Others

రైతులే భాగస్వాములుగా మారాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా అటు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో, ఇటు వెనుకబడిన దేశాల్లో అత్యధిక జనాభాకు చేయూతనిస్తున్న రంగం వ్యవసాయ రంగం. ఈ విధంగా భారతదేశంలో 49 శాతం మీద ఆధారపడిన అతి పెద్ద పరిశ్రమగా వ్యవసాయ రంగం రాణిస్తున్నది. అన్నిరకాల పారిశ్రామిక ఉత్పత్తులకు వ్యవసాయ ఉత్పత్తులే మూల కారణమైనందున ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి, ఈ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న కోట్లాది మంది రైతులను, వ్యవసాయ శ్రామికులను, కార్మికులను ఆదుకోవడానికి ఈమధ్య కాలంలో ఆయా దేశాల ప్రభుత్వాలు, భారతదేశంనందలి రాష్ట్రాల ప్రభుత్వాలు రకరకాల ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఏయేటికాయేడు కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి. అయినా.. అంతర్జాతీయ స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ప్రతియేటా పెరుగుతూనే వున్నాయి. ఈమధ్య జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్.సి.ఆర్.డి.) వెల్లడించిన వివరాల ప్రకారం 1995 నుంచి 2016 వరకు భారతదేశంలో 3,30,407 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారంటే పరిస్థితులు ప్రతి సంవత్సరం ఏవిధంగా దిగజారుతూ వస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు. తాజా గణాంకాల ప్రకారం ఒక 2016లోనే 11,379 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2017, 2018, 2019 సంవత్సరాలనందు కూడా అనధికారికంగా ఈ సంఖ్య కొంతమేర పెరుగుతూ పోతున్నదేనని ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని తెలుస్తున్నది. యేడాదిన్నర కిందట కేంద్ర ప్రభుత్వ పెద్దలు 2022 నాటికి భారత రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. తాజా భారత బడ్జెట్‌లో కూడా ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. అయితే.. ప్రైవేట్ నల్లవ్యాపారులు అందరూ ఒక సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమ కొరతను సృష్టిస్తూ, ఇతరత్రా మోసాలకు పాల్పడుతుండడం వల్ల రైతులకు వ్యాపారులకు మధ్య అనాది నుంచి వస్తున్న దళారీ వ్యవస్థ వ్రేళ్లూనుకున్నందున రైతులకు గిట్టుబాటు ధర లభించక, పండించిన పంటలకు తగిన మార్కెట్ లేక ప్రతిసారీ కుదేలవుతున్నారు. ఇదే సంవత్సరంలో రైతుల నుంచి కొంటున్న వ్యాపారులు మాత్రం కోటీశ్వరులుగా మారుతున్నారు. రైతులలో రోజురోజుకూ నిరాశ - నిస్పృహలు ఏర్పడుతున్నందున ఉత్పత్తుల మీద శ్రద్ధకూడా రోజురోజుకూ తగ్గుతున్నది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత భయంకర రూపం దాల్చే ప్రమాదం పొంచి వుంది. అందుకే.. రైతుల ఉత్పత్తులను రైతులే అమ్ముకునే విధంగా, వారినే వ్యాపార భాగస్వాములుగా తీర్చిదిద్దేవిధంగా కొత్త చట్టాలు, నూతన నిబంధనలు, ఆధునిక సాంకేతిక మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురావాలసి వుంది. ఇందుకు సహకార సేద్యాన్ని ప్రోత్సహించాలి. సహకార మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధిచేయాలి. సహకార మార్కెటింగ్ వ్యవస్థలో రైతులను, వ్యాపారులను భాగస్వాములను చేయడమే కాకుండా ప్రభుత్వంకూడా తన వంతుగా భాగస్వామిగా చేరితే పారదర్శకత ఏర్పడుతుంది. ఇందుకు నష్టాలు రావడానికి ఏమాత్రం అవకాశం వుండదు.
