ప్రార్థన

దేవుని రాజ్యాన్ని వెదకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెదకుడి.
అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును - మత్తయి 6:33.
ఉదయము లేచిన దగ్గర నుండి తిరిగి పండుకొనే వరకు ఏదో ఆరాటం, ఎక్కడెక్కడో వెతుకులాట. ఏదో తెలియని అంతులేని ఆశ వెంటాడుతూనే ఉంటుంది. వెతికి వెతికీ అలసిపోతున్నారు గానీ తృప్తి సంతోషము సమాధానము మాత్రము దొరకటము లేదు. ఈ వెతుకులాటలోనే జీవితాలు అలసి ఆరిపోతున్నాయి.
నీవు వెతికేవన్ని నీకు ఇవ్వటానికి ఏ వయసుకు తగినది ఆ వయసులో ఏ సమయానికి కావలసినది ఆ సమయములో ఇవ్వటానికి సృష్టికర్తయైన దేవుడు సిద్ధమే.
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. - మత్తయి 6:32.
ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకొందుమో, వాటిని పొందుకొనుట ఎలానో, ముందు కాలానికి దాచుకోవటం ఎలానో, ఏమి చేయాలో అని వాటి గురించి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ఏవేవో చేస్తున్నారు. ఈ వెతుకులాటలో అడ్డం వచ్చిన ఎటువంటి అడ్డమైన పనినైనా చేయటానికి సిద్ధపడుతున్నారు. సొంత వాళ్లను మోసగిస్తున్నారు. సొంత ఊరును చివరకు సొంత దేశాన్ని కూడా మోసగిస్తున్నారు. సొంత ప్రయత్నాలతో వెతుకులాట ప్రారంభించినపుడు సాతానుడు చూపే మార్గాలు సుళువుగా లాభముగా సుఖంగా కనపడుతూ ఉంటాయి. వాటిని వెతకనవసరము లేదు. కళ్ల ముందే కనపడుతూ ఉంటాయి. అదే నిజమని, వెతకబోతుంటే కాళ్లకు తగిలింది అన్నంత సాతానుడు చూయించే కొన్ని లాభకరమైన సుళువైన మార్గాల వెంట పడుతున్నారు. అసలు చీకటిలోనే ఉండి వెతుకులాట మొదలుపెడితే దొరికేది కటిక చీకటే.
లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అది లోక సంబంధమైనదే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును - 1 యోహాను 2:16,17
మనము వెతికే ఈ లోకమును దాని ఆశయు గతించిపోవునని ప్రభువు సెలవిస్తున్నాడు. గతించిపోయేటు వంటి ఈ లోకాన్ని వెదకటంతోనే జీవితం సరిపోతోంది. వెదకి వెదకి కనుగొనేసరికి చివరి దశ రానే వస్తుంది.
అసలు వాక్యము చెప్తున్న మాట చూస్తే, నీతిమంతుడు ఒక్కడును లేడు. గ్రహించు వాడెవడును లేడు. దేవుని వెదకువాడెవడును లేడు - రోమా 3:11. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరుల పరిశీలించెను - కీర్తనలు 14:2.
దేవుని వెతికేవారి కోసం భూలోకమందు దేవుడు వెతుకుచున్నాడు. అయితే ఎవరి మట్టుకు వారు లోకములోనే వెదుకులాడుచున్నారు. దేవుని వెదకేవారు కనబడుట లేదు. సర్వాన్ని సృష్టించి, పాలిస్తున్న సృష్టికర్త వైపు, ఆయన నీతి మార్గము వైపు ఎవరూ తిరుగుట లేదు. మనుష్యులలో వెదకుతున్నారు. సృష్టిలో వెదకుతున్నారు. దేవుడు లేడనే వారు కొంతమంది, దేవుని తెలుసుకున్నా గానీ లోకాన్ని వెదకుచున్న వారు కొంతమంది. వారికి వీరికి పెద్ద తేడా ఏమీ లేదు. దేవుడు ఉన్నాడని తెలిసిన వారు, ఆయన అన్నిటికి సమర్థుడని ఎరిగి, ప్రతి విషయములో ఆయన వైపే చూస్తూ ఉండాలి.
