Others

‘కొవ్వు’తో ప్రపంచం విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నవ నాగరిక యుగంలో ఆహారోత్పత్తులు, వైద్యసేవలు ఎంత పెరిగినా అంతే స్థాయిలో రోగాలు కూడా మానవాళిని చుట్టుముడుతున్నాయి. ఇపుడు విశ్వవ్యాప్తంగా ‘కొవ్వు’ కారణంగా వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 76 శాతం మంది (5.5 బిలియన్ల మంది) కొవ్వు వల్ల దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. మానవాళి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులకు ఇదొక ప్రమాద ఘంటిక అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో అధికశాతంలో కొవ్వు పేరుకుపోవడంతో ఊబకాయంతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులు విజృంభిస్తున్నాయి. కొవ్వు పేరుకుపోవడంతో జీవక్రియకు విఘాతం కలుగుతోంది.
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల జరిపిన అధ్యయనంలో పలు ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. శరీరంలో అవసరానికి మించి కొవ్వు ఉన్నందున అనేక దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొనక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. సాధారణ బరువు ఉన్న వారితో పోల్చి చూస్తే కొవ్వు పేరుకున్న వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. జీవక్రియకు అవరోధాలు ఏర్పడడమే ఇందుకు కారణమని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. అధిక కొవ్వు కారణంగా పొట్ట పెరగడమే కాదు, మిగతా శరీరాకృతిలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొవ్వు కారణంగా ఊబకాయులైన వారు శారీరక శ్రమకు, క్రీడలకు దూరమైపోతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పుల వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతోంది. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ఊబకాయం సమస్య ప్రపంచ దేశాలన్నింటిలోనూ అనూహ్యంగా పెరుగుతోంది. వ్యాయామం, ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించడం ఇందుకు కారణాలని నిపుణులు విశే్లషిస్తున్నారు.
మితిమీరి తినడమే కాదు, అందుకు తగ్గట్టు శారీరక శ్రమ లేకపోవడం కొవ్వు పేరుకుపోవడానికి హేతువులని అంటున్నారు. తీసుకునే ఆహారం పట్ల కూడా చాలామందికి ఎలాంటి అవగాహన ఉండడం లేదు. కొవ్వును పెంచే ఆహారానికి దూరంగా ఉండలేకపోతున్నారు. నూనెలు, నెయ్యి, తీపి పదార్థాలను మితిమీరి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే శరీరానికి తగ్గ బరువు ఉన్నవారి సంఖ్య 9 నుంచి 10 శాతం మాత్రమే. వయసు, ఆదాయం, ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిలో ఈ సమస్య నానాటికీ అధికమవుతోంది. శరీర బరువు సూచీ (బిఎంఐ)కి విరుద్ధంగా కొవ్వు పెరగడాన్ని నివారించకపోతే ఆరోగ్యపరంగా మరిన్ని విపరిణామాలు తప్పవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
*