అంతర్జాతీయం

పాఠశాలలో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒటావా, జనవరి 23: కెనడా పశ్చిమ ప్రాంతంలోని ఒక పాఠశాల ఆదివారం కాల్పుల మోతతో దద్ధరిల్లింది. ఆగంతకుడు జరిపిన ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. కెనడాలో ఇటువంటి కాల్పులు జరగడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ దారుణంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ త్రుదెయు అన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్న త్రుదెయు అక్కడ విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సస్కాచెవన్ ప్రావిన్సు (రాష్ట్రం)లోని మారుమూల ప్రాంతమైన లా లోచేలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. అయితే ఆ తర్వాత ఆర్‌సిఎంపి (రాయల్ కెనడియన్ వౌంటెడ్ పోలీసు) అధికార ప్రతినిధి మృతుల సంఖ్యను సవరించి ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. జనంపై ఒక వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందడంతో ఆగంతకుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆర్‌సిఎంపి సూపరింటెండెంట్ వౌరీన్ లెవీ విలేఖర్లకు తెలిపారు.