ఆదాము మొదలు ఇప్పటివరకు, నీవెక్కడ ఉన్నావని మనలను దేవుడు వెదకుతూనే ఉన్నాడు.
దేవుడైన యెహోవా ఆదామును పిలిచి-
‘నీవెక్కడ ఉన్నావ’నెను - ఆదికాండము 3:9.
అంటే దేవునికి ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలియక కాదు గానీ, తప్పు తెలిసికొని ఒప్పుకొంటాడేమో అని ఒక అవకాశము ఇచ్చాడు.
-ఇప్పుడు నీవెక్కడ ఉన్నావు, ఏమీ వెతుకుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. మనము వెతుకుతున్న దానికి విలువ ఉందా?
అయితే ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు - యేసు ఎవరోయని చూడగోరి, పొట్టివాడైనందున ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. అది గమనించిన ప్రభువు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము. నేడు నేను నీ యింట ఉండవలసి యున్నదని చెప్పెను.
ప్రభువు నశించిన వారిని వెదకి రక్షించుటకే వచ్చాడు, గనుక మోసము చేసి, అన్యాయంగా సంపాదించి ధనికుడైన జక్కయ్య అంత మోసకారియైనప్పటికీ, యేసును చూడాలని కనుగొనాలని ఇష్టపడి వెతుకుచుండగా - జక్కయ్యా త్వరగా దిగుమని చెప్పెను. ఇది చూసిన వారందరూ - ఈయన పాపియైన జక్కయ్య యొద్ద బస చేయ వెళ్లాడని సణుగుకున్నారట. అందుకు ప్రభువు వారికిచ్చిన సమాధానము చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను - లూకా 19:10.
అంతేకాదు ఎంత పాపినైన యేసు చేర్చుకుంటాడట.
ప్రజలను మోసము చేసి, అధిక పన్నులు, సుంకము వసూలు చేసి, ఇంకా ఏవేవో చేసి ధనికుడైన జక్కయ్యకు అన్నీ ఉన్నవి, కానీ దేనికో వెదుకుతూ - యేసును చూడగోరాడు. చూసిన తరువాత అర్థమైంది. తాను సంపాదించిన దానికన్నా ప్రభువు సన్నిధి ఎంత గొప్పదో. వెనువెంటనే తన తప్పు తాను తెలుసుకొని, తన ఆస్తిలో సగము బీదలకు, అన్యాయముగా ఎవరి దగ్గర నుండి తీసికొన్నాడో వారికి నాలుగింతలు తిరిగి చెల్లిస్తానని ప్రభువుతో చెప్పాడు.
అసలు సంగతేమిటంటే, ఈ లోక రాజ్యానికీ నీతి రాజ్యానికీ చాలా వ్యత్యాసము కనిపించింది. ఈ లోక పద్ధతి ప్రకారము చేస్తుంటే చాలా స్వార్థం కనపడుతోంది. అసంతృప్తి అసమాధానముగా ఉంది. కానీ దేవుని కనుగొని ఆయన నీతిని పాటిస్తుంటే, ఈ లోక ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్టలు ఇవ్వలేని సమాధానము సంతోషము ఉంది. అంతేకాదు హృదయములో ఉన్న భయ భీతులు తొలగిపోతాయి. దేవునిని పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను వెదకినప్పుడు తప్పక దొరుకుతాడు.
మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. - యిర్మియా 29:13.
అంతేకాదు, నన్ను నేను మీకు కనపరచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులలో నుండియు ఆ స్థలము లన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును అని ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్నాడు.
ప్రభువును వెదకిన వారికి రెండంతల ఆశీర్వాదము దొరుకుతుంది. ఐగుప్తులో నుండి వారు మొఱ్ఱ పెట్టినప్పుడు బానిసత్వము నుండి విడుదల చేయుటయేకాక, పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. సొలోమోను తెలివిని వివేకము గల హృదయమును అడిగినప్పుడు తెలివితోపాటు దీర్ఘాయువును ఐశ్వర్యమును ఘనతను ఇచ్చాడు. అందునుబట్టి ఆయన దినములన్నిటను రాజులలో ఎవడును అతనిలా లేకపోయెను.
