Others

అందం లేకుంటే కట్నం ఇవ్వాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతాబ్దాల కాలంగా మహిళలు అణచివేతకు వ్యతిరేకంగా, సమాన హక్కుల కోసం నిరంతరాయంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాల ఫలితంగా మహిళల పరిస్థితి కొంతమేరకు మెరుగైనప్పటికీ , వారు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ప్రపంచంలో మహోన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన దేశాలలో భారత్‌దే అగ్రస్థానం. భారతీయతలో బాహ్య సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికే పెద్దపీట వేశారు.
అయితే, వందల సంవత్సరాలపాటు పరాయి పాలనలో ఉన్నపుడు మన సంస్కృతి, సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేయడానికి విదేశీయులు ప్రయత్నించారు. దీనికితోడు పాలకులు బహుళ జాతి కంపెనీలకు వత్తాసు పలకడం, బహుళజాతి కంపెనీలు ఆకర్షణీయంగా వ్యాపార ప్రకటనలు రూపొందించి, ప్రజలను సౌందర్య పిపాసులుగా మార్చడం వెరసి భారతదేశం సౌందర్య సాధనాలు విక్రయాలకు కేంద్ర స్థానంగా మారింది. బాహ్య సౌందర్యం వల్లనే ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు, అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తామనే భావనను ప్రజలలో కల్పించడంలో సౌందర్య సాధనాలు తయారుచేసే సంస్థలు సఫలీకృతం అయ్యాయి. బాహ్య సౌందర్యమే ప్రధానమంటూ ఘనత వహించిన మన పాఠ్యపుస్తకాలు కూడా ఘోషిస్తూండటం దురదృష్టకరం. మహారాష్టల్రో 12వ తరగతి విద్యార్థులకు ‘్భరతదేశంలో ప్రధాన సామాజిక సమస్యలు’ (మేజర్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా) అనే పాఠ్యాంశం ఉంది. ఈ పాఠ్యాంశంతో మతం, కులం, పరువు, ప్రతిష్ట, వరకట్నం, పరువు హత్యలు తదితర అంశాల గురించి చర్చించారు. ఇటువంటి పాఠ్యాంశాలు ఉండటం మంచిదే. దీనివల్ల విద్యార్థిదశ నుంచే వారికి సామాజిక సమస్యల పట్ల అవగాహన కలుగుతుంది. అయితే, వరకట్నం గురించి వివరించే సందర్భంలో ‘అమ్మాయి అందవికారంగా ఉన్నా, దివ్యాంగురాలు (వైకల్యం) అయినా వారికి వివాహం కలగడం కష్టం అవుతున్నది. అందం లేని యువతులను వివాహం చేసుకోవడానికి అబ్బాయి తరఫువారు భారీగా వరకట్నం అడుగుతున్నారని పేర్కొన్నారు. అందానికి ప్రామాణికం ఏమిటన్నది ఆ పాఠ్యాంశంలో చెప్పలేదు.
వరకట్నం అనేది సాంఘిక దురాచారం. సినీ తారలను మించి అందం ఉన్న వారిని వివాహం చేసుకోవడానికి కూడ కట్నం అడుగుతున్న విషయం సర్వవిదితమే. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని ఒకవైపు గొప్పలు పోతూనే, మరోవైపు బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యం ఇచ్చే పాశ్చాత్య సంస్కృతి వైపుమన యువతను నడిపిస్తున్నాం. 12వ తరగతి అంటే యవ్వనం ప్రారంభ దశ. ఈ దశలోని పిల్లలకు అందమే ముఖ్యమని బోధించడం ఎంతవరకు సబబో ఘనత వహించిన పెద్దలే తెలియాలి. ఈ విషయంపై వ్యక్తం అవుతున్న విమర్శలను మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తాడ్వే ఖండించడం మరింత దారుణం. వరకట్నం గురించి చర్చించే సమయంలో వాస్తవాలనే పాఠ్యాంశంలో పేర్కొన్నారని ఆయన చెప్పడం పురుషాహంకారానికి ఉదాహరణ.
పాఠ్యాంశాలు రూపొందించే విద్యావేత్తలు కూడ పురుషాధిక్యత ప్రదర్శించడంలో అతీతులు కారని ఈ పాఠ్యాంశం ద్వారా అర్థమవుతుంది. యువతలో చెడు అభిప్రాయాలు కలిగేలా ఉన్న ఇటువంటి పాఠ్యాంశాలు భవిష్యత్‌లో రాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- పి.మస్తాన్‌రావు