Others

ఉగ్రవాదం.. భిన్నకోణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్యసాధనకు సాయుధ పోరాటం చేయడాన్ని ‘ఉగ్రవాదం’ అని స్థూ లంగా నైఘంటుక నిర్వచనం. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ ఉంది. దాదాపు రెండువేల సంవత్సరాల సుదీర్ఘ అవమానాల తర్వాత ఈ రాజ్యం ఏర్పడింది. దీనిని కబళించడానికి పధ్నాలుగు అరబ్బు రాజ్యాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హమాస్- పాలస్తీనా విమోచనా సంస్థలు చేస్తున్న రాకెటు దాడులను ఉగ్రవాదం అంటారు. వీరి నుండి ఆత్మరక్షణ కోసం ఇజ్రాయిల్ జరిపిన విమాన దాడులు ఉగ్రవాదం కిందికి రాదు. ఈ ధర్మసూక్ష్మాన్ని గుర్తించాలి. ఉగ్రవాదం అనే సంస్కృత పదాన్ని టెర్రరిజం అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా వాడుతున్నారు. ఇస్లామిక్ టెర్రరిజం ఇటీవలి దశాబ్దాలలో ఎక్కువ కావటంతో ఈ పదానికి బాగా ప్రాచుర్యం లభించింది.
అమెరికాలోని ఎంపైర్ ఎస్టేట్స్ (105 అంతస్తుల) భవనాన్ని 2002లో ఒసామా బిన్ లాడెన్ కూల్చటం, పుల్వామా (కాశ్మీర్)లో 45 మంది భద్రతాసిబ్బందిని జైషే మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజర్ అనుయాయులు ఆత్మాహుతి దాడిలో హత్యచేయడం, చత్తీస్‌గఢ్‌లో మన సైనికులను చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చటం, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీని తమిళ నేత వేలుపిళ్లై ప్రభాకరన్ అనుచరులు హతమార్చటం వంటి సంఘటనలు ఉగ్రవాదానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇస్లామిక్ ఫండమెంటలిజం, మార్క్సిస్టు మూర్ఖత్వం ప్రధాన ఉగ్రవాద మూలాలు. వేలుపిళ్లై ప్రభాకరన్ ద్రవిడోగ్రవాదానికి సంకేతం. తమిళనాడును, శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంతో కలిపి తమిళ ఈలం (ప్రత్యేక తమిళ దేశం) నిర్మించాలనే పోరాటం నూరేండ్లుగా జరుగుతున్నది. ద్రవిడ కజగం (డికె), ద్రవిడ మునే్నత్ర కజగం(డిఎంకె) పార్టీలు ఇలా పుట్టిన ఉగ్రవాద సంస్థలే. తమిళనాడులోని కంచి (కాంచీపురం) నుండి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారిని తరిమివేయటం ఉగ్రవాద చర్య. కావేరీ తీరంలో సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్న బ్రాహ్మణుల జంధ్యాలు కత్తిరించిన డి.కె. కార్యకర్తలది ఉగ్రవాద చర్య. శ్రీరామ నవమి నాడు రాముడి విగ్రహానికి చెప్పుల దండలు వేసి ఊరేగించటం ఉగ్రవాద చర్య. ఈ పనులు చేసింది ద్రవిడోగ్రవాదులు.
