గురించి ఉపాధ్యాయుడు ఎంత తయారై వస్తాడో విద్యార్థి కూడా అంతే తయారై వస్తాడు. అత్యాధునిక సమాచారాన్ని తెలుసుకుని అప్పటికప్పుడు తరగతి గది బోధనలో మార్పులు చేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధపడి ఉండాలి. ‘నేను చదివిన పుస్తకంలో ఇలా ఉందం’టే ఎవరూ వినరు. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను ఉపాధ్యాయుడు తనలో నిక్షిప్తం చేసుకొని బోధనలో కొత్తపుంతలు తొక్కాలి. అప్పుడే తరగతి గది ‘మార్పు’లకు కేంద్ర బిందువు అవుతుంది. అప్పుడే తరగతి గదిలో నూతన భావాలు, నూతన సమాజాల ఆవిష్కరణ జరుగుతుంది.

- చుక్కా రామయ్య