Others

తగిన గుర్తింపునిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అంతర్జాతీయ కస్టమ్స్ డే..
*
‘ఇండియన్ కస్టమ్స్..’
భారతదేశ కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలో పనిచేసే శాఖలలో కస్టమ్స్ (సీమా పన్ను), సెంట్రల్ ఎక్సైజ్ (దేశీయ ఉత్పాదనలపై పన్ను), జీయస్‌టీ(వస్తువులు, సేవలపై పన్ను) వ్యవహారాలు చూసే ఒక శాఖ ఉన్నది.
కస్టమ్స్ అంటే భారతదేశంలోకి సరిహద్దు దాటి వచ్చే ప్రతి వస్తువుపైనా నిఘా ఉంచవలసిన బాధ్యతకల శాఖ. కేవలం సీమా శుల్క్ (పన్ను) వసూలు చేయటమే కాదు, దానికన్నా ముఖ్యమైన దేశ భద్రత ఈ శాఖ ఉద్యోగులపై ఉన్నది. సైనికులు, బోర్డర్ ఫోర్స్‌లు విదేశీ ఆక్రమణల నుంచి, సరిహద్దు దాటి వచ్చే ఇతర దేశీయ వ్యక్తుల నుంచి సరిహద్దును ఎలా కాపాడతారో, కస్టమ్స్‌వారు సరిహద్దు దాటి దేశ భద్రతకు నష్టం వాటిల్లే ప్రతి పదార్థాన్ని గమనించి, అవి ఆర్థికంగా, భౌతికంగా దేశానికి ముప్పు కలిగించకుండా చూస్తూ వారివంతు దేశసేవ వారు చేస్తున్నారు.
ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇట్టి వ్యవస్థ ఉంటుంది.
వీరు వీరి బాధ్యతలు సక్రమంగా నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను అమలు పరుస్తుంది. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, జీయస్‌టీలే కాకుండా కొన్ని ఉప చట్టాలు కూడా వీరి పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు మాదక ద్రవ్యాలు, మేధావి వర్గ హక్కులు (ఐపీఆర్), అటవీ జంతు సంరక్షణ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మానవ వికాస రంగంలోనూ, ప్రతి దేశ సంరక్షణ(ఆర్థికంగా, భౌతికంగా) లోనూ భారత్ కస్టమ్స్ వారి పాత్ర ఉండి తీరుతుంది.
వీరు ఎంత సమర్థవంతంగా, సామరూకత, సహృద్భావంతో వారి విధులను నిర్వర్తిస్తుంటే, దేశ ప్రగతి అంత త్వరగా జరుగుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య క్షేత్రంలో దీనికి ఒక ఉదాహరణ, భారతదేశంతో వాణిజ్యం చేయటం తేలిక అన్న గణాంకాలలో ఇటీవల మన దేశం పధ్నాలుగు స్థానాలు పైకి ఎగసింది. అలాగే సరిహద్దుల ద్వారా జరిగే వాణిజ్యంలో పనె్నండు స్థానాలు పైకి ఎగసింది. ఇది మెరుగుపడుతున్న వీరి సేవల వలననే అని చెప్పక తప్పదు.
దీనికోసం ఐటీ రంగంలోని పెక్కు ఉపయుక్తాలను వీరు అమలుచేస్తూ, చట్టపరిధిలో లావాదేవీలను సులభతరం చేస్తున్నారు. ఈ శాఖ వ్యవహారాలను చూసే సింగిల్ విండో ఇంటర్పేస్ ఫర్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్ (స్విఫ్ట్.. అంటే ఒకే మార్గం ద్వారా వ్యాపార వాణిజ్య లావాదేవీల సాధనం ప్రవేశపెట్టి) ఇరవై నాలుగు గంటలూ, ఏడు రోజులూ పనిచేస్తూ సౌకర్యాలు కలిగించటం. వీటికన్నా ముఖ్యం మునుపు తొమ్మిది వివిధ రకాల దస్తావేజులు (డాక్యుమెంట్స్) ఇవ్వవలసి ఉంటే నేడు ఒకే దానితో సరిపెట్టటం, వీటిని కూడా ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా సమర్పించి అసలు కాగిత అవసరం తొలగించటం లాంటివి. రోజురోజుకూ నవీన పథకాలను మొదలుపెడుతూ నేటి ప్రభుత్వం, ఈ శాఖ వారితో ప్రజల వ్యవహాలను తేలిక చేస్తున్నారు.
