ప్రార్థన

స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తు మనతో స్నేహం చేయటానికి ఇష్టపడుచున్నాడు. సర్వసృష్టికర్త సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుండు మనతో స్నేహము చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో స్నేహం మరణ బంధకాల నుండి మరణ భయము నుండి విడుదల కలుగజేస్తుంది. మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు యేసుక్రీస్తు.
తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు. నేను మీకాజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. - యోహాను 15:13-14.
దేవాది దేవునికి మనతో స్నేహము చేయుటకు ఇష్టమే కానీ ఒక షరతు. ఆయన చెప్పిన పని చేయాలి. ప్రాణమియ్యమనటము లేదు. ఆయనే జీవాధిపతి. ఆస్తి అడగటము లేదు. బంగారము అడగటంలేదు. సర్వం ఆయన మాటతో కలిగినవే. అయితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనను క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. - యోహాను 15:34. యేసు ప్రభువు మనలను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాడు. కాబట్టే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎంతో కష్టమైనా బాధయైనా ఓర్చుకొని ఇష్టంగా ప్రాణాలర్పించాడు. నిజముగా ఏ పనియైనా ఇష్టముగా చేస్తుంటే కష్టమనిపించదు. ప్రేమ లేకుండా ఇష్టము లేకుండా చిన్న పని కూడా విసుకుగా కష్టంగా, బాధగా ఉంటుంది. దీనినిబట్టి యేసయ్యకు నీవు నేను అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది కదా - ఇష్టమొచ్చిన వారు ఏది చేసినా చెల్లుతుందని.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. - యోహాను 3:16. ఈ వాక్యములో దేవుని ప్రేమ ఎంత అపారమైందో ఎంత ఎతె్తైనదో ఎంత లోతైనదో ఎంత విలువ గలదో అర్థవౌతుంది. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు తన్నుతాను తగ్గించుకొని, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసికొని దుమ్ము ధూళి వంటివారమైన మన కొరకు మన రూపములోనే, మానవ రూపములో నివసించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ముందు మనము దుమ్ము ధూళి వంటి వారమే. చంద్రయాన్ పంపిన ఫొటోలలో భూమి ఒక చిన్న బంతిలా ఉంది. భూమికి చాలా దగ్గరగా ఉన్న చంద్రమండలము నుండి చూస్తేనే భూమి చిన్నదిగా కనిపిస్తే మరి ఎన్నో నక్షత్రాలు మిలియన్ల కాంతి సంవత్సరాల దూరములో ఉంటున్నాము అంటే అక్కడ నుండి చూస్తే మన భూమి కూడా చిన్న నలుసులాగానే కనపడవచ్చు. కనబడకపోవచ్చు. అందుకే దేవుడు మనిషిని వీచి వెళ్లి తిరిగిరాని గాలి వంటి వారముగా పోల్చాడు. అయినా ఆయనకు మనమంటే ఇష్టం. మనమంటే ప్రేమ. మన స్నేహం కోరుకుంటున్నాడు. అందుకే కీర్తనకారుడు దావీదు మహారాజు వ్రాస్తూ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నదని తెలిపాడు. ఇంత ఉన్నతుడు. పరిశుద్ధుడు. అయినా దేవుడు మనలను ప్రేమించి మనతో ఉండుటకు మనతో స్నేహము చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఎందుకింత ప్రేమ ఎందుకింత దయ మనపైన అంటే ప్రేమామయుడు. ఆయన ప్రేమాస్వరూపి. గనుక మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ఇష్టపడి చేయబడ్డవారము. ఆయన రూపులో చేయబడ్డాము. ఇంతగా ప్రేమించి స్నేహము చేసేది మనల్ని బొమ్మలలాగా ఆడుకోవటానికి కానేకాదు. కొన్నికొన్ని సందర్భాలలో దేవుని ప్రేమ అర్థముకాక, ఆయన ప్రణాళిక అర్థముకాక, ఇష్టమొచ్చినట్లు ఆలోచించుకొని మనుషులను బొమ్మలలాగ ఆడుకుంటున్నాడు దేవుడు అని తెలిసీ తెలియని మాటలు ఆడుకొంటున్నారు. ఎన్నోసార్లు తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకోలేని పిల్లలు కూడా అంతే ఆలోచిస్తారు. చివరకు గాని తెలియదు. వారు ఎందుకు అలా చేశారో? ఇప్పుడు ప్రభువు కూడా దేవుని స్వరూపము గలవాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. The Son of God became a man to enable man to become Sons of God - C.S.Leaxs.

యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చింది తీర్పు తీర్చటానికి కాదు. తప్పులు ఎత్తిచూపటానికి కాదు గానీ మన పాపాలను ఆయన రక్తములో కడిగి, మనలను తిరిగి ఆయన రూపులోనికి మార్చుకోవటానికి. ఆయన పరిశుద్ధుడు గనుక మనలను పరిశుద్ధులుగా చేయటానికి. ఆయన ఉన్న చోటుకు మనలను తీసుకువెళ్లటానికి. దహించు అగ్ని అయిన ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతల చేతను భక్తులచేతను కొనియాడబడుచున్న ఆయన ఉండు స్థలమునకు మార్గము మనకు తెలియదు గనుక ఆయనే మార్గమై వచ్చాడు. ఈ రక్షణ ప్రణాళిక అర్థము కాని ఆనాటి యూదా మత పెద్దలు అధికారులు ఆయనను సిలువ వేసి, జీవాధిపతిని చంపారు. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అందుకు ఆదిమ అపొస్తలులు సాక్షులు. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నామని యోహాను భక్తుడు వ్రాశాడు. ఆదిమ అపొస్తలులు యేసు ప్రభువు మాటలు విన్నారు. ఆయన అద్భుత కార్యాలు చూశారు. ఆయన శ్రమ పడటము చూశారు. ఆయనను సిలువ వేయటాన్ని చూశారు. చనిపోవటం, సమాధిలో ఉంచటం, మూడవ దినమున తిరిగి లేవటం చూచి ఆ సంగతులే పరిశుద్ధ గ్రంథములో వ్రాశారు.
ఆయన పునరుత్థానుడై నలువది దినముల వరకు వారికగపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము అని యోహాను భక్తుడు తాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో తెలియజేశాడు. 5-7 వచనములలో తెలియజేసిన మాటలు - దేవుడు వెలుగై యున్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడ సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులునుగా చేయును.
యేసుక్రీస్తుతో సహవాసము గలవారితో తండ్రియైన దేవునితో కూడ సహవాసముంటుంది. దానికి గుర్తు మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండుట. మన సహోదరులతో ప్రేమగా ఉండుట. మనము మన సహోదరులను ప్రేమిస్తున్నామంటే వెలుగులో ఉన్నట్లే. ఇంకా సహోదరుల మీద ద్వేషముందంటే చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నట్లే, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును గనుక ఎక్కడికి పోవుచున్నాడో ఏ గుంటలో పడుచున్నాడో తెలియదు. ద్వేషము మనలో ఉంటే ప్రభువుతో సహవాసము తెగిపోతుంది గనుక వెలుగు మనలో నుండి వెళ్లిపోయి అంతా చీకటిమయవౌతుంది. చీకటి మరణమే. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మనకు ప్రభువు కొండ మీద ప్రసంగములో తెలియజేశాడు. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. - మత్తయి 5:22.
మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవము లోనికి దాటియున్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు. ప్రేమామయుడైన యేసులో సహవాసముంటే జీవములో ఉన్నట్లే. నిత్య జీవమునకు నడిపించటానికి ప్రభువు మనతో సహవాసము చేయాలనుకుంటున్నాడు.
