Others

పర్యావరణానికి ట్రంప్ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పారిస్ ఒప్పందం’ నుంచి తాము వైదొలగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటనతో ప్రపంచం యావత్తు నిర్ఘాంతపోయింది. మానవాళి, జంతుజాలం, వృక్షాలతోపాటు సమస్త ప్రకృతిని వైపరీత్యాలకు గురి చేయడమేనా? ట్రంప్ లక్ష్యం అన్న ఆందోళనతో ప్రపంచ దేశాలు అవాక్కయిపోయాయి. ప్రకృతి వైపరీత్యాలు కేవలం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన విషయం కాదు. ట్రంప్ తన నిర్ణయాలకు ఏవేవో సరికొత్త ప్రతిపాదనలను ఆపాదించి, పారిస్ ఒప్పందం వల్ల తమ దేశం ఘోరంగా నష్టపోతుందనడం కేవలం బూటకం.
భూతాపాన్ని ఊహించని ప్రమాదకర స్థాయిలోకి తీసుకురావడానికి కారణం అమెరికానే అని ఎన్నో దేశాలు చాలాకాలంగా గగ్గోలు పెడుతున్నాయి. భూతాపాన్ని ట్రంప్ నిర్ణయాలు కానీ, విధానాలు కానీ ఏ మాత్రం చల్లార్చలేవు. ప్రకృతి ప్రకోపిస్తే అమెరికా అయినా, మరే దేశమైనా విపత్తులను ఎదుర్కోవాల్సిన విషయాన్ని ప్రపంచ దేశాధినేతలంతా గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం. కొనే్నళ్లుగా వాతావరణ మార్పుల అంశం అన్ని దేశాల్లోను విపరీతమైన ప్రాధాన్యత సంతరించుకుంది. అకాలవర్షాలు, సముద్రంలో సునామీలు, తుపానులు, వడగాడ్పులు, విపరీతమైన పెనుగాలులు, పుడమిపై అంతకంతకూ వేడెక్కిపోతున్న ఉష్ణోగ్రతల మూలంగా ప్రాణికోటి మనుగడకే ప్రమాదం చుట్టుముడుతోంది.
కాలుష్యాన్ని పెద్దఎత్తున వెదజల్లుతున్న పారిశ్రామిక వాడలపై ప్రభుత్వ పర్యవేక్షణ నా మమాత్రం కావడం తో కాలుష్యం వాతావరణంలోకి ప్రవేశించి భూ తాపాన్ని మరింత పెంచుతోంది. 2015 డిసెంబర్‌లో పారిస్‌లో వాతావరణ మార్పులపై జరిగిన సదస్సులో ప్రపంచ దేశాలు కీలక తీర్మానాలు ఆమోదించాయి. భూతాపాన్ని తరిమికొట్టి కర్బన ఉద్గారాల సమస్యను అధిగమించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన ప్రపంచానికి 2020 నుంచి ఏటా 10వేల కోట్ల డాలర్ల నిధిని సమకూర్చాలనేది ఆ ఒప్పందంలోని కీలకాంశం. కర్బన ఉద్గారాలను కనీసం రెండు డిగ్రీలకు పరిమితం చేసేందుకు అన్ని దేశాలు నిబద్ధతతో ప్రణాళికలు అమలు చేయడం అవసరం. పర్యావరణ పరిరక్షణపై రెండు దశాబ్దాలపాటు జరిగిన వివిధ అంతర్జాతీయ సమావేశాల్లో అమెరికా భాగస్వామిగా వ్యవహరించి సానుకూలతను వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులను నియంత్రించి పర్యావరణ పరిరక్షణకు పూనుకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందం వల్ల అమెరికాకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, దానివల్ల చైనా,్భరత్‌లకు లబ్ధి చేకూరుతోందని అభాండాలను వేయడంలో ట్రంప్ తనకు తాను సరి అనిపించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను వెల్లువెత్తించేది అమెరికానే. అయితే ఆ దేశ అధ్యక్షుడు ఎందుకు అలాంటి ప్రకటన చేసారో అంతుపట్టని మిలియన్ డాలర్ల ప్రశ్న. తన నిర్ణయం ఫలితంగా ట్రంప్ ‘తప్పు చేసినవాడి’గా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

- దాసరి కృష్ణారెడ్డి