కొంతమంది దేవుని వెతికి కనుగొంటున్నారు గానీ, లోకపరమైన ఆశీర్వాదాల కొరకే అన్నట్టు ఉన్నారు. ధనికుడైన వనస్థడు ప్రభువును కనుగొన్నాడు కానీ, లోకానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి గొప్ప ధనికుడు కనుక ప్రభువును వెంబడించలేక పోయాడు. బుద్ధి విజ్ఞానము సర్వ సంపదలు ప్రభువులోనే ఉన్నవని, ఆయన రాజ్యములో ఉన్నవారికి ఏ కొదువ ఉండదని గ్రహించలేక, శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని వదలుకొని అశాశ్వతమైన ధనానే్న ఎంచుకొన్నాడు. దేవుని రాజ్యాన్ని కనుగొన్నవారు ఇక ఎన్నటికి అశాశ్వతమైన రాజ్యము వైపు చూడకూడదు.
దేవుని రాజ్యాన్ని నిజముగా వెతికేవారికి అర్థమయ్యే సంగతి ఏమంటే, ప్రభువు మనలను వెతుకుతూ ఉన్నాడని. అంతేకాదు దేవుని రాజ్య విలువలు ఏంటో తెలుస్తాయి. నియమాలు ఏంటో తెలుస్తాయి. అప్పటి నుండి దేవుని రాజ్య నియమాలు పాటించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని రాజ్యములో ఆయన నియమాలు ఏంటో ముందు తెలుసుకోవాలి. మనుష్యులందరు దేవుని రాజ్య నియమాలు పాటించలేక పడిపోయి, ఈ లోక రాజ్య నియమాలకు అలవాటయ్యారు. ఈ లోక రాజ్య నియమాలు పాటిస్తూ దేవుని రాజ్య సంబంధులు అవ్వలేరు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును. లేదా యొకని పక్షముగా నుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగ ఉండనేరడు. -మత్తయి 6:24.
దేవుని రాజ్య సంబంధులు దేవుని బిడ్డలు. ఆయన నీతిని కూడా తెలుసుకోవాలి. ఆయన నీతిమంతుడు, ఆయన రాజ్యములో నీతి రాజ్యమేలుతోంది. దేవుని నీతి వేరు మానవ నీతి వేరు. ఇది సత్యము.
సృష్టికర్త మాట వినటం మనకు నీతి. హవ్వ ఆదాము ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయారు. ఒక్కసారి ఆజ్ఞాతిక్రమము జరిగి పాపములో పడిన తరువాత, ఇక ఎన్ని మంచి కార్యాలు చేసినా అవి పాపపు ఖాతాలోనే పడిపోతాయి.
మేమందరము అపవిత్రులమైతిమి మా నీతి క్రియలు అన్నియు మురికిగుడ్డల వలెనాయెను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. - యెషయా 64:6.
దేవుని వెదకి కనుగొన్న వానికి ఆయన నీతి అర్థవౌతుంది. ఆయన నీతిని పాటించటమే ఆయనను వెంబడించుట. మనకు తెలుసు. ఏ కంపెనీ నియమాలు వారికి ఉంటాయి. ఒక్కొక్కరు ఉదయం నుండి సాయంకాలము వరకు, ఇంకొకరు రాత్రి నుండి ఉదయము వరకు మనము ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ రూల్స్ పాటించాలి. అలానే దేవుని రాజ్య సంబంధులు, దేవుని మాటల ప్రకారమే నడవాలి. మన ఇష్టము వచ్చినట్లు ఎంత చేసినా అది లెక్కలోనికి రాదు. దేవుని రాజ్యములో ఉన్న నియమాలను హృదయములో భద్రము చేసుకోవాలి. నీ యింట కూర్చుండునపుడు త్రోవను నడుచునపుడు పండుకొనునపుడు లేచునపుడు వాటిని గూర్చి మాటలాడవలెను. అది నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ యింట ద్వార బంధముల మీదను గవునుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. వాటిని పాటించాలి.