కాంగ్రెస్ నాయకుడు మణిశంకర అయ్యర్, సినీనటుడు కమల్ హాసన్, జయలలిత సన్నిహితురాలు వి.కె.శశికళ, ఆమె భర్త-వీరంతా ద్రవిడోగ్రవాదులు. రామస్వామి నాయకర్, కరుణానిధి, స్టాలిన్ వంటివారిని ద్రవిడోగ్రవాదులుగా కొందరు అభివర్ణిస్తుంటారు. ఇటీవల న్యూఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘హిందువులు పవిత్రంగా భావించే స్వస్తిక్ చిహ్నాన్ని చీపురుపెట్టి చిమ్మివేయండి’ అన్నాడు. ‘చీపురు’ ఆమ్‌ఆద్మీ పార్టీ ఎన్నికల చిహ్నం. కేజ్రీవాల్ ప్రతాపం వాగ్రూపమైన ఉగ్రవాదం (వెర్బల్ టెర్రరిజం). ‘ఆంధ్రోడిని బొందపెట్టండి’ అని కొందరు ‘దొర’లు ప్రవచించటం వెర్బల్ టెర్రరిజం కిందకే వస్తుంది. ‘హిందువులంతా ఉగ్రవాదులు’ అని కాంగ్రెస్ నాయకులు సుశీల్‌కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ అనడం వాగ్రూప ఉగ్రవాదం. ‘అడ్డం వచ్చినవారిని అడ్డంగా నరుకుతా..’ అని రాములమ్మ అనటం వాగ్రూప ఉగ్రవాదం. ‘నాకు ఎవరు ఎదురువచ్చినా వారిని బూడిద చేస్తాను’ (చూర్ చూర్ కరూంగీ) అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించడం వాగ్రూప ఉగ్రవాదం. 1984లో 6000 మంది అమాయక సిక్కులను రాజీవ్‌గాంధీ అనుజ్ఞతో జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్, కమలనాథ్ వంటి కాంగ్రెస్ నాయకులు సజీవ దహనం చేయించడం ‘ఉగ్రవాద చర్య’ అనాలి. ‘హిందువులను ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పుపాతర వేయండి’- అని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం నేత పినరయి విజయన్ బహిరంగంగా తన కార్యకర్తలకు సూచించడం వాగ్రూప ఉగ్రవాదం. ‘హిందూ మతానికి చెందిన జి.సత్యవాణిని హైదరాబాద్‌లో తిరగనివ్వం... భాజపా అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావును ఆంధ్రప్రదేశ్‌లో తిరగనివ్వం’ అనటం ఉగ్రవాదం. ఇవి మనకు తెలిసిన ఉగ్రవాద రూపాలు.
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ఆంక్షలు విధించాడు. అంతటితో ఊరుకోలేదు. ఇరాన్ నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తే ఖబడ్దార్ అని బెదిరించటం అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదం కిందికి వస్తుంది. బ్రిటన్, చైనా, అమెరికాలు నేడు ఆర్థిక ఉగ్రవాద దేశాలు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీలు మతోగ్రవాద దేశాలు. ఇండియా ఉగ్రవాద దేశమైతే షారుఖ్ ఖాన్‌లు, సల్మాన్ ఖుర్షీద్‌లు, అసదుద్దీన్ ఒవైసీలు, అజం ఖాన్‌లు సుఖ జీవనం చేయగలిగే వారేనా? హిందువులు పుట్టుకతోనే పిరికివారు- అని మహాత్మా గాంధీ చెప్పిన మాట నిజం. రాజకీయ లబ్ధికోసం ఈవేళ దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నాయకులు ‘హిందూ ఉగ్రవాదం’ (సాఫ్రన్ టెర్రర్) అనే పదాన్ని సృష్టించారు. ఇలా అంటే మూకుమ్మడిగా దేశంలోని ఇరవై కోట్ల మంది ముస్లిములు తమకు ఓటువేస్తారని వారి ఆశ!
2004లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని హత్యచేయడానికి బిహార్ నుండి కొందరు కాంగ్రెస్ నేతలు హంతకులను పంపడం ఉగ్రవాద చర్య. ఎన్నికల ప్రచార సమయంలో రోడ్‌షోల్లో నరేంద్ర మోదీ, ఎం.వెంకయ్యనాయుడు, మనోహర్ పారీకర్, సుషమా స్వరాజ్, దేవేంద్ర ఫడ్నవీస్‌లను హత్యచేయండంటూ రోనా విల్సన్ (పూణె) వద్ద లభించిన లేఖల్లో చైనా ఉగ్రవాదులు ఆదేశించటం టెర్రరిజానికి నిర్వచనం. హిందువులు ముఖాన పెట్టేకునే బొట్టు రక్తంలాగా ఉందని గతంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి విమర్శించాడు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి వద్ద అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా ఉంది. ఐసిస్, తాలిబన్, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల పేర్లు, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీం వంటి కిరాతకుల పేర్లూ ఆ జాబితాలో ఉన్నాయి. అందులో జిన్‌పింగ్, గడాఫీ, మావో సేటుంగ్, చెగువేరా, హిట్లర్, స్టాలిన్, కాస్ట్రో వంటి ప్రముఖుల పేర్లు ఉన్నట్లు లేదు. మధ్యయుగాల్లో ఛెంగిజ్‌ఖాన్, గజినీ, ఘోరీ, బాబర్, అక్బర్, ఔరంగజేబు, అల్లాఉద్దీన్ ఖిల్జీ, నాదిర్షాలు ఇస్లామిక్ ఫండమెంటలిజానికి ఉదాహరణలు.
