Others

జర్నలిజంలో ఒక నిజం నిష్క్రమించింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతీ నిజాయితీ కలిగిన వాళ్లను, నిజమైన జర్నలిస్టులుగా, జనం తమ సంస్కారవంతుల లిస్టులో పొందుపరచుకుంటారు. అటువంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన సంస్కారవంతులు పొత్తూరి వేంకటేశ్వరరావుగారు, మన మధ్య నుంచి నిష్క్రమించడం, అత్యంత విచారకరం. జనాభా లెక్కల కోసం ఎందరో పుడుతుంటారు, పోతుంటారు. కానీ జీవితాంతం గుర్తుంచుకోవలసిన, గురుతుల్యులైన వ్యక్తులు కొందరే వుంటారు. భక్తి జ్ఞాన వైరాగ్యములతో, జీవితాంతం పొత్తు పెట్టుకొన్న, ప్రజాదరణ పొందిన, ప్రముఖ పత్రికా సంపాదకులు పొత్తూరి వారు.
నేను చెన్నైలో ఆంధ్రప్రభలో పని చేస్తున్నప్పుడు, ఒక విషయమై ఉత్తరం వ్రాస్తే, దానికి వెంటనే స్పందించి ఎంతో గౌరవప్రదమైన ప్రత్యుత్తరం వ్రాశారు. హైదరాబాద్ వచ్చిన తరువాత నేను ప్రచురించిన నా కథా సుధ ‘నవ్వు - నవ్వించు’ చదివి, విశే్లషిస్తూ, ‘నేను పనిచేస్తున్నప్పుడు మీ కథలు నా దృష్టికి వచ్చి ఉంటే తప్పక ప్రచురించి వుండేవాణ్ణి’ అంటూ ఓ ఇన్‌లాండ్ లెటర్ వ్రాశారు. ఇటువంటివన్ని తలుచుకుంటుంటే, ఆయన లేని లోటు ఏ ఆత్మీయుడూ తీర్చలేడేమోననిపించింది.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నా షణ్ముఖుడ్ని మనసారా ప్రార్థిస్తున్నా! పొత్తూరి వారి కుటుంబ సభ్యులందరకూ, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా!

-షణ్ముఖశ్రీ, 8897853339