ప్రభువు ఎంత నీతిమంతుడంటే - మనకు ఆయన విధించిన శిక్షను మన స్థానములో ఆయన ఉండి మనకు క్షమాపణ ఇచ్చాడు. మనుష్యులయితే వారి నియమాలను వారికి అనుగుణంగా మార్చివేస్తారు. కానీ ప్రభువు చెప్పినట్టు, ఆయన ఆజ్ఞ మీరితే చనిపోవలసినదే. కానీ మనము చనిపోవుట ఆయనకు ఇష్టము లేదు గనుక ఆయన పెట్టిన నియమమైనప్పటికీ దానిని పాటించవలసిందే గనుక మన స్థానములో ఆయన ఉండి మనలను పాప విముక్తులనుగా చేసి నిత్య నరకము నుండి తప్పించాడు. ఇదే క్రీస్తు నీతి. ఈ గొప్ప యజ్ఞమును నమ్మటమే మనకు నీతి. యేసు ప్రభువు నా పాపముల నిమిత్తము మరణించాడు. పునరుత్థానుడై తిరిగి లేచాడు అని నమ్మటమే మనకు నీతి. అబ్రహాము దేవుని నమ్మాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అంతటి నీతి కలిగిన యేసును నమ్మటమే మనకు నీతి.
యేసు నీతిమంతుడని మీరెరిగియున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి యున్నాడని యెరుగుదుము. ఆయన మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అబద్ధమాడడు. దొంగతనము చేయడు. పొరుగు వారివి ఏవీ ఆశించడు. నరహత్య చేయడు. అబద్ధ సాక్ష్యము పలుకడు. అంతేకాదు నిష్కపటమైన ప్రేమతో ఉంటాడు. చెడ్డదానిని అసహ్యించి మంచి వాటిని హత్తుకుంటాడు. అనురాగము కలిగి ఉంటాడు. ఒకని కంటె ఒకడు గొప్పగా ఎంచుకుంటారు. నమ్మకము కలిగి సంతోషంగా ఉంటారు. శ్రమలలో ఓర్పుగా, ప్రార్థనల యందు పట్టుదలతో, ఆతిథ్యమిచ్చే వారిగా, అందరినీ దీవించే వారిగా పగలు లేకుండా, మేలుతో కీడును జయించుచు, మనుష్యులందరితో సమాధానముగా ఉంటారు.
నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మనవంటి స్వభావము గలవాడే. కానీ వర్షింపకుండునట్లు అతడు ప్రార్థించగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. భూమి తన ఫలము ఇచ్చెను. అంతేకాదు కీర్తన 92వ అధ్యాయము 12వ వచనము ప్రకారము నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబనానో మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆలయములో వర్థిల్లుదురు. దేవుని యధార్థతను ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉందురు.
ప్రభువును, ఆయన నీతిని, ఆయన ప్రేమను, ఆయన సత్యమును వేరువేరుగా ఉంచలేము. ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన నీతి ప్రేమ సత్యము సమాధానము సంతోషము ఉంటాయి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గానీ, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై యున్నది. ఆయన రాజ్యము కావాలి గానీ, నీతిగా ఉండలేను అంటే కుదరదు. అందరినీ ప్రేమించలేను అంటే కుదరదు. సత్యాన్ని అనుసరించలేను అంటే కుదరదు. ఎందుకంటే ఆయనే మన నీతి, ఆయనే సత్యము, ఆయనే ప్రేమాస్వరూపుడు.
కనుక ముందు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకితే ఈ లోకములో మనకు కావలసినవన్ని అనుగ్రహిస్తాడు. అసలు పరమ తండ్రికి మనమడుగక మునుపే మన అవసరతలు అన్నీ తెలుసు. మన రేపు ఆయనే గనుక రేపటి గురించి ఆలోచించనవసరము లేదు. ఇది నిజము! ప్రభువు నీతిని ఆయన రాజ్యాన్ని కనుగొన్న వారికి ఎటువంటి చింతా ఆరాటము ఉండదు. ఉండకూడదు. కనుక ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని కనుగొని ఆయన నియమాల ప్రకారము జీవించుచు సంతోష సమాధానాలతో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి దినము సహాయపడును గాక.

- మద్దు పీటర్ 9490651256