ప్రార్థన

శోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యేసు-నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.
శోధనలు శ్రమలు గురించి ఆలోచిస్తే యేసు ఎలాంటివాడో, సాతానుడు ఎలాంటివాడో మనకు అర్థమవుతోంది. అంతేకాదు, ఈ శోధనలు రాక తప్పవు గనుక వాటిని ఎలా ఎదిరించాలో కూడా మనకు తెలుస్తుంది. మనకు కనపడునటువంటిది దేవుని రాజ్యము. సాతాను రాజ్యము మధ్య మనము ఉన్నాము. వాస్తవానికి ఈ లోకాన్ని సృష్టించి దానిలో ఉంచి దానిని ఏలుమని మానవునికి ఇచ్చిన అధికారము సాతానుడు మోసముతో పాపములు నింపివేసాడు. మానవుని మోసపరచి అధికారము చెలాయిస్తే దేవునికి మానవునికి శత్రుత్వాన్ని, ద్వేషాన్ని పెంచిన సాతానును అణగదొక్కటానికే యేసు ప్రభువు నరావతారిగా వచ్చి సాతానును జయించి, వాడి మోసాలను కుయుక్తులను జయించి, మోసముతో మానవాళికి ప్రాప్తించిన మరణము యొక్క ముల్లును విరిచాడు. దేవునికి స్తోత్రము. వాస్తవానికి సాతానుడు మానవుని మోసగించి ఒక చీకటి తెరను లోకానికప్పాడు. ఈ చీకటి ముసుగులో ఏమి చేస్తున్నామో, ఎటువెళ్తున్నామో, ఏమి చూస్తున్నామో అంతా అయోమయంగా వున్న రోజుల్లో వాక్యమైయున్న దేవుడు శరీర ధారియై తన వెలుగుతో ప్రతి మనిషిని వెలిగించి మంచి మార్గాన్ని చూయించాడు.
నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
వాస్తవానికి చీకటి వెలుగులమధ్య, మంచి చెడులమధ్య జరిగే యుద్ధమే శోధన లేక శ్రమ. అయితే చీకటి తెరను చీల్చుకుంటూ వచ్చిన దేవుని వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగించి చీకటిని పటాపంచలు చేస్తూ ఉన్నాడు. దానికి తీయుదము దేవుని వాక్యమె. వాక్య ఖడ్గముచేతనే చీకటి ముసుగును చీల్చగలము. ఎందుకంటే సాతాను వేసే చీకటి ముసుగు గట్టిదే. యేసు ప్రభువునే మూసివేయాలని వాడు ప్రయత్నాలన్నీ చేసాడు.
వాడి యుక్తాలన్ని వాడాడు. దేవుని శోధించలేడు కాని మానవ రూపములో మనలను కాపాడటానికి వచ్చిన యేసు ప్రభువును శోధించాలని ప్రయత్నము చేసాడు.
మొదటిది శరీర సంబంధమైనది. యేసు ప్రభువు పరిచర్యకు ముందు నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసము చేసి, ఆకలిగా ఉన్నప్పుడు, అప్పుడు సాతానుడు, శోధకుడు, ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అసలు సంగతి- ఆయనే ప్రభువే జీవాహారము. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచువాడే ఎప్పుడు నా దప్పిగొనడు.
ఇజ్రాంకులీయుల అరణ్య యాత్రలో కొన్ని లక్షల మందికి పరలోకమునుండి మన్నన కురిపించిన దేవుని శోధిస్తూ, సాతానుడు నలువది దినములు ఉపవాసమున్న, ప్రభువునా ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. నీవు దేవుని కుమారుడవే అయితే రాళ్ళను రొట్టెలుగా చేసి తిను అని పెద్ద సవాలు విసిరాడు.
