డైలీ సీరియల్

ఎవరు ఏది చూస్తున్నారో...--5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాకృతమూలం
మాలారీ ఏ వేల్లహల బహుమూలావలో అణస అహ్ణో
అలి అంపి భమఇ కుసుమగ్ఘ పుచ్ఛిరో పంసులజుఅణో!!
సంస్కృత ఛాయ
మాలాకార్యాః సుందర బాహుమూలావలోకన సతృష్ణః
అలీకమపి భ్రమతి కుసుమార్ఘప్రశ్న శీలఃపాంసులయువా!
తెలుగు
తే.గీ వనారంభ సంరంభయైన, రంభ
బోలు కులుకు తళుకుల పూబోడియొకతె
పూవులమ్ముచుండ జనులు మూగినారు
కొనుట కొరకొ ఆమె సొగసు కనుటకొరకొ!
(మూలగాథలోని విషయాన్ని కొద్దిగా నేటి నాగరికతకు అనుగుణంగా మార్చటం జరిగింది)
దారినపోయే బాటసారికి ఒక దృశ్యం కంటబడింది. అందమైన అమ్మాయి ఒకతె పూవులమ్ముకొంటోంది. చుట్టూ ఎందరో పురుషులు మూగి ఉన్నారు. వీరంతా ‘పూలు కొనటనికా! లేక ఆమెను చూడటానికా!’ అని ఆ బాటసారి అనుకొంటున్నట్టు చమత్కరిస్తున్నాడు గాథాకారుడు.
సాధారణంగా యువత అంతా బాహ్యాండం బరాలకు, బాహ్య సౌందర్యాలకు మక్కువ ఎక్కువ చూపిస్తారు. అంతేకాదు వారిలో స్థితప్రజ్ఞత్వం రాదు. అనుభవాలు అంతగా ఉండవు. దానితో పైకి కనిపించేదంతా బంగారం అనుకొంటారు. కళ్లు వేనినైనా చూస్తాయ. చూసేవి చెప్పవు. చెప్పగలిగిన పెదవులు లేక నోరు చూడలేదు.
కనుక ఆ పూబాల వచ్చిందంటే ఆబాల గోపాలమూ చూడడానికి వచ్చిందే.
కాని ఆ వచ్చి చూసిన వారిలో ఎవరు ఏమి చూస్తున్నారో ఎవరికైనా ఎలా తెలుస్తుంది?
కేవలం వారి వారి మనసులకే ఈ విషయం తెలుస్తుంది. గాథాకారుడు చెప్పకుండానే ఒక విషయం ఇక్కడ చెబుతున్నాడు.
ఈ జగత్తు అంతా మిథ్య. జగన్నాథుడే నిక్కం. కాని జగత్తు భ్రమింపచేస్తుంది. ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణలో పడితే ప్రకృతిలో కనిపించే వైవిధ్యాన్ని చూస్తూ చూస్తూ పరవశించి పోతే చాలా? కాదు ఆ పరవశానికి కారణమైన పరమేశ్వరుని గుర్తించాలి కదా. పూవులున్నాయ. పూలలోని పరిమళాన్నిం దించే శక్తినిచ్చిన భగవంతుని గూర్చి తెలుసుకోండి, కేవలం పూలమ్మినో పూవుల సౌందర్యాన్నో మాత్రమే అవలోకించకండి.
మనసు పెట్టి చూస్తే పూవులల్లోని ఆకర్షక శక్తి రంగు కన్నా వాసనకే అధికం. వాసనా శక్తి ఎక్కువ కనుక జన్మలు వస్తూనే ఉన్నాయ. కనుక వాసనారహితుడైన పరమాత్మ గురించి తెలుసుకోండి అంటున్నాడు గాధాకారుడు.

-- ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ narayana d7@gmail.com