అంతర్జాతీయం

రష్యా విమానం 71మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, ఫిబ్రవరి 11: రష్యా రాజధాని మాస్కో శివారులో ఓ ప్రయాణికుల విమానం కూలిపోయిన దుర్ఘటనలో 71 మంది దుర్మరణం చెందారు. మాస్కోలోని డొమండెడోవ్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఎఎన్-148 అనే విమానంలో ప్రమాద సమయానికి ఆరుగురు సిబ్బంది, 65మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం మాస్కో నుంచి ఓర్క్స్ పట్టణానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మంటల్లో ఉన్న ఈ విమాన శకలాలు కింద పడటాన్ని తాము చూశామని అర్గునోవో గ్రామ ప్రజల్ని ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. విమాన శకలాలు మంచు ప్రాంతంలో పడ్డ దృశ్యాలు చానళ్లలో ప్రసారం అయ్యాయి. దట్టమైన మంచుకారణంగా ప్రమాద స్థలానికి వెంటనే అత్యవసర సర్వీసు బృందాలను తరలించడం సాధ్యం కాలేదని, కాలినడకనే సిబ్బంది అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని రష్యా ఎమర్జెన్సీ సర్వీసుల విభాగం తెలిపింది. మాస్కో నుంచి బయలుదేరిన నాలుగు నిముషాల్లోనే ఈ విమానం రాడార్ పరిధి నుంచి అదృశ్యమైనట్టు తెలుస్తోంది. మానవ తప్పిదం, దట్టంగా మంచు కురవడం సహా అనేక అంశాలు ఈ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.