మామూలు మనిషికి అటువంటి సవాలు వస్తే, దానికి రియాక్షన్ వేరుగా వుంటుంది. మనకు తెలిసిందే. నీవు మగాడివైతే అది చెయ్యి ఇది చెయ్యి అని రెచ్చగొడితే, శోధనకు గురై నష్టాల పాలైన వారెందరో, కొంతమంది కష్టాల పాలయ్యారు. చివరకు ప్రాణాలు పొగొట్టుకున్నవారెందరో. మట్టిని మనిషిగా చేసిన దేవునికి రాళ్ళను రొట్టెలుగా చేయటం అంత పెద్ద పని కాదు, కానీ దేవుని ఆజ్ఞ లేకుండా, తండ్రి ప్రమేయము లేకుండా ఏదీ చేయకూడదు గనుక అలా చేయకుండా మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడియున్నవనెను. మతయి 4:4
దేవుని నోటనుండి వచ్చె మాట మనలను తృప్తిపరస్తుంది, బ్రతికిస్తుంది. కాని సాతాను మాటవలన పాపము, చివరకు మరణమో. సాతాను ఎంత రెచ్చగొడతాడో తెలుసా? ఎవరినైనా చూయించి తిట్టమంటాడు, కొట్టమంటాడు, పోట్లాట పెడతాడు. రాళ్ళు రువ్వమంటాడు. గోల చేయిస్తాడు, దొంగతనానికి ప్రేరేపిస్తాడు. వ్యభిచారము, జూదము, లంచగొండితనానికి ఉసిగొలుపుతాడు. అది తప్పేమీ కాదు అందరు చేస్తున్నారు, నీవు చేయవచ్చు, తప్పేమీ లేదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి పడిపోతారు. ఒక్కసారి పడిపోతే లేవటానికి చాలా సమయము పట్టుద్ది. ఒక్కొక్కసారి పడితే ఇక లేవలేకపోవచ్చు, జాగ్రత్త. ఇటువంటి సమయములో వాక్యం దేవుని మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని శోధన జయించాలి. వాక్యము మనకు వెలుగై మార్గము చూపిస్తూ, ఖడ్గమె సాతాను మాటను త్రిప్పికొడుతుంది. కనుకనే వాక్యము మనలో సమృద్ధిగా నివశింపజెయ్యాలి. వాక్యముతో నింపబడినవారితో సాతానుడు యుద్ధము చేయలేడు. వాక్యఖడ్గము లేనివారిని చాలా తేలికగా సాతానుడు ఓడిస్తాడు.
యేసుప్రభువు రాళ్ళను రొట్టెలుగా చేయలేక కాదు గాని సాతాను సలహాను తిరస్కరించటానికే అలా చేయలేదు, కాని అరణ్యములో వున్న గొప్ప సమూహము ఆకలిగొనగా వారి యొద్ద వున్న ఐదు రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరు తిని తృప్తిపొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండా ఎత్తిరి. స్ర్తిలు పురుషులు గాక తినినవారు నాలుగువేలమంది పురుషులు.
అలానే దేవుడు మనకిచ్చే జీతాలు గాని, పంటలు గాని వ్యాపారంలో వచ్చేవిగాని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి వాడుకుంటే, తృప్తిగా తిన్న తరువాత ఇంకా మిగిలించుకోవచ్చు. ఈ సూత్రం మన నిజ జీవితాల్లో జరిగిస్తే తృప్తి సంతోషముంటుంది. లేకుంటే కోట్ల రాబడి వున్నా తృప్తి, సంతోషాలుండవు.
ఏశావు ఒక పూట కూటికొరకు తన జేష్ఠత్వపు హక్కును అమ్మివేసి భ్రష్టుడయాడు. శాశ్వతమైన స్వాస్ద్య హక్కుల విలువను గ్రహించియు తాత్కాలిక శరీర అవసరసతను (ఆకలిని) కొంచెము కూడా ఓర్చుకోలేకపోయాడు. శరీర అవసరతకు సంబంధించి అనేక రకాలైన ఆకలులుంటాయి. అప్పుడె అదును చూసుకొని సాతానుడు మంచి మంచి అవకాశాలు కనులు ముందుంచి శోధిస్తాడు, జాగ్రత్త. ఈ శోధనలలో వేటిలో పడినా భ్రష్టులైపోతారు. శరీరేచ్ఛ చాలా ప్రమాదమైనది గనుకనే శరీర క్రియలన్నియు నాలో నశింపుచేయుమని ప్రార్థన చేసుకోవాలి. శరీరాశను జయించిన ప్రభువును జ్ఞాపముంచుకొని మనము కూడా శరీరేచ్ఛను జయించాలి.
శోధనకు మీరు చోటీయకుడి. ధైర్యము వహించి పోరాటమును సాధించెడువారు జయించెదరు. సాతానుకు ఒంగ పాపంబగును.
