Others

తరగతి గది స్వరూపం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి లక్ష్యం పాత పుస్తకాల నుంచి కొత్త పుస్తకాలకు మార్చటం కాదు. విద్యార్థి ఆలోచనా విధానాన్ని మార్చటమే సామాజిక మార్పునకు దోహదపడుతుంది. కరికులం మార్చినంత మాత్రాన తరగతి గదికి కొత్త స్వరూపం రాదు. ఉపాధ్యాయుడు మారాలి. చెప్పవలసిన విషయం మాత్రం ప్రభుత్వం చెప్పవచ్చును. కానీ చెప్పేది ఉపాధ్యాయుడు. టీచింగ్ సంపూర్ణంగా మారాలి. అనగా బోధన విద్యార్థిలో ఆసక్తిని కలిగించాలి. తరగతి గదిని ఇతర వ్యవస్థలతో గ్రంథాలయాలతో, సమాజంతో క్రీడాప్రాంగణాలతో కలిపి పిల్లల్లో ఆసక్తిని కలిగించాలి. జ్ఞానం పిల్లలను చైతన్యవంతం చేయాలి. జ్ఞానం వైపునకు పిల్లలు పరుగెత్తాలి. పిల్లలకు ఉపాధ్యాయుడు ప్రేరకుడిగా మారాలి. చదువు అనేది ఒకరి ద్వారా వచ్చేది కాదు. విద్యార్థి అంతర్మధనమే చదువుకు కారణభూతం అవుతుంది. టీచర్ చెప్పే ప్రతిమాట తూటాల మాదిరిగా విద్యార్థి మెదడును తొలచాలి. బోధనలోనే మార్పు రావాలి. ఈ మార్పు లెర్నింగ్ మార్పునకు దోహదపడుతుంది. ఈ లెర్నింగ్ అన్నది అందరిలో ఒక రకంగా ఉండదు. విద్యార్థి మేధస్సు స్పందించి సాధకునికి విస్తృత పరిమితి ఇస్తుంది. ఆ సాధన ఒక్కొక్కనిలో ఒక్కో రకంగా ఉంటుంది. లెర్నింగ్ విద్యార్థి అంతరంగంలో జరిగే శుద్ధి కార్యక్రమం. ఇది ఒక రసాయనిక ప్రక్రియ. అంతర్మధనమే ఉన్నత జ్ఞానానికి చైతన్యం ఇస్తుంది. అనగా జ్ఞానం ఎవరికి వాళ్లు తెలుసుకునేది కానీ అది గురువు ఇచ్చేది కాదు. టీచింగ్ వేరు. లెర్నింగ్ వేరు. టీచింగ్‌లో ఏకత్వం (యూనిఫామిటి) ఉంటుంది. లెర్నింగ్‌లో భిన్నత్వం (డైవర్శిటీ) ఉంటుంది. అందుకే తరగతి గది వందలపూలు వికసింపచేస్తుంది. వేయి ఆలోచనలను సంఘర్షింపచేస్తుంది. తోటమాలి ఒకరే కావచ్చును. కానీ వేల ఆలోచనలు వికసిస్తాయి. సిలబస్ మార్పు తొలి అడుగు మాత్రమే. బోధన విధానం మారాలి. టీచింగ్, లెర్నింగ్‌లో మార్పు రావాలి. అప్పుడే తరగతి గది స్వరూపం మారుతుంది.
క్లాస్‌రూమ్ సజీవంగా ఉండాలి
ప్రతియుగంలో ప్రతివర్గానికి తరగతిగదిపై కొన్ని ఆకాంక్షలుంటాయి. అవి నెరవేరకపోతే సమాజంలోని ఒక భాగం కుళ్లిపోతుంది. తరగతి గదిని అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో శోభాయమానంగా ఉంచాలి. కొన్నిసార్లు సమాజం నిర్లక్ష్యం చేస్తుంది. తరగతి గదికి కొత్త నీరును ఆహ్వానించినప్పుడు దానిపైన సదుపాయాలు కూడా కలిగించాలి. ఎన్నో అన్యాయాలకు గురై సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన వర్గాలను తరగతి గది ఆహ్వానించాలి. అక్కున చేర్చుకోవాలి. తరగతి గదికి సంబంధించిన వివిధ అంశాలను సమాజంలోని ఎత్తుపల్లాలను సరిదిద్దే విధంగా సవరించకపోతే ఏం జరిగిందో చరిత్ర తెలియజేస్తుంది. బాలికలను తరగతి గది ఆహ్వానించింది. దళితులను తరగతిగది ఆహ్వానించింది. కానీ వారి అవసరాలను తరగతి గది తేలికగా తీసుకుంటుంది. గత ప్రమాణాలతోనే మూల్యాంకనం చేయడం జరిగింది. దాని పరిణామం ఏమైంది? ఆ పాత ప్రమాణాలవల్ల దళిత బహుజన వర్గాల పిల్లలు తిరిగి తరగతి గదికి దూరమయ్యారు. ఆ సమస్యే చినికిచినికి ఒక జాతీయ సమస్యగా మారిపోయింది. పిల్లల డ్రాప్‌అవుట్ సమస్య తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తరగతి చిక్కుల్లో పడింది. కొత్త తరాన్ని ఆహ్వానించినప్పుడు వారిని ఇముడ్చుకునే ఏర్పాటు చేయకపోతే తరగతి గది బక్కచిక్కుతుంది. దాని బలహీనత దేశ ప్రజాస్వామిక వ్యవస్థనే క్రుంగతీస్తుంది. తరగతి గదిని నిర్లిప్తంగా చూడకూడదు. అది సమాజం వౌలిక అంశాలనే కదిలిస్తుంది. తరగతి గది కొత్త ప్రదేశాల్లో కాంతిని ప్రసరింపజేస్తుంది. దానికి తగినట్లుగా సమర్థవంతంగా దాన్ని పెంచుతూ పోవాలి. తరగతి గది సజీవమైన వ్యవస్థ. దాన్ని కనుపాపను చూసినట్లు సురక్షితంగా చూస్తేనే అన్ని వర్గాలు, అన్ని తరాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. తరగతి గది సజీవమైంది.

ర్క