ప్రత్యేక పాటలో ఖైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101వ చిత్రం విదేశాల్లో జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో ఖైరాదత్ నటిస్తుందట. కింగ్‌ఫిషర్ మాడల్‌గా మంచి పాపులర్ అయిన ఈమె, గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంలో ‘బూచోడే బూచోడే’ అంటూ సాగే పాటలో నర్తించి ఆకట్టుకుంది. మళ్లీ ఇన్ని రోజుల తరువాత పూరి తను ప్రత్యేకంగా రూపొందించే ఐటెం సాంగ్‌కోసం ఈమెను ఎంచుకున్నాడట. కింగ్‌ఫిషర్ మాడల్‌గా హాట్ హాట్ అందాలతో కుర్రకారును పిచ్చెక్కించిన ఖైరా మరి ఈ సినిమాతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!