Others

ఐదొందలు పూర్తి చేశాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాన్య మానవుడి జీవితం ఎక్కడ చూసినా దుర్భరంగానే వుంది. అసలు విషయం వదిలి కొసరు విషయాల మీద ‘వాగ్యుద్ధం’ ఎక్కువై పోయింది. ఎల్.ఒ.సి. దగ్గర టెన్షన్ల సంగతి ఏమో గానీ, రాజకీయ పార్టీల మధ్య భయంకరమైన కక్షలూ, కావేషాలు పెరిగిపోతున్న దశలో సగటు మనిషి కంటినిండా నిద్రపోలేకపోతున్నాడు. పోనీ, ‘సినిమాలు చూద్దామా?’ అంటే బయోపిక్చర్ల సంకుల సమరం సాగుతోంది.
ఎండలు ముదురుతున్నాయి. దోమలు రెడీ అవుతున్నాయి. వాటికి ఎల్.ఒ.సి.లు లేవు కనుక పరిధులు, పరిమితులు వుండవు. అట్టి తరి- ‘‘మస్తకాన్ని అరచేతనున్న స్మార్ట్ఫోన్ కడుపులో పెట్టు మాతరో’’, అన్నాడో తెలివైన మిడిల్ క్లాస్ పెద్దమనిషి. ప్రతీవాడూ అసలు సంగతి గాలికి వదిలేసి- సభ్యతా సంస్కారాలను గాల్లోకి ఎగరేసి పారేసి- సంయమనాన్ని కోల్పోయి కొన్నిచోట్ల వొంటిమీద తెలివికూడా తప్పిపోయి- ‘బాహాబాహీ’కి దిగిపోతున్న తరుణంలో ఆస్ట్రేలియా క్రికెట్ టీము ఇండియా టూర్‌కి వచ్చింది. ప్రపంచ కప్ పోటీలకు ముందు మనవాళ్లకిదే చివరి ‘వన్‌డే’. ‘స్పర్థ’కి అవకాశం దొరికింది. హైదరాబాద్‌తోనే ఈ ఏక దివసీయ అంతర్జాతీయ క్రికెట్ పోరాటం మొదలవడంతో తెలుగు ప్రేక్షకులు- ‘‘అమ్మయ్య! వేరే దారి దొరికింది. ఐ.పి.ఎల్. ‘‘వార్’’ మొదలవుతుందిగా అంటూ క్రికెట్ మీదికి దృష్టి మళ్లించుకున్నారు.
‘‘శ్రీరెడ్డి కొత్త పోస్టింగ్‌లు చూశావా?’’ అనడిగాడు ఓ యువకుడు. ‘‘డామిట్’’ అన్నాడు రెండోవాడు. ‘‘దిక్కుమాలిన ‘వోయరిజం’- అదొదిలి పెట్టేద్దాం బ్రదర్’’ అంటూ ‘‘చూయింగ్ గమ్’’ని నోట్లోనుంచి ఎక్కలాగి ప్రక్కవాడి స్కూటర్ ‘రిమ్ము’కి అంటించాడు అతగాడు.
‘‘మనవాళ్లు ఐదొందలు ‘నాట్‌ఔట్’ చూడవో..’’ అన్నది ఓ టీనేజ్ కాలేజీ గాళ్. ఎండలు ముదురుతూ వుండటంతో- బిగుతైన జీన్ ప్యాంట్‌లో చిరాకుగా అటూయిటూ కదులుతోంది ఓ వామాక్షి. ఆమె బి.ఎఫ్. అనగా బోయ్‌ఫ్రెండ్ సోనీ నవ్వేశాడు. ‘‘మా కోహ్లీ నలభయ్యో శతకం బాదేశాడు. చూశావా?’’ అన్నాడు సగర్వంగా. అట్లాగా కుర్రాళ్లూ, కుర్రమ్మలే కాదు ముసలమ్మలు, ముసలాళ్లూ కూడా టీవీ తెరకి అంకితం అయిపోయారు.
ఇది ఇండియాకి అయిదు వందలో మహా విజయం అంటూ ‘దేథ్థాలీ’ అంటూ సెలిబ్రేట్ చేసుకుంటున్న జనాలు కాస్సేపు ప్రతిపక్షాల మీద, ‘మోదీ- షా’ల జమిలి పోరాటం సంగతిని ప్రక్కన బెట్టారు. ‘డేటాలీకు’ మీద కలహాల కల్లోల సాగరానికి ఎడంగా కదిలారు. ‘‘కోహ్లీ, థోనీల జంటమధ్య కుదురుతున్న సమన్వయం స్నేహం లాంటిది ఏ యిద్దరు రాజకీయ నాయకుల మధ్యనైనా కుదురుతుందా?’’ అనడిగాడు ఓ టి.డి.పి. శాల్తీ మరొక టి.ఆర్.ఎస్. శాల్తీని- సారీ! ‘‘్ఫర్ ద టయిమ్ బీయింగ్ మనిద్దరిమధ్యా మాత్రం సయోధ్య కుదర్దు బ్రదర్! నేను పార్టీ భక్తుణ్ణి,’’ అన్నాడు యివతలివాడు. ‘‘పోనీ సమోసా తింటావా?’’ అడిగాడు అవతలి శాల్తీ. ఇద్దరూ సమోసాలు తిని చాయ్ తాగారు. టీవీ తెర మీదికి దృష్టి మళ్లించారు.