ఈ లోకములో అనేకులు ఏదో ఒక మేలు పొందుట కొరకే ఇతరులతో స్నేహం చేస్తారు కానీ ప్రభువైతే మన మేలు కోసం, మనల్ని నిత్య నరకము నుండి తప్పించటానికి, దేవుని రాజ్య వారసులుగా చేయటానికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధి జీవనాన్ని ఇవ్వటానికి మనలను కాపాడటానికి, భద్రపరచటానికి, ఎటువంటి కొదువ లేకుండా ఉండటానికి పచ్చిక బయలులో నడిపించటానికి శాంతి జలముల యొద్ద ఉంచటానికి గాఢాంధకారపు లోయల్లో నడిచేటప్పుడు ధైర్యపరచటానికి ఉన్నత శిఖరాలెక్కించటానికి మనతో సహవాసము చేయటానికి ఇష్టపడుచున్నాడు. కేవలము, మన మేలు కోసమే ప్రభువు మనతో సహవాసము చేయాలనుకుంటున్నాడు. మన నుండి ఎటువంటి మేలు ఆశించడు. అసలు ఆశించటానికి మన దగ్గర ఏముందని, ఉత్త గడ్డి పువ్వులాంటి వారమే గదా! ఆవిరి వంటి వారమే గదా! నిన్న మాట్లాడిన వారు ఈ రోజు ఉండటము లేదు, ఈ రోజు ఉన్నవారు రేపు ఏవౌతారో తెలియదు. అటువంటి అల్పమైన జీవితముతో ప్రభువుకు ఏమి చేయగలము. ఏమివ్వగలము. ఆయన మాట విని ఆయనతో స్నేహము చేయుట తప్ప.
నిజానికి ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమే. ప్రాణమిచ్చి మనలను కాపాడి నిత్య జీవాన్నిచ్చే దేవునితో స్నేహము చేయటము లేదు కానీ, ఈ లోకముతో స్నేహము చేయటానికి పరుగెత్తుతున్నారు, ఈ లోకము మనలను నష్టాలలోనికి కష్టాలలోనికి నెట్టివేస్తుంది, ఇది ప్రాణాంతకముగా ఉంది. ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా లెక్క చేయటం లేదు. సిగరెట్లు తాగవద్దంటే కోపపడుచున్నాడు. వాస్తవానికి సిగరెట్ల వల్ల తంబాకు వల్ల ఎన్ని కుటుంబాలు అనాధలుగా మారాయో చూస్తున్నాము. నోటి కేన్సర్ వల్ల వారు ఎంత బాధ అనుభవిస్తున్నారో చూస్తున్నాము. అయినా వాటితోనే స్నేహం ఎందుకండీ? మనము కూడా వారి లాంటి వారమే. ఈ రోజు కాకపోతే రేపు మనకు ఆ వ్యాధి రావచ్చు. మానేస్తే పోలే. అలానే వ్యభిచరించవద్దు. దాని ద్వారా ఎయిడ్స్ లాంటి ప్రాణాంతకమైన రోగం వస్తుంది, అంటే ఆ రోగము వచ్చేవరకు వాటితో స్నేహం చేస్తుంటారు. ఒకసారి రోగం వచ్చిన తరువాత ఎంత బాధపడినా ఉపయోగమేముంది? ప్రాణాలు కోల్పోవటం, కుటుంబం వీధిన పడటం తప్ప. ప్రాణాలు తీసే లోకముతో స్నేహానికి పరుగులు తీస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రాణాలు పోసే యేసయ్య స్నేహం కష్టముగా చిరాకుగా ఉంది. ప్రాణాలు తీసేటువంటి వార్తలు చెవులకు ఇంపుగా ఉంటున్నాయి. ప్రాణాలు పోసే సువార్త చాలా కష్టంగా ఉంటుంది.
జాగ్రత్త! 25000 వోల్ట్‌ల విద్యుత్ ఉందని వ్రాసి ఉంటే ఎలా ఉంటుందో అని వేలు పెడతారా? పెట్టరు కదా? అయితే చూద్దామనుకుంటే, ప్రాణం పోతుంది. వడిగా ప్రవహించే నీటి కాలువ ప్రక్కన జాగ్రత్తగా వెళ్లండి అంటే పట్టించుకోకుండా ఆడుతూ పాడుతూ నడుస్తుంటే, సెల్‌ఫోన్ చూస్తూ నడుస్తుంటే జారిపడతారు. ప్రాణాలు పోతాయి. క్షణంలో అంతా జరిగిపోతుంది. ఆ తరువాత చేసేది ఏమీ లేదు. ఈ లోక స్నేహం దేవునితో వైరమే గనుక మొదలుకే మోసం. టీవీలలో స్నేహం, సెల్‌ఫోన్స్‌తో స్నేహం సమయమంతా వృధా అయిపోతుంది. డబ్బుతో స్నేహం ఎక్కువైంది.