ఇక.. మన హైదరాబాద్ కస్టమ్స్ వారి గురించి.. గత నలభై సంవత్సరాల్లో గణనీయమైన కస్టమ్స్ పోర్టుగా పేరుగాంచింది హైదరాబాద్ కస్టమ్స్. సాధారణ ప్రజలకు, ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుండి వెళ్లే అంతర్జాతీయ విమానాల పెరిగిన సంఖ్యతో ప్రయాణాలు సులువుగా ఉన్నాయి నేడు. దీనిలోనూ కస్టమ్స్ వారి పాత్ర ఉంది. ఒక విమానం భూమి మీద దిగిన క్షణం నుంచి అది తిరిగి గాలిలోకి ఎగిరే దాకా నిఘా అవసరం. ఏమి సరుకులు వస్తున్నాయి? ఏమి వెళుతున్నాయి? అని తెలుసుకోవాలి. దొంగ చాటుగా రాకుండా నిరోధించాలి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యంలో ఉన్న వారికి, లేక హైదరాబాద్‌లోని పరిశ్రమల వారికి జరుగుతున్న సులువు గురించి తెలుసు.
నేడు హైదరాబాద్ పోర్టు, అనేక ఇతర సదుపాయాలతో ఉంది. జంతువులు, మొక్కలక్వారంటైన్, ఔషధ, రసాయనిక పదార్థాల నియంత్రణ విభాగం, కోల్డ్ స్టోరేజీ, టెక్స్‌టైల్ కమిటీ, ఆహార పదార్థాల తనిఖీ, ఇలా వివిధ సదుపాయాలను స్థానీయంగా కలిపిస్తు మన ఏర్‌పోర్టు ఇంకా పెద్దది చేస్తున్నారు. నూతన కట్టడాలతో, అప్పుడు ఇంకా మెరుగు అవుతాయి స్థానీయంగా లభించే సదుపాయాలు.
మన హైదరాబాద్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులలో రసాయనిక పదార్థాలు, నగలు, కూరగాయలు, పండ్లు, కొన్ని యంత్రాలు ముఖ్యంగా ఉండగా, దిగుమతులలో రసాయన పదార్థాలు, యంత్రాలు బ్రహ్మోస్ మిస్సైల్ పార్టులు కొన్ని ఎలక్ట్రానిక్ భాగాలు ముఖ్యమైనవి.
హైదరాబాద్ కస్టమ్స్‌వారు, గత సంవత్సరంలో గడించిన ఆదాయం రూ. 4051 కోట్లు.
వీరు పట్టుకున్న దొంగ (స్మగుల్డ్) బంగారం 58 కిలోలు, దాని విలువ 23.53 కోట్లు, పన్ను 9.06 కోట్లు.
నేడు హైదరాబాద్‌కు ప్రతిరోజూ... అంతర్జాతీయ విమానాల రాకపోకడ ఉంది.
ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి కస్టమ్స్‌డే అని జరుపుకుంటారు ప్రతి 26 జనవరినాడు. అయితే ప్రతి దేశానికి వారికి వీలు అయిన రోజున స్థానికంగా వేరే రోజున జరుపుకునే సదుపాయం ఉండి, మన దేశంవారు 27, జనవరినాడు జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కస్టమ్స్ వారు తమ నినాదం ‘ప్రజల, భూగృహ సంక్షేమం, అభివృద్ధిలను కొనసాగించటం కోసం తోడ్పడటం.’
ఫాస్టరింగ్ సస్టెనబిలిటీ ఆఫ్ పీపుల్స్ ప్రాస్పెరిటీ, అండ్ ది ప్లానెట్. మరి మన తరఫునుంచి వీరి సేవలను గుర్తించి వీరికి మనం తగిన గౌరవం ఇస్తే, వీరిని ఇంకా ఎక్కువ సేవలు అందించటానికి మనం ప్రోత్సహించినవారం అవుతాము. అదీ మనకోసమే సుమా ఎటు తిరిగీ..

- నండూరి రామచంద్రరావు 99491 88444