సారాంశమేమంటే ఇస్లామిక్ ఉగ్రవాదం, ఎవాంజలికల్ క్రూసేడర్స్ ఉగ్రవాదం, మార్క్సిస్టు ఎకనమిక్ టెర్రరిజం, ట్రిలిడియన్ రీజనల్ టెర్రరిజం, లింగ్విస్టిక్ టెర్రరిజం, హిట్లర్ రేసిజం.. ఇలా భిన్నరూపాల్లో ఉగ్రవాదం అగ్రవాదంగా మారి మానవాళిని మసిచేస్తున్నది. ‘లక్ష్యసాధన’ కోసం రాయలసీమలో వేటకొడవళ్లను వాడటం, ఉత్తరప్రదేశ్‌లో యాదవులు దళితులను హింసించటం వంటివి ఉగ్రవాద లక్షణాలే. రెండు దశాబ్దాలుగా తెలుగులో బూతు సినిమాలు తీయటం కూడా సెక్యులర్ టెర్రరిజం కిందికే వస్తుంది. యువతను పెడతోవ పట్టించేలా సినిమాలు తీసేవారిపై ఎలాంటి కేసులు ఉండవు. అభం శుభం ఎరుగని చిన్నారులపై అత్యాచారం చేసిన హాజీపూర్ (బొమ్మల రామారం) ‘బోరుబావి’ ఫేం శ్రీనివాసరెడ్డి లైంగిక ఉగ్రవాది. ఇలాంటి వారికి నిర్భయ చట్టాలు వర్తించవు!
***
2017లో హైదరాబాదులో ఫిలింనగర్‌లో ‘డ్రగ్స్’ వినియోగానికి సంబంధించి ఎక్సయిజ్ శాఖ నమోదు చేసిన కేసులు సంచలనాన్ని సృష్టించాయి. ప్రముఖ చలనచిత్ర నటులు, నటీమణులు, దర్శకులు, పారిశ్రామికవేత్తల పిల్లలు ఇందులో నిందితులుగా ఉన్నారు. అప్పటి ఎక్సయిజ్ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఈ కేసులను ఉదయం నుండి అర్ధరాత్రి పనె్నండు గంటల వరకు విచారించిన దృశ్యాలు టీవీ చానళ్లు పోటీపడి ప్రసారం చేశాయి. గత నెల 14వ తేదీన ఈ కేసులకు సంబంధించి ఒక వార్త వెలువడింది. సమాచార హక్కు చట్టం కింద ఒకాయన డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను కోరాడు. 2017లో ఎక్సయిజ్ అధికారులు విచారించిన ప్రముఖ వ్యక్తుల పేర్లు నివేదిక నుండి తొలగించారన్న కథనాలు వచ్చాయి. ముంబయికి చెందిన సినీనటులు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి ప్రముఖులపై కేసులు నీరుకారిపోయాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఈ దేశంలో అందరికీ వర్తించదు. జమ్మూ కశ్మీరుకు వేరే రాజ్యాంగం ఉంది. పారిశ్రామికవేత్తలకు, చలనచిత్ర ప్రముఖులకు, డ్రగ్స్ మాఫియాకు రాజ్యాంగం వర్తించదా? బలగం కలిగిన రాజకీయ వేత్తలు ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉందని గుర్తించటం లేదు. రోడ్డుపక్క ఒకామె లైసెన్సు లేకుండా ఆకుకూరలు అమ్ముకుంటున్నది. ఆమెను పోలీసులు పట్టుకొనిపోయి కోర్టులో హాజరుపరచగా వంద రూపాయల జరిమానా వేశారు. మరి లక్షల కోట్ల రూపాయలను సెల్లార్లలో దాచుకున్న నేతలు కీలక పదవులను పొందుతారు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్