అంతర్జాతీయం

పాక్‌ను ఉగ్రదేశంగాc అమెరికాలో బిల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్‌టన్: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా పాక్‌ను పేర్కొంటూ అమెరికాలోని ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లిక్ పార్టీకి చెందిన టెడ్ పో, ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీ సభ్యుడైన డెమోక్రాట్ డానా రోహ్రబచర్ సంయుక్తంగా- హెచ్ ఆర్ 6069 అనే బిల్లును సభ ముందుకు తెచ్చారు. బిన్ లాడెన్ వంటి ప్రమాదకార టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం ఉగ్రవాదనికి పాకిస్థాన్ కొమ్ముకాస్తోందనడానికి నిదర్శమని టెడ్ పో అన్నారు. పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, అమెరికాకు మిత్ర దేశంగా ఉంటూ శత్రు దేశాలకు సహాయం చేస్తోందని ఉగ్రవాదంపై హౌస్ సబ్ కమిటీ సభ్యుడైన టెడ్ అన్నారు. ఉరీ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్న వారిని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రతి చర్యకు మద్దతిస్తానని మరో కాంగ్రెస్ సభ్యుడు పీట్ ఓల్సన్ అన్నారు.