యేసు శక్తిని గోరి యెల్లకాలము వేడు / యేసు డాశతో మిమ్ము డాసి నడుపును2.
దుర్బుద్ధి కుభాష మానుండు, సదా పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీదేవుని పేరున్ దూషింపకయు - శ్లాఘించుచు మీరు వర్థిల్లుడలన్- 3యేసు2
జయించెడువారు సౌందర్య ప్రభన్ - చారుముకుటంబు ధరించెదరు/ ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ము- ఆయనె నిత్యంబు సాయమిచ్చును- యేసు.
అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి- నీవు దేవుని కుమారునివైతే క్రిందికి దుముకుము- ఆయన నిన్నుగూర్చి తన దూతలకాజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందరు అని వ్రాయబడియున్నవని ఆయనతో చెప్పెను- ముత్తయి 5-6
సాతానుడు కూడా దేవుని వాక్యాన్ని వాడతాడు జాగ్రత్త. అంతేకాదు దాడికి సహాయపడే మనుష్యులు కూడా దేవుని వాక్యంతో నీతి మాటలతో విశ్వాసులను పడవేయటానికి ప్రయత్నిస్తారు.
ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అసోక్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపస్తలులుగా మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
సాతాను బైబిల్ వాక్యాన్ని కోట్ చేసి ఎక్కడబడితే అక్కడ వాడతాడు. వాడికి అనుకూలంగా వాడుకొని మనలను మోసపరుస్తాడు. వాడు ఎన్ని పన్నాగాలు పన్నినా మనం గుర్తుంచుకోవలసినది ఒక్కటె. మనం ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి. అంతేగాని మన మెప్పుకోసం ఏదీ చేయకూడదు. సాతాను పెట్టిన మూడు శోధనలతో కూడా ప్రభువు తండ్రి చిత్తానికే లోబడి ఉన్నాడు గాని, తన సొంత నిర్ణయాలతో, శోధన సమయాలలో రెచ్చిపోలేదు. మనుష్యులు రెచ్చిపోవటం మొదలుపెడితే హద్దులుండవు. ఏమి చేస్తారో ఎలా చేస్తారో వారికి కూడా అర్థం కాకుండా చేస్తారు. సాతాను మాట వింటే దేవుని శోధించినవారవౌతాము.
రెండవ శోధనలో సాతాను కోట్ చేసిన వాక్యం కీర్తన: 34నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలకాజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తిపట్టుకొందురు. ఈ వాగ్దానలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారికి ఆయన చాటున ఉండేవారికి మాత్రమే. ప్రభువుకు తండ్రి మీరు, ఈ మాటమీద పూర్తి నమ్మకముంది కాని సాతాను దూకమన్నప్పుడు దూకలేడు. దేవుని మాట కోసం మరణంలోకి దూకి తిరిగి లేచాడు.
మీరు దుస్సాలో మీ దేవుడైన యెహానును శోధించినట్లు ఆయనను శోధింపకూడదు-
ద్వితీయో 6!16
దేవుని మహాత్మ్యమును శోధించనవసరము లేదు. సరైన సమయమందు చాలా శ్రేష్టమైన ప్రణాళిక ద్వారా దేవుడు కార్యము జరిగించును.
మరల అపవాది ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, రుూలోక రాజ్యములన్నింటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారుము చేసిన యెడల వీటినన్నింటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా- యేసు వానితో - సాతానా- పొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను- ముత్తయి 4:8-10
అదేంటోగాని గొప్పవారిని చూసినపుడు ధనికులను చూసినప్పుడు ఉన్నత అధికారులను చూసినపుడు, వారు ఎటువంటి వారైనా సరే వారిని గౌరవించి వారు చెప్పినట్టు చేస్తారు. గమనించాలి. ఈ లోకాన్నంతటిని సంపాదించుకున్నవారైనా తప్పుడు మార్గములో సంపాదిస్తే అది తప్పే. వారికి సాగిలపడనవసరము లేదు, జాగ్రత్త. గొప్పలాభాన్ని తప్పుడు మార్గములో పొందవచ్చునని అనేక మార్గాలు చూపిస్తాడు జాగ్రత్త. వాటికి ఆశపడి సాతానుకు లొంగిపోకూడదు. ఇక్కడ అసలు సాతాను యొక్క ముఖ్య ఉద్దేశ్యము గమనించాలి. దేవునికి చెందవలసిన మహిమను, ఆరాధనను వాడు కోరుకుంటున్నాడు. ఇటువంటి ఆలోచన కూడా మనకు పెడతాడు. అందరు నన్ను మెచ్చుకోవాలి గౌరవించాలి అన్నట్టు. జాగ్రత్త, మనము మహిమ పరచవలసింది సృష్టికర్తయైన తండ్రికి మాత్రమే. ఆయనే పూజ్యనీయుడు, ఆరాధ్యదైవము.
