అదిలాబాద్

రెవెన్యూ అంశాల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 21: ప్రభుత్వ శాఖల ప్రగతి మెరుగుపడాలంటే రెవెన్యూ శాఖ అధికారులదే కీలక పాత్ర అని, విధులు నిర్వర్తించే చోట నివాసం ఉండని తహశీల్దార్లు, విఆర్‌వోలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ అనుబంధ శాఖల పనితీరు, ప్రగతి నివేదికలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా మిషన్ కాకతీయ, దళితబస్తీ, హరితహారం, పేదలకు రెండు పడకల గదుల ఇళ్ళు, దేవాలయాల భూముల ఆక్రమణలపై కలెక్టర్ స్పందిస్తూ వీటిపై గడవులోగా పనితీరు మెరుగుపర్చి అభివృద్దికి తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా జిల్లాలో పలుచోట్ల రెవెన్యూ, వి ఆర్‌వోలు విధులు నిర్వర్తించే చోట నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు సాగించడం వల్ల ప్రజల సమస్యలు తీరడం లేదన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. జనవరి 25 వరకు తహసీల్దార్లు, విఆర్‌వోలు తప్పనిసరిగా ప్రధాన కేంద్రాలలో నివాసం ఉండాలని, ఈనెల 26 తరువాత నివాసం ఉండని వారికి ఇంటి అద్దె భత్యం నిలిపివేయడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిషన్ కాకతీయ రెండవ దశలో రెవెన్యూ శాఖలదే ప్రధాన పాత్ర ఉందని, ప్రతి చెరువు ఒక మినీ ట్యాంక్ బండ్‌గా తయారు చేయాలని, అందుకోసం రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సమన్వయంతో పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. హరితహారం పథకం ద్వారా నర్సరీలలో ప్రజల డిమాండ్ మేరకు అవసరమైనంత మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. నిరుపేద దళిత కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చేయడానికి ప్రవేశ పెట్టిన దళితబస్తీ పథకం ద్వారా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ భూముల కొనుగోలుపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టిసారించి మండలానికి కనీసం 50 ఎకరాలకు తక్కవకాకుండా భూములు కొనుగోలు చేయాలని అన్నారు. ఇళ్ళులేని నిరుపేదలకు అన్ని సౌకర్యాలతో పాటు రెండు పడక గదుల ఇళ్ళనిర్మాణం కోసం జనవరి 27 నుండి ఫిబ్రవరి 5 వరకు గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తులను వి ఆర్‌వలో ద్వారా సేకరించాలని అన్నారు. ఫిబ్రవరి 8 నుండి 13 వరకు దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించాలని, ఫిబ్రవరి 15 నుండి 25 వరకు గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీ వార్డుల వారీగా గ్రామ సభలు నిర్వహించి అర్హతగల అభ్యర్థుల జాబితాను తయారు చేయాలని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. అర్కియోలాజి శాఖ అధ్వర్యంలో జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూరు డివిజన్‌లోని 37 దేవాలయాలకు సంబంధించి భూముల సరిహద్దులు, అక్రమణకు గురైన భూముల వివరాల సర్వే వారం రోజులలో పూర్తిచేసి నివేదికను అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో మార్కెట్ యార్డుల కొనుగోలు కోసం నాబార్డు ద్వారా నిధులు మంజూరు అయ్యాయని, ఆ నిధుల ద్వారా మార్కెట్ యార్డుల కోసం అవసరమైన భూములను రెండు రోజుల్లోగా సమకూర్చాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి సుందర్ అబ్నార్, ఆసిఫాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి, ఆర్డీవోలు సుధాకర్ రెడ్డి, శివలింగయ్య, ఐలయ్య, ఏవో రవిందర్‌కుమార్, పర్యవేక్షకులు ప్రభాకర్ స్వామి, రాజేశ్వర్, శ్యాంసుందర్, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.