Others

నేతలకు స్ఫూర్తిదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..’ అన్న చం దాన నేటి ఆధునిక యుగంలో మన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న విషయం సర్వ విదితమే. ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ తరఫున గెలుపొంది, అనంతరం అధికార పార్టీలోకి ‘జంప్’ అవుతున్న ప్రజాప్రతినిధులకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఏ ప్రాంతంలోనూ కొదవలేదు. కాగా, రాజకీయాలు భ్రష్టుపడుతున్న ఈ కాలంలోనూ నైతిక విలువలకు ప్రాణం పోయడానికి పూనుకున్నాడు ఒక యువ ప్రజాప్రతినిధి. ఆయన ఓ మాజీ ముఖ్యమంత్రి తనయుడు కావడం గమనార్హం. ఆయన ఎవరో కాదు.. గోవాకు చెందిన యువ శాసనసభ్యుడు విశ్వజిత్ రాణే.
గోవా శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించలేదు. కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు లభించినప్పటికీ (సింగిల్ లార్జెస్ట్ పార్టీ) ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన శాసనసభ్యుల మద్దతు సంపాదించడంలో ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలం అయింది. తమ పార్టీకే ఎక్కువ స్థానాలు లభించాయి కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ తమనే ఆహ్వానిస్తారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత చిన్నా చితకా పార్టీల శాసనసభ్యులను ఆకట్టుకోవడం సులభం అవుతుందనే ఆలోచన- గోవాలో కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచింది.
కాంగ్రెస్ పార్టీ అసమర్ధతను బిజెపి చక్కగా వినియోగించుకుని ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకోవడంలో విజయం సాధించింది. గవర్నర్‌ను కలిసిన తర్వాత బిజెపి నేత మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. శాసనసభలో బలపరీక్ష సమయంలో కాంగ్రెస్‌కు చెందిన విశ్వజిత్ రాణే సభకు హాజరు కాకపోవడంతో పారికర్ సులభంగా నెగ్గారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలం అయినందుకు నిరసనగా విశ్వజిత్ కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బిజెపికి చేరువై, పారికర్ మంత్రివర్గంలో స్థానం పొందారు. త్వరలో వోల్వోయ్ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున ఆయన పోటీ చేయనున్నారు. ఆయన తండ్రి ప్రతాప్‌సింగ్ రాణే మాజీ ముఖ్యమంత్రి. ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్ తరఫున వరసగా తొమ్మిదవ సారి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం గమనార్హం.
విశ్వజిత్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినా మంత్రి పదవి పొందవచ్చు. అయితే పదవులు పొందడం కన్నా రాజకీయాలలో ఉన్నత విలువలు పెంపొందించడం కోసమే ఆయన శాసనసభలోకి అడుగుపెట్టకుండానే తన శాసన సభ్యత్వాన్ని తృణప్రాయంగా త్యజించారు. ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీలు మారిన శాసనసభ్యులు విశ్వజిత్ రాణేను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాలపాటు మనుగడను సాధించగలుగుతుంది. మొత్తం మీద విశ్వజిత్ రాణే దేశంలోని ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు.

చిత్రం..విశ్వజిత్ రాణే

-పి.మస్తాన్‌రావు