కష్టపడి పొందుకోవలసినవి ఊరకనే ఇస్తాను. నీవు నాకు సాగిలపడమనే సాతాను ప్రేరేపణలకు లొంగిపోగూడదు. అలా చేసి అనేకులు తప్పు మార్గాల్లో ఉన్నత స్థితికి వచ్చి, నిజము బైటపడ్డప్పుడు జైళ్లపాలయ్యరు, శిక్షింపబడ్డారు, ప్రాణాలు కోల్పోయారు.
అయితే క్రీస్తు శ్రమలు పొంది శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేని పరలోకమందును భూమి మీదను సర్వాధికారము పొందుకున్నాడు. ఆయనకే మహిమ, ఘనత ప్రభావములు కలుగును గాక. యుగములకు పూర్వము ఇప్పుడా సర్వయుగాలలో పూజార్హుడు యేసే. మనము భ్రమలో మోసములో పడి పోగొట్టుకున్న రుూ లోక అధికారాన్ని, సాతాన్ని ఓడించి మరణపు ముల్లును విరిచి తిరిగి తెచ్చిన ప్రభువుకే నందనాలు. దేవుని నమ్మిన బిడ్డలకు ఈ అధికారము ఉంది. క్రీస్తులో అందరము దేవునికి కుమారులము, కుమార్తెలము. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తయిన ప్రజలము గనుక, ఇక మనకు కావలసినదేముంది. అయితే చేయవలసినది మాత్రం ఈ స్థితి ఇచ్చిన ప్రభువును స్తుతించుట, మహిమపరచుట ఘనపరచుటయే.
సాతానుడు ప్రభువుకుపెట్టిన శోధనలు శరీర సంబంధమైనవి. తెలివికి చెందినవి, హృదయానికి చెందినవి. శరీరాశ, నేత్రాశ, జీవావుడంబము- వీటిల్లో ఎక్కడా ప్రభువు తొట్రిల్లలేదు. ఆత్మఖడ్గముతో వాక్యముతోనే జయించాడు. గమనించాలి. నాకు చాలా తెలివి వుంది. నేను సాతానును చాలా సులువుగా ఓడించగలను అనే మనస్సుతో కూడా కొందరిని సాతానుడు మభ్యపెడతాడు. దేవునికి లోబడి పరిశుద్ధాత్మాశకి కలిగే సాతానుడు ఎదురించాల్సిందే గాని సొంత ప్రయత్నము చేయనే చేయకూడదు. సాతాను యొక్క ప్రలోభాలకు లొంగిపోకూడదు. అయితే చిన్న చిన్న విషయాలు, అక్కడ పడకుంటె పెద్ద పెద్ద బహుమతులు ఎర చూయిస్తాడు జాగ్రత్త. చిన్న విషయాలలోనైనా పెద్ద విషయాలలోనైనా మోసపోకూడదు. సాతానును ఎదిరించాలి, లేకపోతే చిత్ర దృశ్యాలు ఎన్నో కళ్లముందుంచుతాడు. లొంగిపోయారంటే మునిగిపోయినట్టే. ఆకలితో తప్పులు చేయరాదు, ఉప్పొంగలేదు డంబాలకు వెళ్లలేదు మెసయ్య. సొంత ప్రయత్నాలతో ఎదురించనులేదు కాని, ఆత్మఖడ్గము చేతబట్టుకొని జయము పొందాడు. అర్థంకాని అనేక రకాల శోధనలు ఎదురైన వాక్యముకే ఆత్మఖడ్గాన్ని చేతబట్టుకొని సాతాన్ని జయించటానికి పరిశుద్ధాత్ముడే మనకు సహాయపడునుగాక. మనము కూడా అనేకులకు సహాయపడదాము.
అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారము చేసిరి
- ముత్తయి 4.11
*