నూతన మార్కెటింగ్ విధానంలో భాగంగా నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (నాబ్‌కాన్స్) ఈరోజు ఉదయం గం. 11:30 ని.లకు ఆంధ్రప్రదేశ్ నందలి అన్ని జిల్లాల కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ ఛైర్మన్లు, మేనేజర్లతో గుంటూరు జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ బోర్డ్‌మీటింగ్ హాల్‌నందు సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పటికే శ్రీకాకుళం డి.సి.ఎమ్.ఎస్., మరియు ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్‌కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంయుక్తంగా ఒక అంగీకారానికి వచ్చి ఆ జిల్లానందలి ఇచ్ఛాపురం నియోజకవర్గం (ఉద్ధాన ప్రాంతం)నందలి ఏడు మండలాల కొబ్బరి, జీడి, పనస, మామిడి రైతులను ఆదుకోవడానికి అక్కడి ఉత్పత్తులను నాఫెడ్ ద్వారా జాతీయస్థాయిలో మార్కెటింగ్ చేయడానికి అదే స్థాయిలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయడానికి ఓ ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా రైతులకు స్కిల్స్ డెవలప్‌మెంట్ నందు ట్రైనింగ్ ఇస్తూ.. ఎక్కడికక్కడ కోల్డ్‌స్టోరేజ్‌లు, గొడౌన్లు నిర్మిస్తూ... ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తూ ముందుకెళ్లాలని భావించారు. అమెరికాలో ఈమధ్యకాలంలో తల్లిపాలు సేవించే పిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్‌వస్తున్న నేపథ్యంలో కొబ్బరి పాలకు డిమాండ్ పెరిగినందున ఆ స్థాయిలో ఇక్కడి కొబ్బరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ప్రణాళిక తయారుచేస్తున్నారు. ఇలాగే... పనస విత్తనాలను వైన్స్‌నందు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నందున ఆ స్థాయిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఇచ్ఛాపురం ప్రాంతం సముద్ర తీరంలో వున్నందున అక్కడి ఇసుక భూముల్లో పండే మామిడిపండ్లు ఎక్కువ తీపితో కూడిన రుచిగా వుంటున్నాయి. మట్టి భూముల్లో పండే మామిడి పండ్లకు ఆ రుచి, అంతటి తీపి వుండవు. ఆ ప్రాంతానికి తగ్గట్టుగా పండే ఉత్పత్తులను వీటికి ఏయే రాష్ట్రాలలో, దేశాలలో డిమాండ్ వుంటుందో గుర్తిస్తూ ఆ స్థాయి మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను విస్తృతపరుచుకొని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలనందు అవినీతిని నిర్మూలించి నేరుగా రైతులకు చేరేటట్లు అధికార యంత్రాంగంలో కూడా మార్పులు తీసుకురావలసి వుంది. మారుతున్న కాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, భౌతిక పరిస్థతులకు అనుగుణంగా పంటలను పండిస్తూ, ఇదేవిధంగా పంట మార్పిడి వ్యవస్థను అమలుచేస్తూ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ, సేంద్రీయ వ్యవసాయాన్ని, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగవలసి వుంది. ఇదే సందర్భంలో అధిక దిగుబడులకు, రాబడులకు సంబంధించిన విత్తనాలను, వంగడాలను తయారుచేయడానికి కూడా సాంకేతిక వ్యవస్థను భారీస్థాయిలో ఏర్పాటుచేయవలసి వుంది. వ్యవసాయ రంగం నందలి డిప్లమో కోర్సులకు, డిగ్రీలకు, పీహెచ్‌డీలకు పెద్దపీట వేసి ఇందులో చదివే యువతీయువకులకు ఉద్యోగ భద్రత, ఉపాధి హామీ వంటి భరోసా కల్పించడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. ఇలా.. రైతులను ప్రభుత్వ సహకారంతో వ్యాపార భాగస్వాములుగా తీర్చిదిద్దినప్పుడే ఇటు రైతు భారతం, అటు రైతు అంతర్జాతీయ సహకార వ్యవస్థ ఏర్పడుతుంది. ఐక్యరాజ్యసమితి సైతం ప్రపంచవ్యాప్తంగా సహకార సేద్యానికి పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నందున రైతులే స్వచ్ఛందంగా చైతన్యవంతులై కార్పొరేట్ వ్యవసాయానికి స్వస్తిచెబుతూ.. కో-ఆపరేటివ్ వ్యవసాయ ఉద్యమంలో లీనం కావలసి వుంది.

- తిప్పినేని రామదాసప్పనాయుడు