కాస్త ఫ్లాష్‌బ్యాక్ చూద్దాం. 1974, జులై 13న మనవాళ్లు వన్ డే ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్పర్థలో బంతీ, బ్యాటూ పట్టారు. అప్పటి నుంచీ క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య దినదిన ప్రవర్థమానం అవుతూనే వుంది. మొత్తం 963 మ్యాచ్‌లు- దేశదేశాల ‘పిచ్’ల మీద ఆడారు. జనాలు పిచ్చిపిచ్చిగా తిలకిస్తూ వస్తున్నారు. జెనరేషన్స్ మారినా రుూ క్రేజ్ మాత్రం తగ్గలేదు. మనవాళ్లు మొత్తం నాలుగు వందల పధ్నాలుగు సార్లు అపజయ భారాన్ని నెత్తిన మోశారు. కానీ, మొన్నటి నాగపూర్ విజయంతో- ఐదొందలు నాట్‌ఔట్ విజయోత్సవాలు చేసుకున్నారు. ధోనీభాయ్ రుూ మ్యాచ్‌లో ‘డక్’కొట్టాడు. అదో ‘పారడాక్స్’. అయినా ప్రేక్షకులు ‘్ధనీ...్ధనీ’’.. అంటూ ఛాంటింగ్ మానలేదు.
శతకం బాదేసిన విరాట్ కోహ్లీ కూడా ధోనీ భాయ్ వేపే చివరిదాకా, ఆశగా చూశాడు. ఔను! అతను బ్యాట్‌తో ఫెయిలయితే- కూల్‌గా ఓ ‘ఇస్మయిల్’ (చిర్నవ్వు) విసిరేసి- స్టంపింగ్స్‌లో విజృంభిస్తాడు. మనవాళ్లు అతణ్ని ‘‘లివింగ్ లెజెండ్’’గా భావిస్తారు. ఎందుకంటే 28 సంవత్సరాల తర్వాత అతని అపురూపమయిన చల్లని నాయకత్వంలోనే- ఇండియా తన రెండో వరల్డ్‌కప్‌ను జేగీయమానంగా ఇంటికి ఎత్తుకొచ్చింది.
మనవాళ్లతో యిప్పుడు దీటుగా పోటీపడుతున్న ఆస్ట్రేలియా వన్ డేలలో 558 ఘన విజయాలతో ‘టాప్’లో వున్నది. ఆ దేశం గెలుపుశాతం 63.20కాగా- ఇండియా విజయగర్వం 54.66 శాతంగా వుంది. అందుకనే రుూ రెండు దేశాల మధ్యా పోటీ- ప్రపంచవ్యాప్తంగా జనరంజకం. చిత్రమేమిటంటే- మూడో స్థానంలో ‘‘పాక్’’వుంది. (ఏం? కలుక్కుమన్నదా, నొప్పి?) ‘‘పూను స్పర్థను విద్యలందే వైరమును ‘స్పోర్ట్స్’లోనే’’ అన్నారు భాయ్!
ఇండియా తొమ్మిది వన్ డే మ్యాచ్‌లను ‘టై’అనగా- అటూయిటూ కాకుండా- చేయగలిగింది. అందుకనే మొన్నటి నాగపూర్ పోటీలో రెండు దేశాలూ సమఉజ్జీలు అయిన వస్తాదుల్లాగ- ఆచి తూచి ఆడుతూ, చివరిదాకా ఉత్కంఠని పోషించారు. ‘‘సచిన్ దేవుడు రిటైర్ అయ్యాడు. మరో దేశం వాడు ఆ కొండ శిఖరం చేరుకుంటాడు’ అన్న ‘‘వర్రీ’’ లేదు. ఉంటే, సచిన్ పేరూ లేదా విరాట్ కోహ్లీ వారసత్వాన ప్రపంచ పరుగుల శిఖరం రాయబడుతుంది’’- అంటున్నారు క్రికెట్ పండిట్స్. ధోనీ మూడు ఫార్మేట్లలోనూ ‘విక్టరీ కప్’ని తెచ్చి దేశ ప్రతిష్ఠకి వజ్ర కిరీటం పెట్టి- పదివేల పరుగుల వీరుడిగా యింకా రాణించడం క్రికెట్ ప్రపంచానికే ఒక వేడుకగా వుండటం విశేషమే! ‘‘చల్తే రహో ధోనీ!’’ నీ సిక్సర్ల రికార్డుని పదిలం చేసుకో’’ అంటున్నారు అభిమానులు, శత్రువులూ (వుంటే) కూడా.
క్యాప్టెన్‌గానే తొమ్మిది వేల పరుగులు చేసిన - పదివేల పరుగుల విరాట్- క్యారెట్‌లు, బీట్‌రూట్లూ మాత్రం పచ్చిగా తింటూనే రుూ ‘టాప్ స్పీడ్’ కొనసాగిస్తున్నాడని యువకులు గ్రహించాలి. ‘ఒక రోజు’ ఇన్నింగ్స్‌లో 300 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన ‘టీమ్’గా కూడా మనవాళ్లకి రికార్డు వుంది. 101 సార్లు రుూ ఘనత సాధించారు. తంబి విజయశంకర్ నక్కని త్రొక్కి వచ్చాడు. చివరి ఓవర్‌లో రెండుసార్లు ప్రత్యర్థి వికెట్లను చెల్లాచెదురుచేసి మొనగాడైనాడు. ఈ టీమ్‌కిక- ఢోకాలేదు భాయియో... బహెనో....
లెటజ్ హోప్ టూ గెట్ ద వరల్డ్ కప్!