అదిలాబాద్

పొంగిపొర్లుతున్న పాతాళగంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 27: మండలలోని భీమారం ఐటిడిఏ నర్సరీలో తవ్విన గొట్టపుబావి నుంచి గత 30 సంవత్సరాలుగా భూగర్భ జలం దానంతట అదే ఉబికి వస్తోంది. నర్సరీ ఏర్పాటు చేసిన సమయంలో రెండు గొట్టపు బావులను నిర్మించారు. దాదాపు 700 అడుగుల లోతు ఈ బావులను త్వటంతో అప్పటి నుంచి నిరంతరాయంగా ఎలాంటి మోటారు అవసరం లేకుండానే నీరు ఉబికి వస్తోంది. ఈ గొట్టపు బావుల నుంచి వచ్చిన నీటి తోతోనే 17 ఎకరాల్లోని మామిడి మొక్కలకు నీరందిస్తున్నారు. వర్షాభావం ఉన్నప్పటికి భూగర్భ జలాలు తగ్గిపోయినప్పటికి వీటి నుంచి మాత్రం నీరు నిరంతరాయంగా అన్ని కాలాల్లో ఉబికి వస్తోంది. ఈ నీరు స్వఛ్చంగా ఉండటంతో గ్రామంలోని చాలా మంది ఈ నీటిని తాగేందుకు తీసుకుపోతున్నారు.