The Bible teaches that we are to love people and use money. But we often got that reversed and start loving money, and using people to get more money. Money is simply a tool tobe used for good.

ఢబ్బుతో స్నేహం, లోకముతో స్నేహం, మనలను తల్లిదండ్రులకు ఆప్తులకు దూరము చేస్తుంది. అయితే అదే డబ్బు అంతా అయిపోతే స్నేహితులు మాయమై పోతారు. లోకము లెక్కచేయదు. పట్టించుకోదు.
When you have money in hand only you forget who you are, but when you do not have any money in your hand the whole world forget who you are. its life - Bill Gates.

లోకము మరచిపోయినా బంధువులు వెలివేసినా, కష్టాలలో కన్నీళ్లలో మనలను ధైర్యపరచి ఆదరించేది యేసు ప్రభుని స్నేహం. నిజమైనది విడువనిది యేసు స్నేహము. లోకమంత వెలివేసినా తండ్రిలా అక్కున చేర్చుకొనేది యేసుని స్నేహము. యేసుతో స్నేహం ఆత్మబలాన్ని పెంచుతుంది. దేవుని రూపులోనికి మార్చుతుంది. దేవుని చూసే భాగ్యము ఇస్తుంది యేసుతో స్నేహం.
నిశ్చలమైన మనస్సు శోధన జయించే బలము ఇచ్చి జయ జీవితమును రుచి చూయించి విజయముపైన కాంక్ష పెంచేది. పరులను ప్రేమించే గుణమిచ్చేది. ప్రకృతిపై అధికారమిచ్చేది. కుటుంబ కలతల నంతము చేసి గృహమును స్వర్గముగా మార్చేది యేసు స్నేహము. ఈ లోక స్నేహం మన కష్ట సమయములో విడిచిపోవచ్చు గానీ యేసు స్నేహం మాత్రం మనలను విడువదు ఎడబాయదు.
What a friend we have in Jesus All our sins and griefs to bear! What a privilege to carry everything to God in Prayer!
Oh What peace we often forfeit Oh what needless pain we bear All because we do not carry everything to God in Prayer.
Have we trials and temptations? is there trouble any where? We should never be discouraged take it to the Lord in Prayer. Can we find a friend so faithful who will all our sorrows share? Jesus knows our every weakness take it to the Lord in prayer.
Are we weak and heavy laden, combered with a load of care?
Precious Saviour, still our refuge take it to the Lord in Prayer. To thou friends despise, farsake thee? Take it to the Lord in Prayer in his arms will take and shield thee thou will find a solace there. -Joseph M.Seriven (1855)

ముఖ్యముగా యవ్వనస్థులు స్నేహాన్ని ఎక్కువగా కోరుకుంటారు గనుక, యవ్వన ప్రాయములోనే దేవుని స్నేహాన్ని కోరుకుంటే ఎంతో మేలు. యవ్వన బలము వృథా కాదు. జారులతో సాంగత్యము, దుర్జనులతో సహవాసము కోపచిత్తునితో సహవాసము చేయవద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. చిన్న ఆఫీసర్‌గానీ, పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు గానీ రాజకీయ నాయకులు మన ఫ్రెండ్స్‌కి తెలిసినా, మనము కూడా ఎలాగైనా ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలని ఆశపడతాము. అటువంటిది దేవాది దేవుడు రాజుల రాజు ప్రభువుల ప్రభువు నీతో స్నేహానికి సిద్ధము, అయితే ఒక్క షరతు. ‘నేను మీకాజ్ఞాపించినవి చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు’. ఇక్కడ ఇంకొక ప్రామిస్ కూడా ఉంది. ఆయన మాటలు మనము వింటే మన మాటలు కూడా ఆయన వింటానంటున్నాడు. మీకేది ఇష్టమో అడగండి. అది మీకు అనుగ్రహించబడునని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆ ప్రభువుతో స్నేహము చేస్తూ నిత్య రాజ్యానికి వారసులమవ్వటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256